Singer Engagement Ring: పెళ్లి చేసుకోనున్న స్టార్ సింగర్, నటి.. ఎంగేజ్‌మెంట్‌కు కాస్ట్‌లీ డైమండ్ రింగ్‌.. ఫొటోలు పోస్ట్-american singer actress selena gomez engaged to benny blanco and share instagram photos with engagement diamond ring ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Singer Engagement Ring: పెళ్లి చేసుకోనున్న స్టార్ సింగర్, నటి.. ఎంగేజ్‌మెంట్‌కు కాస్ట్‌లీ డైమండ్ రింగ్‌.. ఫొటోలు పోస్ట్

Singer Engagement Ring: పెళ్లి చేసుకోనున్న స్టార్ సింగర్, నటి.. ఎంగేజ్‌మెంట్‌కు కాస్ట్‌లీ డైమండ్ రింగ్‌.. ఫొటోలు పోస్ట్

Sanjiv Kumar HT Telugu
Dec 12, 2024 12:23 PM IST

Singer Selena Gomez Engagement With Benny Blanco: అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ త్వరలో పెళ్లి చేసుకోనుంది. తాజాగా బెన్నీ బ్లాంకోను నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో ఫొటోలు షేర్ చేసింది. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన సెలెనా గోమెజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పెళ్లి చేసుకోనున్న స్టార్ సింగర్, నటి.. ఎంగేజ్‌మెంట్‌కు కాస్ట్‌లీ డైమండ్ రింగ్‌.. ఫొటోలు పోస్ట్
పెళ్లి చేసుకోనున్న స్టార్ సింగర్, నటి.. ఎంగేజ్‌మెంట్‌కు కాస్ట్‌లీ డైమండ్ రింగ్‌.. ఫొటోలు పోస్ట్

Singer Selena Gomez Engagement Photos Viral: అమెరికన్ స్టార్ సింగర్, హాలీవుడ్ నటి సెలెనా గోమెజ్ త్వరలో పెళ్లి కూతురు కానుంది. తాజాగా బెన్నీ బ్లాంకో అనే వ్యక్తిని సింగర్ సెలెనా గోమెజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఫరెవర్ బిగిన్స్

సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా గురువారం (డిసెంబర్ 12) వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో సెలెనా గోమెజ్ పోస్ట్ చేసింది. తన నిశ్చితార్థానికి సంబంధించిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ "ఎప్పటికీ ఇప్పుడు మొదలవుతుంది (ఫరెవర్ బిగిన్స్ నౌ)" అని క్యాప్షన్ రాసుకొచ్చింది సెలెనా గోమెజ్.

దీంతో సెలెనా గోమెజ్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు కామెంట్ సెక్షన్‌లో శుభకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ అంటూ ఫ్యాన్స్, ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ఫొటోల్లో సెలెనా గోమెజ్ ధరించిన ఎంగేజ్‌మెంట్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

చివరి ఫొటోలో

ఈ ఫోటోల్లో బెన్నీ బ్లాంకో తనకు ఇచ్చిన భారీ ఓవల్ కట్ డైమండ్ ఉంగరాన్ని, వారు చేసిన పిక్నిక్‌ను, సంతోషంగా గడిపిన క్షణాలను అందులో సెలెనా చూపించింది. చివరి ఫోటోలో బెన్నీ తన ఉంగరాన్ని చూపిస్తున్న సెలెనాను కౌగిలించుకుంటున్న పిక్ వాళ్ల ప్రేమను తెలియజేస్తుంది.

ఇదిలా ఉంటే, పీపుల్ మ్యాగజైన్ ప్రకారం, సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్‌లో తమ సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించారు. అయితే, సెలెనా, బెన్నీ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటవారు ప్రకటించడానికి ముందు ఆరు నెలలు కలిసి జీవించారు. అప్పటి నుంచి ఈ జంట సోషల్ మీడియాలో తమ బంధాన్ని రొమాంటిక్ పోస్టుల ద్వారా చాటుతూ వచ్చింది.

పలు ఈవెంట్‌లలో

ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ, ఆప్యాయత వారు పోస్ట్ చేసిన ఫొటోలతో తెలియజేశారు. ఏప్రిల్‌లో న్యూయార్క్ నిక్స్, ఫిలడెల్ఫియా 76 ఎరా బాస్కెట్ బాల్ ఈవెంట్‌ కోర్ట్ సైడ్‌లో, గోల్డెన్ గ్లోబ్స్, ప్రైమ్ టైమ్ ఎమ్మీస్ వంటి ఈవెంట్స్‌తో సహా వివిధ పబ్లిక్ ఈవెంట్లలో వారు కలిసి కనిపించారు. గతంలో పీపుల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోమెజ్‌ను తన బెస్ట్ ఫ్రెండ్‌గా అభివర్ణిస్తూ, వారి రిలేషన్ షిప్ పై ప్రశంసలు కురిపించాడు బ్లాంకో.

"నేను ఆమెను చూసిన ప్రతిసారి అలాగే ఉండిపోతాను. ఇంతకంటే మంచి ప్రపంచం నాకు తెలియదు" అని బ్లాంకో వారి సంబంధాన్ని వ్యక్తపరుస్తూ తెలిపాడు. ఇదిలా ఉంటే, సెలెనా గోమెజ్ ఎమిలియా పెరెజ్ అనే సినిమాతో ఇటీవల ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఈ సంవత్సరం అత్యధిక గోల్డెన్ గ్లోబ్స్ నామినేషన్లను పొందింది.

ఎమిలియా పెరెజ్ మూవీ 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. స్పానిష్ మ్యూజికల్ థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చిన ఈ సినిమాలో సెలెనా గోమెజ్, జో సల్డానా, కార్లా సోఫియా గాస్కాన్, అడ్రియానా పాజ్ నటించారు.

Whats_app_banner