RRR Stars on Japanese Magazine: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కూడా లభించడంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వెస్టర్న్ ఆడియెన్స్‍ను మాత్రమే కాకుండా జపాన్‌లోనూ ఈ మూవీ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ ఈ చిత్రానికి 1 బిలియన్ యెన్(దాదాపు రూ.60 కోట్లు) వసూళ్లు వచ్చాయి. తాజాగా మరో అరుదైన గుర్తింపు తెచ్చుకుంది ఈ చిత్రం. ఓ జపనీస్ మ్యాగజైన్ కవప్ పేజీపై ఆర్ఆర్ఆర్ స్టార్ల ఫొటోలు ప్రచురితమయ్యాయి.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి ఫొటోలు 'యాన్ యాన్' అనే జపనీస్ కవర్ మ్యాగజైన్‌పై ప్రచురితమయ్యాయి. ఈ సినిమాలో వారి నటనకు జపాన్ ప్రేక్షకులు ఫిదా కావడమే కాకుండా.. అ దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. దీంతో ఓ జపనీస్ మ్యాగజైన్ తన కవర్ పేజీపై ఈ స్టార్ల ఫొటోలను పబ్లీశ్ చేసింది.
తమ హీరోలకు ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఇరువురి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఈ చిత్రం ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యిందో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కవర్ పేజీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా 1 బిలియన్ యెన్ వసూళ్లు సాధించడమే కాకుండా.. ఇంకా కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.