Aishwarya Sharma: అర్జున్ రెడ్డి క్లాసీ డ్రింకర్, మా సాయి మాసీ డ్రింకర్.. విజయ్ దేవరకొండ మూవీపై హీరోయిన్ ఐశ్వర్య శర్మ
Aishwarya Sharma Comments On Drinker Sai Movie: టాలీవుడ్‌లోకి కొత్తగా వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య శర్మ. డ్రింకర్ సాయి మూవీతో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్న ఐశ్వర్య శర్మ ఆ సినిమాకు సంబంధించిన యాక్టింగ్, డబ్బింగ్ వంటి విశేశాలతోపాటు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిపై కామెంట్స్ చేసింది.
Aishwarya Sharma About Drinker Sai Movie: ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. ఈ సినిమాను ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు.
డ్రింకర్ సాయి హైలెట్స్
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి డ్రింకర్ సాయి సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 27న డ్రింకర్ సాయి సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం (డిసెంబర్ 20) జరిగిన ఇంటర్వ్యూలో "డ్రింకర్ సాయి" సినిమాకు సంబంధించిన హైలైట్స్, సినీ విశేషాలను హీరోయిన్ ఐశ్వర్య శర్మ తెలిపారు.
బాధ్యతగా ఫీలయ్యాను
-"డ్రింకర్ సాయి" సినిమాలో నా క్యారెక్టర్ పేరు బాగీ. ఈ కథ విన్నప్పుడు నాది చాలా బలమైన క్యారెక్టర్ అనిపించింది. ఈ క్యారెక్టర్‌ను జెన్యూన్‌గా ప్రజంట్ చేయాలని బాధ్యతగా ఫీలయ్యాను. నటిగా నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని సీన్స్ ఇస్తే చేసి చూపించాను. అందులో పర్ఫామెన్స్ నచ్చి ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. బాగీ క్యారెక్టర్‌కు మీరు బాగా కనెక్ట్ అవుతారు.
స్టేజ్ యాక్టర్
- మా నాన్న స్టేజ్ యాక్టర్. నాపైనా ఆ ప్రభావం తెలియకుండానే పడింది. చిన్నప్పటి నుంచి ఆర్టిస్టుగానే ఉండాలనుకున్నాను. డ్యాన్సర్, సింగర్ కావాలనేది నా కోరిక. ఈ ఫీల్డ్‌లోకి రాకుంటే ఫలానా జాబ్ చేయాలనే ఆప్షన్ కూడా పెట్టుకోలేదు. 12 క్లాస్ పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ కోర్సు పూర్తయ్యాక ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. గతంలో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లలో నటించలేదు. కొన్నియాడ్స్‌లో నటించాను. "డ్రింకర్ సాయి"తో హీరోయిన్‌గా మీ ముందుకు వస్తున్నా.
ఎదుర్కొన్న సమస్య అదొక్కటే
- తెలుగమ్మాయిని కాకపోవడం వల్ల డైలాగ్స్ చెప్పేప్పుడు ఇబ్బందిగా ఉండేది. నేను ఏ డైలాగ్ చెబుతున్నాను అనేది అర్థమయ్యేది కాదు. ఈ సినిమా చేసేప్పుడు భాష ఒక్కటే నేను ఎదుర్కొన్న సమస్య. అది తప్ప సెట్‌లో నటిస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను.
సపోర్టివ్‌గా ఉన్నాడు
-హీరో ధర్మతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. పర్సనల్‌గా చాలా మంచివాడు. "డ్రింకర్ సాయి" క్యారెక్టర్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం అతనిది. డైలాగ్స్ చెప్పడంలో నాకు సపోర్టివ్‌గా ఉన్నాడు. ఈ చిత్రంలో సాయి పాత్రలో తను బాగా పర్‌ఫార్మ్ చేశాడు.
మా సాయి మాసీ డ్రింకర్
- మా చిత్రంలో సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని సాడ్ సాంగ్ వింటున్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ మంచి సాంగ్స్ చేశారు. అర్జున్ రెడ్డి చిత్రంతో మా "డ్రింకర్ సాయి" సినిమాకు పోలిక లేదు. అర్జున్ రెడ్డి క్లాసీ డ్రింకర్. మా సాయి మాసీ డ్రింకర్.