Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ను మ‌ధ్యాహ్నం మిస్స‌యిన రాత్రి చూడొచ్చు - రీ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే!-brahmamudi serial re telecast timings star maa serial disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ను మ‌ధ్యాహ్నం మిస్స‌యిన రాత్రి చూడొచ్చు - రీ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే!

Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ను మ‌ధ్యాహ్నం మిస్స‌యిన రాత్రి చూడొచ్చు - రీ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే!

Nelki Naresh Kumar HT Telugu
Dec 21, 2024 02:25 PM IST

Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ప్ర‌స్తుతం స్టార్ మా ఛానెల్‌లో మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు టెలికాస్ట్ అవుతోంది. మ‌ధ్యాహ్నం ఎపిసోడ్‌ మిస్స‌యిన ఫ్యాన్స్ కోసం స్టార్ మా మ‌రోసారి ఈ సీరియ‌ల్‌ను రీ టెలికాస్ట్ చేయ‌బోతున్న‌ది. రాత్రి ప‌దిన్న‌రకు బ్ర‌హ్మ‌ముడి స్టార్ మాలో తిరిగి ప్ర‌సార‌మ‌వుతోంది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్

Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి గ‌త నెల వ‌ర‌కు స్టార్ మా ఛానెల్‌లో టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ సీరియ‌ల్‌గా కొన‌సాగింది. టైమ్ ఛేంజ్‌తో ఈ సీరియ‌ల్ జాత‌కం మొత్తం మారిపోయింది. నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నుంచి టాప్ టెన్‌కు ప‌డిపోయింది.

సీరియ‌ల్ టైమ్ ఛేంజ్‌పై బ్ర‌హ్మ‌ముడి ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయ్యారు. తిరిగి ఈ సీరియ‌ల్‌ను ఏడున్న‌ర గంట‌ల‌కు టెలికాస్ట్ చేస్తే బాగుంటుంద‌ని పోస్ట్‌లు పెడుతోన్నారు.

రీ టెలికాస్ట్‌...

ప్ర‌స్తుతం బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ మ‌ధ్నాహ్నం ఒంటిగంట‌కు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. మ‌ధ్నాహ్నం సీరియ‌ల్‌ను మిస్స‌యిన ఫ్యాన్స్ కోసం మ‌రోసారి బ్ర‌హ్మ‌ముడిని రీ టెలికాస్ట్ చేస్తోంది స్టార్ మా. రాత్రి ప‌దిన్న‌ర నుంచి ప‌ద‌కొండు గంట‌ల వ‌ర‌కు బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది.

సీరియ‌ల్‌ను రాత్రి ఏడున్న‌ర నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు మార్చ‌డంతో సీరియ‌ల్ వ్యూయ‌ర్‌షిప్ త‌గ్గుముఖం ప‌ట్టింది. దూర‌మైన సీరియ‌ల్ ల‌వ‌ర్స్‌ను తిరిగి ఆక‌ట్టుకోవ‌డానికి స్టార్ మా ఛానెల్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ప‌దిన్న‌ర స్లాట్‌లోకి మ‌రో కొత్త సీరియ‌ల్ వ‌చ్చే వ‌ర‌కు బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ను రీ టెలికాస్ట్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఐదు వంద‌ల ఎపిసోడ్స్ పూర్తి...

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఈ సోమ‌వారం నాటితో ఆరు వంద‌ల ఎపిసోడ్స్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ది. లాంగ్ టైమ్ టీఆర్‌పీలో టాప్ ప్లేస్ లో కొన‌సాగిన సీరియ‌ల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో మాన‌స్ నాగుల‌ప‌ల్లి, దీపికా రంగ‌రాజు లీడ్ పాత్ర‌ల్లో న‌టించారు.

రాజ్‌, కావ్య‌గా వీరిద్ద‌రి కెమిస్ట్రీ, యాక్టింగ్ సీరియ‌ల్‌కు హైలైట్‌గా నిలిస్తూ వ‌స్తోంది. కిర‌ణ్ కాంత్‌, నైనిషా రాయ్‌, ష‌ర్మితా గౌడ‌, నిఖితా చౌద‌రి ఈ సీరియ‌ల్‌లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

కుమార్ పంతం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. బెంగాళీ సీరియ‌ల్ గాట్చోరా ఆధారంగా బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ రూపొందింది. క‌న్న‌డంలోనూ స‌ప్త‌ప‌ది పేరుతో బ్ర‌హ్మ‌ముడి డ‌బ్ అయ్యింది. \

త్వ‌ర‌లోనే ఎండ్ కార్డ్‌...

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌కు త్వ‌ర‌లోనే ఎండ్‌కార్డ్ ప‌డ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దుగ్గిరాల ఫ్యామిలీకి ఎదుర‌య్యే క‌ష్టాలు, రాజ్‌, కావ్య కాపురంలోని క‌ల‌త‌ల్లో కొన్నాళ్లుగా డ్రామా అంతంగా ప‌డ‌టం లేదు.

సీరియ‌ల్‌ను ఎక్కువ కాలం ల్యాగ్ చేస్తూ ఆడియెన్స్ బోర్‌గా ఫీల‌య్యేలా చేయ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు స‌మాచారం. సీరియ‌ల్ ఎండింగ్‌కు చేరుకోవ‌డం కూడా టైమ్ ఛేంజ్‌కు ఓ కార‌ణ‌మ‌ని అంటున్నారు.

రాజ్‌, కావ్య క‌లిసిపోవ‌డ‌మే కాకుండా దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్క‌టి చేసి సీరియ‌ల్‌కు శుభం కార్డు ప‌ల‌కాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు స‌మాచారం. బ్ర‌హ్మ‌ముడికి మాతృక అయిన బెంగాలీ సీరియ‌ల్ గాట్చోరా కూడా ఏడు వంద‌ల ఎపిసోడ్స్‌తోనే ముగిసింది. బ్ర‌హ్మ‌ముడిని కూడా అన్నే ఎపిసోడ్స్‌తో ఎండ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Whats_app_banner