Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఫుల్లు హ్యాపీనే.. ఆర్థిక సమస్యలు తీరుతాయి ప్రమోషన్లు, జీతం పెంపు-today rasi phalalu today december 19th rasi phalalu these zodiac signs will get money and changes in job and promotions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఫుల్లు హ్యాపీనే.. ఆర్థిక సమస్యలు తీరుతాయి ప్రమోషన్లు, జీతం పెంపు

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఫుల్లు హ్యాపీనే.. ఆర్థిక సమస్యలు తీరుతాయి ప్రమోషన్లు, జీతం పెంపు

HT Telugu Desk HT Telugu
Dec 19, 2024 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 19.12.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు ఫుల్లు హ్యాపీనే ఆర్థిక సమస్యలు తీరుతాయి
Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు ఫుల్లు హ్యాపీనే ఆర్థిక సమస్యలు తీరుతాయి

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.12.2024

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : గురువారం, తిథి : కృ, చవితి, నక్షత్రం : ఆశ్లేష

మేష రాశి

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. తీసుకున్న ఋణములు భారమయ్యే అవకాశముంది. వాగ్వివాదములకు చోటులేకుండా జాగ్రత్తపడాలి.

వృషభ రాశి

అన్నదమ్ముల సహకారం ఉంటుంది. సుఖసంతోషాలకు లోటుండదు. ఆస్తుల విలువలు పెరగడం, రత్నములు మణులు మొదలగు వస్తువులను అమ్మివేయడం వలన ఆదాయం కల్గుతుంది. మిత్రులు బంధువులతో ఆశావహంగా గడుపుతారు.

మిథున రాశి

ఇది ఆనందదాయకమైన, అదృష్టవంతమైన కాలం. మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. వ్యాజ్యాల విషయాల్లో కూడా ఉపశమనం కనిపిస్తుంది. మీ స్థితి మరియు సంపాదన కూడా మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి

సహోద్యోగులతో వివాదాలను ఉత్తమంగా తప్పించుకోవాలి. విద్యార్థుల ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చదువు విషయంలో మరింత కృషి మరియు శ్రద్ధ అవసరం కావచ్చు. పెట్టుబడులకు సమయం కాదు.

సింహ రాశి

మీ తోబుట్టువులు మీతో మంచి సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీకు మంచి సామాజిక జీవితం ఉంటుంది. మీరు సంగీతం, కళలు మొదలైన సృజనాత్మక విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది.

కన్య రాశి

అధికారం, సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుంది. భౌతికసుఖాలను, విలాసాలను అనుభవిస్తారు. మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు మరియు ఆనందకరమైన జీవనశైలితో జీవనంలో ముందుకు సాగుతారు.

తుల రాశి

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంచుకుని, వక్తృత్వపు పోటీల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయం సాధిస్తారు. వ్యవసాయ దారులకు అధికదిగుబడుల వలన ఆదాయం, అన్ని వృత్తుల వారికి సమృద్ధి.

వృశ్చిక రాశి

ధనం నిల్వచేస్తారు. కళత్ర పుత్రులతో సుఖజీవనం. కుటుంబ వాతావరణం బాగుంటుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు బాగుంటుంది.

ధనుస్సు రాశి

దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మార్గావరోధాలు కల్గుతాయి. ఫ్లూ జ్వరాలు, కండరముల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంది.

మకర రాశి

వ్యవసాయదారులకు కలసివచ్చే సమయం. శత్రువులపై జయం. వృత్తి ఉద్యోగాలలో గౌరవం, ఆర్థిక పరిపుష్టి, కుటుంబవృద్ధి అవుతుంది. వ్యాపారాలలో ముందంజ, ఆర్థికలాభాలు వస్తాయి.

కుంభ రాశి

అభివృద్ధి మరియు లాభాలను పొందే శుభ తరుణం ఇది. ఈ కాలంలోనే ఉద్యోగ విషయంలో ఉన్నతి అంటే ప్రమోషన్ మరియు జీతం పెంపు కల్గుతుంది. కొత్త అవకాశాలను పొందుతారు.

మీన రాశి

స్నేహితుల నుండి మద్దతు మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు. సంపద వృద్ధిని సూచిస్తోంది. ఆర్థికసమస్యల నుండి బయటపడతారు. సమాజంలో మెరుగైన స్థానం మరియు ఆనందాన్ని అనుభవించే సమయం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner