Aishwarya Sharma: డైరెక్టర్ నన్ను అక్కా అని పిలిచేవారు.. నేనేమో అలా.. కొత్త హీరోయిన్ ఐశ్వర్య శర్మ కామెంట్స్
Aishwarya Sharma About Drinker Sai Director: డ్రింకర్ సాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్ ఐశ్వర్య శర్మ. డిసెంబర్ 27న డ్రింకర్ సాయి మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డ్రింకర్ సాయి డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి తనను అక్క అని పిలిచేవాడని చెప్పుకొచ్చింది ఐశ్వర్య శర్మ.
Aishwarya Sharma About Drinker Sai Director: టాలీవుడ్‌లోకి ఎప్పుడు కొత్త అమ్మాయిలు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. వారిలో అతికొద్దిమంది మాత్రమే మంచి క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతారు. అయితే, తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్త ముద్దుగుమ్మ ఐశ్వర్య శర్మ.
బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ ట్యాగ్‌లైన్
డ్రింకర్ సాయి సినిమాతో టాలీవుడ్‌కి కొత్త హీరోయిన్‌గా పరిచయం కానుంది ఐశ్వర్య శర్మ. ఈ సినిమాలో హీరోగా ధర్మ చేశాడు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అని ట్యాగ్ ఉన్న డ్రింకర్ సాయి సినిమాకు కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు.
డిసెంబర్ 27న రిలీజ్
ఇప్పటికే విడుదలైన డ్రింకర్ సాయి మూవీ టీజర్, సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక డ్రింకర్ సాయి మూవీని డిసెంబర్ 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా కొత్త హీరోయిన్ ఐశ్వర్య శర్మ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో డైరెక్టర్ తనను అక్క అని పిలిచేవారని ఆసక్తికర విశేషాలు చెప్పింది ఐశ్వర్య శర్మ.
మంచి ప్రేమకథను చూస్తారు
- ప్రేమతో మనకు విడదీయరానికి అనుబంధం ఉంటుంది. మన జీవితంలోని ప్రతి దశలో, ప్రతి సందర్భంలో ప్రేమను అనుభూతి చెందుతాం. "డ్రింకర్ సాయి"లో ఒక మంచి ప్రేమకథను చూస్తారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంతో కొన్ని మంచి విషయాలు కూడా చెబుతున్నాం. అవి ఇప్పుడు రివీల్ చేస్తే స్క్రీన్ మీద ఎంజాయ్ చేయలేరు.
మెడికల్ స్టూడెంట్‌గా కనిపిస్తా
- నేను ఇందులో బాగీ అనే పాత్ర చేస్తున్నాను. బాగీ క్యారెక్టర్‌లో ఇన్నోసెంట్‌గా కనిపిస్తాను. అలాగే రఫ్ అండ్ టఫ్‌గా, స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఇందులో మెడికల్ స్టూడెంట్‌గా కనిపిస్తాను. నా క్యారెక్టర్‌లో ఫన్ కూడా ఉంటుంది. ట్రైలర్, మిగతా కంటెంట్ చూశాక బాగీ క్యారెక్టర్ మీద మీకొక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. అయితే సినిమా చూస్తే మీకు బాగి క్యారెక్టర్ పూర్తిగా అర్థమవుతుంది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్‌కు భిన్నంగా నా క్యారెక్టర్ ఉంటుంది.
ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు
- మా డైరెక్టర్ కిరణ్ ఫన్నీ పర్సన్. మా మీద ఎలాంటి ప్రెజర్ పెట్టలేదు. షూటింగ్ అంతా సరదాగా చేశాం. సెట్‌లో నన్ను అక్క అని పిలిచేవారు. నేను ఆయనను అన్నా అని పిలిస్తే.. లేదు నేను నీకు తమ్ముడిని , తమ్ముడు అని పిలువు అనేవారు. ఈ క్యారెక్టర్‌లో నేను పర్‌ఫార్మ్ చేయగలను అని బాగా నమ్మారు కిరణ్ గారు. ఎంతో సపోర్ట్ చేశారు.
ధనుష్ నా ఫేవరేట్ యాక్టర్
- మా ఇంట్లో ఫ్యామిలీ అంతా సౌత్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మూవీస్ చాలా బాగుంటాయి. అర్థవంతమైన కథ, సహజంగా సినిమాలను రూపొందిస్తుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో పార్ట్ అవడం సంతోషంగా ఉంది. ధనుష్ నా ఫేవరేట్ యాక్టర్. నేను ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా చూశాను.