Rashmika Mandanna Sorry: హీరోయిన్ రష్మికపై ట్రోల్స్.. సారీ చెప్పిన పుష్ప బ్యూటీ.. విషయం ఏంటంటే..
Rashmika Mandanna Sorry: దళపతి విజయ్ సినిమా విషయంలో రష్మిక మందాన ఓ విషయం తప్పుగా చెప్పారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో సారీ చెబుతూ రష్మిక ట్వీట్ చేశారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ప్రస్తుతం వరుస సక్సెస్‍లను ఎంజాయ్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మిక నటించిన పుష్ప 2 చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. భారీ కలెక్షన్లతో రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా రష్మిక మందాన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను తొలుత థియేటర్లో చూసిన సినిమా గురించి చెబుతూ పొరపాటు చేశారు. దీనిపై ట్రోల్స్ వస్తుండటంతో రష్మిక స్వయంగా స్పందించారు. ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
రీమేక్‍ను తప్పుగా చెప్పిన రష్మిక
ఏ పాటను తొలుత ఎక్కువగా పాడే వారని ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందానకు ప్రశ్న ఎదురైంది. దీంతో గిల్లీ పాట అని చెప్పారు. “గిల్లీ.. నాకు దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను పెద్ద స్క్రీన్‍పై చూసిన తొలి యాక్టర్ ఆయనే. పోకిరి చిత్రానికి గిల్లీ రీమేక్ అని నాకు ఇటీవలే తెలిసింది. గిల్లీలోని అపిడిపోడే పాటను నా జీవితంలో ఎక్కువగా పర్ఫార్మ్ చేశా. నేను ముందుగా స్క్రీన్‍పై చూసింది విజయ్, త్రిషనే. వారితో నేను ప్రేమలో పడిపోయా” అని రష్మిక అన్నారు.
పొరపాటు ఇదే
దళపతి విజయ్ చేసిన గిల్లీ సినిమా.. మహేశ్ బాబు నటించిన తెలుగు బ్లాక్‍బస్టర్ ‘ఒక్కడు’ చిత్రానికి తమళ రీమేక్. అయితే, దీన్ని పోకిరీ రీమేక్ అని రష్మిక తప్పుగా చెప్పారు. పోకిరీ చిత్రాన్ని పొక్కిరి పేరుతో విజయ్ రీమేక్ చేశారు. దీంతో ఒక్కడు, పోకిరి సినిమాల రీమేక్‍ల విషయంలో రష్మిక కన్‍ఫ్యూజ్ అయ్యారు. గిల్లీ.. పోకిరీ రీమేక్ అని తప్పుగా చెప్పేశారు.
రష్మికపై ట్రోల్స్
పోకిరీ రీమేక్ గిల్లీ అని రష్మిక చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇలా చెప్పావేంటి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫేవరెట్ మూవీ అని అంటూ ఇలా తప్పు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా రష్మికపై నెట్టింట్ ట్రోలింగ్ జరుగుతోంది.
సారీ చెప్పిన రష్మిక
ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతుండడం రష్మిక గుర్తించారు. పోకిరీ రీమేక్ గిల్లీ ఏంటి రాషు అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ అయిన వీడియోకు సారీ అంటూ కామెంట్ చేశారు. “అవును.. తెలుసు సారీ. ఒక్క బూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనుకున్నా.. రేయ్ గిల్లీ.. ఒక్కడు రా అని. పోక్కిరి.. పోకిరి అని. సోషల్ మీడియాలో ఇప్పుడు ఏస్తుంటారు అని. సారీ.. సారీ.. కానీ నాకు అన్ని సినిమాలు ఇష్టం. అందుకే ఇట్స్ ఓకే” అని క్యూట్‍గా ట్వీట్ చేశారు రష్మిక.
రష్మిక మందాన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‍లో చావా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు రష్మిక. సల్మాన్ ఖాన్‍తో సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకుడిగా ఉన్నారు. తెలుగులో గర్ల్‌ఫ్రెండ్ మూవీ కూడా చేస్తున్నారు రష్మిక.