Netflix OTT: నయనతారకు 10 కోట్ల లీగల్ నోటీసులు పంపిన హీరో ధనుష్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అడ్డంకిపై హీరోయిన్ ఫైర్-nayanthara shocking comments on dhanush over sending 10 cr legal notice for netflix ott documentary ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott: నయనతారకు 10 కోట్ల లీగల్ నోటీసులు పంపిన హీరో ధనుష్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అడ్డంకిపై హీరోయిన్ ఫైర్

Netflix OTT: నయనతారకు 10 కోట్ల లీగల్ నోటీసులు పంపిన హీరో ధనుష్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అడ్డంకిపై హీరోయిన్ ఫైర్

Sanjiv Kumar HT Telugu
Nov 16, 2024 03:21 PM IST

Nayanthara About Dhanush Over Netflix Documentary: హీరో ధనుష్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ నయనతార. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్‌కు సంబంధించిన విషయంలో పది కోట్ల లీగల్ నోటీసులను ధనుష్ పంపించడంపై సౌత్ లేడి సూపర్ స్టార్ ఫైర్ అయింది.

నయనతారకు 10 కోట్ల లీగల్ నోటీసులు పంపిన హీరో ధనుష్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అడ్డంకిపై హీరోయిన్ ఫైర్
నయనతారకు 10 కోట్ల లీగల్ నోటీసులు పంపిన హీరో ధనుష్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అడ్డంకిపై హీరోయిన్ ఫైర్

Nayanthara Comments On Dhanush: కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ వర్సెస్ నయనతార హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటివరకు సైలెంట్‌గా జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికతో బహిరంగంగా మారింది. తాజాగా ధనుష్‌పై నయనతార షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు రూ. పది కోట్ల లీగల్ నోటీసులు పంపించడంపై మండిపడింది.

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ

అయితే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నయనతార బయోగ్రఫీకి సంబంధించిన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 18 నుంచి నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. అందులో నేను రౌడీనే మూవీ షూటింగ్ సమయంలో చిత్రీకరించిన 3 సెకన్ల వీడియోను వాడారు.

పదికోట్ల నష్టపరిహారం

నేను రౌడీనే మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే, తన అనుమతి లేకుండా మూవీలోని క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్‌లో భాగంగా ఏకంగా రూ. 10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు ధనుష్. గత కొన్ని రోజులుగా ఈ ఫైట్ నడుస్తూనే ఉంది. ఇద్దరి మధ్య కాంప్రమైజ్ కుదరకపోవడంతో నయన్ బయటపడింది.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా

ధనుష్‌పై తెగ ఫైర్ అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు పేజీల పోస్ట్ చేసింది నయనతార. అందులో "తండ్రి సోదరుడు, అన్నయ్య ప్రముఖ డైరెక్టర్ కావడంతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావి ఆశిస్తున్నా. సినిమా అనేది ఒక యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లో పోరాడి నేను ఈ స్థాయిలో ఉన్నాను" అని నయనతార తెలిపింది.

మనసు ముక్కలైంది

"నా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డాక్యుమెంటరీ కోసం కొంతమంది సినీ ప్రముఖులు సహాయం చేశారు. కానీ, నీకు మాపై పగ ఉంది. కానీ, అది ఈ డాక్యుమెంటరీ కోసం కష్టపడిన వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. నా ఆత్మీయులు చెప్పిన మాటలు నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ, నాకు ఎంతో స్పెషల్ అయిన నేను రౌడీనే క్లిప్స్ మాత్రం వాడలేకపోయాం. అందులోని సాంగ్స్ డాక్యుమెంటరికీ చాలా బాగా సెట్ అవుతాయి. అందుకోసం నిన్ను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కలు చేసింది" అని నయనతార చెప్పింది.

చాలా దారుణం

"కాపీరైట్ పరంగా సమస్యలు వస్తాయని నువ్ ఇలా చేసుండొచ్చు. కానీ, చాలాకాలంగా మాపై కక్ష పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తుంది. నేను రౌడీనే షూటింగ్ సమయంలో మేం మా ముబైల్స్‌తో తీసుకున్న వీడియోను ట్రైలర్‌లో 3 సెకన్స్ వాడుకున్నందుకు పది కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం" అని నయనతార అంది.

దిగజారుతావ్ అనుకోలేదు

"నువ్ ఇంతల దిగజారుతావ్ అనుకోలేదు. దీన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. సినిమా రిలీజ్ అయి పదేళ్లు దాటింది. అది బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకల్లోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. నీకు తెలిసినవాళ్లు విజయం సాధించడం చూసి ఇగో పెంచుకున్నావ్. దాన్ని మనసులో నుంచి తీసేస్తావని ఆశిస్తున్నా" అని నయనతార చెప్పుకొచ్చింది.

Whats_app_banner