Kubera Glimpse: ధనుష్, నాగార్జున, రష్మిక కుబేర గ్లింప్స్ రిలీజ్.. మహేష్ బాబు చేతుల మీదుగా..-kubera glimpse released dhanush nagarjuna rashmika mandanna sekhar kammula movie glimpse released by mahesh babu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kubera Glimpse: ధనుష్, నాగార్జున, రష్మిక కుబేర గ్లింప్స్ రిలీజ్.. మహేష్ బాబు చేతుల మీదుగా..

Kubera Glimpse: ధనుష్, నాగార్జున, రష్మిక కుబేర గ్లింప్స్ రిలీజ్.. మహేష్ బాబు చేతుల మీదుగా..

Hari Prasad S HT Telugu
Nov 15, 2024 08:03 PM IST

Kubera Glimpse: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, డైరెక్టర్ శేఖర్ కమ్ములలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న కుబేర మూవీ గ్లింప్స్ వీడియో శుక్రవారం (నవంబర్ 15) రిలీజైంది. మహేష్ బాబు ఈ గ్లింప్స్ రిలీజ్ చేయడం విశేషం.

ధనుష్, నాగార్జున, రష్మిక కుబేర గ్లింప్స్ రిలీజ్.. మహేష్ బాబు చేతుల మీదుగా..
ధనుష్, నాగార్జున, రష్మిక కుబేర గ్లింప్స్ రిలీజ్.. మహేష్ బాబు చేతుల మీదుగా..

Kubera Glimpse: కుబేర రూపంలో మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతున్న సంగతి తెలుసు కదా. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోని స్టార్ హీరోలు నాగార్జున, ధనుష్ లతోపాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో ఆసక్తికరంగా సాగింది.

కుబేర గ్లింప్స్ వీడియో

టాలీవుడ్ లో భిన్నమైన సినిమాలను అందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అలాంటి డైరెక్టర్ తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో కుబేరతో వస్తున్నాడు. ఈ సినిమా కోసం అతడు ఎంచుకున్న నటీనటులు కూడా సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశారు. ధనుష్, నాగార్జున, రష్మిక, జిమ్ సర్బాలాంటి యాక్టర్స్ నటిస్తున్న కుబేర నుంచి గ్లింప్స్ వీడియో శుక్రవారం (నవంబర్ 15) కార్తీక పౌర్ణమి సందర్బంగా రిలీజైంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ గ్లింప్స్ లాంచ్ చేశాడు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉన్న స్టోరీ లైన్ ఏంటన్నది మాత్రం దీని ద్వారా రివీల్ కాలేదు. సినిమాలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటిస్తుండగా.. జిమ్ సర్బా ఓ కోటీశ్వరుడిగా కనిపించాడు. ఇక నాగార్జున రోల్ ఏంటో తేలాల్సి ఉంది. ఈ గ్లింప్స్ వీడియోలో నాగ్ తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడుపుడుతున్నట్లు మాత్రం చూపించారు. మధ్యలో రష్మిక కూడా కనిపించినా.. ఆమె పాత్రపైనా స్పష్టత రాలేదు.

బిచ్చగాడిగా కనిపించే ధనుష్.. గ్లింప్స్ చివర్లో సాంప్రదాయ దుస్తుల్లో ఓ ఆలయం ముందు దేవుడికి దండం పెడుతున్నట్లు చూపిస్తూ ముగించడం ఆసక్తి రేపుతోంది. ముంబైలోని ధారావి మురికివాడ బ్యాక్‌డ్రాప్ లో ఈ వీడియో మొదలైంది. ఓ బిచ్చగాడి నుంచి కోటీశ్వరుడి స్థాయికి ఓ వ్యక్తి ఎదిగిన తీరును సినిమాలో చూపించబోతున్నట్లుగా అనిపిస్తోంది.

కుబేర మూవీ గురించి..

కుబేర మూవీ నుంచి గతంలోనే ధనుష్, నాగార్జున, రష్మికలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. అంతేకాదు ఆ మధ్య తిరుపతిలో షూటింగ్ లోకేషన్ నుంచి ధనుష్ లుక్ కూడా లీక్ కాగా.. ఆ వెంటనే అతనికి సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఇప్పటి వరకూ హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి యూత్‌ఫుల్ స్టోరీస్ తో వచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తొలిసారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కుబేర గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా ధనుష్, నాగార్జున, రష్మికలాంటి పెద్ద నటీనటులతోనూ అతడు తొలిసారి పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడు.

ఈ కుబేరకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ గ్లింప్స్ లో అతని బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా ఆకట్టుకునేలా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ లో సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కుబేర టీజర్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Whats_app_banner