Vidudala 2: తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ, ఆయన ప్రళయరాజాలా అనిపిస్తాడు.. నిర్మాత చింతపల్లి రామారావు కామెంట్స్-producer chintapalli rama rao comments on vijay sethupathi viduthalai 2 movie and ilaiyaraja music over telugu rights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vidudala 2: తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ, ఆయన ప్రళయరాజాలా అనిపిస్తాడు.. నిర్మాత చింతపల్లి రామారావు కామెంట్స్

Vidudala 2: తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ, ఆయన ప్రళయరాజాలా అనిపిస్తాడు.. నిర్మాత చింతపల్లి రామారావు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 19, 2024 06:38 AM IST

Producer About Vijay Sethupathi Viduthalai 2: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ విడుదల 2. కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాత చింతపల్లి రామారావు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ, ఆయన ప్రళయరాజాలా అనిపిస్తాడు.. నిర్మాత చింతపల్లి రామారావు కామెంట్స్
తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ, ఆయన ప్రళయరాజాలా అనిపిస్తాడు.. నిర్మాత చింతపల్లి రామారావు కామెంట్స్

Producer About Vijay Sethupathi Vidudala Part 2: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అగ్ర దర్శకుడు వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'విడుదల-2'.

విడుదల 2 సినిమా డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాత, శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు విడుదల 2 మూవీ తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు నిర్మాత చింతపల్ల రామారావు. ఈ సందర్భంగా ఆయన బుధవారం (డిసెంబర్ 18) విడుదల 2 చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.

విడుదల-2 చిత్రం ఎలా ఉండనుంది?

పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే 'విడుదల-2'. మనతో మిళితమైన అంశాలతో కూడిన కథ. ఇలాంటి కథలు మన నేటివిటికి సరిపోతుంది అని ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నాను.

యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం అందరిని పెట్టుబడి దారి వ్యవస్థ నుంచి ఎలా బయటపడేలా చేశారు అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ చిత్రం తెలుగు నేటివిటికి ఎలా సరిపోతుంది?

ఈ చిత్రం తమిళంలో తీసిన తెలుగు నేటివిటి కథ. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ.

విజయ్‌సేతుపతి పాత్ర ఎలా ఉండబోతుంది?

నటుడిగా ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ చిత్రంలో పెరుమాళ్‌ పాత్రకు ఆయన నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్‌ పాత్రలో విజయ్ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్‌ ఆయన పండించిన విధానం అద్భుతం. నటుడిగా విజయ్‌ సేతుపతి ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రంతో ఆయన పేరు మరింత పెరుగుతుంది. ప్రజాసంక్షేమం కోసం కోరిన వ్యక్తి తమ వాళ్లను కుటుంబాన్ని కూడా వదిలి ఎలాంటి త్యాగాలు చేశాడు? అనేది ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది.

ఇళయరాజా సంగీతం గురించి?

ఈ చిత్రానికి ఇళయరాజా నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో ఆయన సంగీతంతో ప్రళయరాజాలా అనిపిస్తాడు.

ఇంకా ఈ చిత్రంలో ప్రధాన హైలైట్స్‌ ఏమిటి?

ఈ చిత్రంలో పీటర్‌ హెయిన్స్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌పై చూడని పోరాటాలు సమాకూర్చాడు. మంజు వారియర్ సహజ నటన ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. విజయ్‌, మంజు వారియర్‌ మధ్య ఎమోషన్స్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలు అందర్ని కంటతడిపెట్టిస్తాయి.

Whats_app_banner