Sunisith Comments on NTR: తన్నులు తిన్నా.. తగ్గట్లేదుగా..! ఈ సారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతుల్లో మనోడికి మూడిద్దేమో-sacrificing star sunisith controversial comments on jr ntr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunisith Comments On Ntr: తన్నులు తిన్నా.. తగ్గట్లేదుగా..! ఈ సారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతుల్లో మనోడికి మూడిద్దేమో

Sunisith Comments on NTR: తన్నులు తిన్నా.. తగ్గట్లేదుగా..! ఈ సారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతుల్లో మనోడికి మూడిద్దేమో

Maragani Govardhan HT Telugu
May 17, 2023 05:08 PM IST

Sunisith Comments on NTR: ఇటీవల రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్.. త్వరలో ఎన్టీఆర్ అభిమానుల చేతుల్లో మూడేలా ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఎన్టీఆర్‌పై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఎన్టీఆర్‌పై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు

Sunisith Comments on NTR: శాక్రిఫైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునిశిత్.. తనను తాను హీరోగా చెప్పుకుంటూ తెగ ఎచ్చులు పోతుంటాడు. లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నానని, తమన్నాతో డేటింగ్ చేశానని ఒక్కటేమిటి టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లపై షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తుంటాడు. అతడేదే ప్రవచనాలు వల్లిస్తున్నాడనుకుని పలు యూట్యూబ్ ఛానల్స్ వరుసగా ఇంటర్వ్యూలు తీసుకుంటూ సునిశిత్‌ను మరింత లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చాయి. ఇంక తన నోటికి హద్దు, అదుపు లేకుండా ఎంత పడితే మాట్లాడుతూ వివాదానికి తెరలేపుతున్నాడు మన శాక్రిఫైజింగ్ స్టార్.

ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సునిశిత్.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో కొంతమంది అతడిని విపరీతంగా కొట్టారు. ఎంతలా అంటే తనే స్వయంగా ఉపాసన గురించి తప్పుగా మాట్లాడనని, క్షమించాల్సింది కోరాడు. అంతటితో ఆగకుండా వాళ్లు సునిశిత్‌కు డబ్బులు కూడా ఇచ్చి ఈ సారి ఎప్పుడూ రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడకూడదని హెచ్చరించి వదిలేశారు.

ఇదిలా ఉంటే మొన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిశిత్‌కు త్వరలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతుల్లో మనోడికి మూడేలా ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తారక్ తనకు క్లోజ్ అని చెప్పిన సునిశిత్ అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ పోర్న్ ఫిల్మ్స్‌లో నటించాడంటూ పెద్ద బాంబ్ పేల్చాడు. ఎన్టీఆర్ పోర్న్ చిత్రాలు ఉన్నాయని, ఈ విషయంలో టాలీవుడ్‌లో సునిశిత్ అనే హీరో తప్పా ఇంకెవ్వరూ చెప్పరని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో ఇప్పటికే ఓ సారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిపై దాడి చేసేంత వరకు వెళ్లారు. తాజాగా అతడి వ్యాఖ్యలకు ఈ సారి చావు దెబ్బలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులు దేహశుద్ధి చేసి కాస్త డబ్బులు ఇచ్చి వదిలిపెట్టారు. ఎన్టీఆర్‌ గురించి వాగిన సునిశిత్‌పై నెట్టింట ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వార్నింగులు వస్తున్నాయి. ఈ సారి కనపడితే ఇంకో సెలబ్రెటీ గురించి మాట్లాడాలంటేనే భయపడేలా అతడిని చితక్కొట్టి గట్టి వార్నింగ్ ఇవ్వాలని కామెంట్లు పెడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Whats_app_banner