Satya: అమృతం సీరియల్‌లో చిన్న పాత్ర నుంచి స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్ వరకు.. కమెడియన్ సత్య సక్సెస్ అంటే ఇదే!-comedian satya success journey from amrutham serial small role to huge cutouts for mathu vadalara 2 at theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satya: అమృతం సీరియల్‌లో చిన్న పాత్ర నుంచి స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్ వరకు.. కమెడియన్ సత్య సక్సెస్ అంటే ఇదే!

Satya: అమృతం సీరియల్‌లో చిన్న పాత్ర నుంచి స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్ వరకు.. కమెడియన్ సత్య సక్సెస్ అంటే ఇదే!

Sanjiv Kumar HT Telugu
Sep 19, 2024 02:34 PM IST

Mathu Vadalara 2 Comedian Satya Success: మత్తు వదలరా 2 సినిమాతో స్టార్ కమెడియన్ రేంజ్‌కు ఎదిగాడు హాస్య నటుడు సత్య. అది ఎంతలా అంటే ఒక స్టార్ హీరోకు కట్టే కటౌట్స్ రేంజ్‌లో థియేటర్ల ముందు సత్య కటౌట్స్ ఉండటం వరకు. అమృతం సీరియల్‌లో ఒక చిన్న పాత్రతో మొదలైన సత్య నట ప్రస్థానంపై లుక్కేద్దాం.

అమృతం సీరియల్‌లో చిన్న పాత్ర నుంచి స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్ వరకు.. కమెడియన్ సత్య సక్సెస్ అంటే ఇదే!
అమృతం సీరియల్‌లో చిన్న పాత్ర నుంచి స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్ వరకు.. కమెడియన్ సత్య సక్సెస్ అంటే ఇదే!

Mathu Vadalara 2 Comedian Satya Success: మత్తు వదలరా 2 సినిమాతో స్టార్ కమెడియన్ రేంజ్‌కు ఎదిగాడు హాస్య నటుడు సత్య. అది ఎంతలా అంటే ఒక స్టార్ హీరోకు కట్టే కటౌట్స్ రేంజ్‌లో థియేటర్ల ముందు సత్య కటౌట్స్ ఉండటం వరకు. అమృతం సీరియల్‌లో ఒక చిన్న పాత్రతో మొదలైన సత్య నట ప్రస్థానంపై లుక్కేద్దాం.

Comedian Satya Success: ఒక చిన్న పాత్రతో మొదలై స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగిన కథానాయకులు ఎందరో ఉన్నారు. అలాగే డైరెక్టర్ అవుదామనుకుని వచ్చి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నవాళ్లూ ఉన్నారు. అలాంటి వారి కోవలోకే కమెడియన్ సత్య కూడా వస్తాడు.

కామెడీ టైమింగ్

డైరెక్టర్ అవ్వాలని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సత్య ఇప్పుడిప్పుడే స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో, డైలాగ్ డెలీవరీతో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు సత్య. మత్తు వదలరా సినిమాలో "దొంగతనం కాదు తస్కరించుట" అనే డైలాగ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఇప్పుడు మత్తు వదలరా 2లో మెయిన్ లీడ్ రోల్స్‌లో ఒకరిగా ఆకట్టుకుంటున్నాడు.

సునీల్‌కు రీప్లేస్

మత్తు వదలరా 2 సినిమాలో కమెడియన్ సత్య యాక్టింగ్, కామెడీతోపాటు డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయని టాక్ వస్తోంది. బ్రహ్మానందం, సునీల్‌కు రీప్లేస్‌గా సత్య మారాడని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే, ఎంతోమందికి హార్ట్ ఫేవరేట్‌గా నిలిచిన అమృతం సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ఇండస్ట్రీ ప్రయాణం మొదలుపెట్టాడు సత్య.

అన్ హ్యాపీడేస్ పార్ట్ 2

అలా చేస్తున్న సమయంలోనే అమృతం సీరియల్‌లో ఒక చిన్న పాత్ర పోషించి నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు కమెడియన్ సత్య. ఆ సీరియల్‌లోని 'అన్ హ్యాపిడేస్ పార్ట్ 2' ఎపిసోడ్‌లో క్రికేట్ ఆడే ప్లేయర్‌ రాముగా సత్య నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సీరియల్‌లో శ్రీ సింహా కూడా నటించడం విశేషం. దీని తర్వాత నితిన్ ద్రోణ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు సత్య.

రంగబలిలో కామెడీ

ద్రోణలో కూడా చిన్న పబ్‌కు వచ్చే వ్యక్తి పాత్ర పోషించాడు. అలా కళావర్ కింగ్, కోడిపుంజు, పిల్ల జమిందార్, చమ్మక్ చల్లో సినిమాలతో కమెడియన్‌గా ఆకట్టుకున్నాడు. నిఖిల్ స్వామిరారా సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సత్య తర్వాతి ప్రతి సినిమాతో తన మార్క్ చూపించాడు. వీటికంటే రంగబలి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడానికి సత్య కామెడీనే ప్రధాన కారణమని టాక్ రావడం విశేషం.

స్టార్ హీరో రేంజ్‌లో

ఇక మత్తు వదలరా 2 సినిమాతో వాటికిమించి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు కమెడియన్ సత్య. అది ఎంతలా అంటే.. ఒక స్టార్ హీరోకు కట్టే కటౌట్స్ రేంజ్‌లో మత్తు వదలరా 2 సినిమా థియేటర్ల ముందు సత్య కటౌట్స్ దర్శనం ఇచ్చే వరకు. ఒక స్టార్ హీరో రేంజ్‌లో సింహాతోపాటు సత్య కటౌట్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.

సక్సెస్ అంటే ఇది

"ఒక చిన్న పాత్ర నుంచి స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్ పెట్టించుకునే వరకు ఎదగడం అంటే.. ఇది కదా సక్సెస్, సక్సెస్‌కు టైమ్ పడుతుంది, మోస్ట్ ఇన్స్‌ప్రేషనల్ స్టోరీ" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్, ప్రశంసలు వస్తున్నాయి. అలాగే మత్తు వదలరా 2లో సత్య చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.