Mumbai boat accident: ముంబై తీరంలో పెను ప్రమాదం; స్పీడ్ బోటు ఢీ కొని నీట మునిగిన ఫెర్రీ; 13 మంది దుర్మరణం-mumbai boat accident speedboat rams into elephanta cave ferry killing 13 onboard ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mumbai Boat Accident: ముంబై తీరంలో పెను ప్రమాదం; స్పీడ్ బోటు ఢీ కొని నీట మునిగిన ఫెర్రీ; 13 మంది దుర్మరణం

Mumbai boat accident: ముంబై తీరంలో పెను ప్రమాదం; స్పీడ్ బోటు ఢీ కొని నీట మునిగిన ఫెర్రీ; 13 మంది దుర్మరణం

Sudarshan V HT Telugu
Dec 18, 2024 09:49 PM IST

Mumbai boat accident: ముంబై సముద్ర దీరంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్ కు ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీని నేవీ బోట్ వేగంగా ఢీ కొనడంతో, ఆ ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.

ముంబై తీరంలో ఫెర్రీ ప్రమాదం
ముంబై తీరంలో ఫెర్రీ ప్రమాదం (Indian Coast Guard)

Mumbai boat accident: ముంబై సముద్ర తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 10 మంది పర్యాటకులు ఉన్నారు. ముంబై తీరంలో గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్ కు ప్రయాణీకులతో వెళ్తున్న ఫెర్రీ ‘నీల్ కమల్’ ను భారత నౌకాదళానికి చెందిన స్పీడ్ బోట్ వేగంగా ఢీ కొట్టింది. దాంతో, నీల్ కమల్ ఫెర్రీ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 100 మందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించింది.

yearly horoscope entry point

ఆన్ లైన్ వీడియో

ముంబై ఫెర్రీ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ప్రమాదంలో స్పీడ్ బోట్ బోల్తా పడింది. సముద్రంలో నీల్ కమల్ ఫెర్రీ వెళ్తుండగా, దాని సమీపంలో నేవీకి చెందిన స్పీడ్ వేగంగా చక్కర్లు కొడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ తరువాత క్రమంగా ఆ నేవీ బోట్ వేగంగా ఫెర్రీ వైపు దూసుకువెళ్లి, బలంగా ఆ బోటును ఢీ కొట్టింది. దాంతో, ఆ ఫెర్రీ నీటమునిగింది.

ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా..

ముంబైలోని ఎలిఫెంటా గుహలకు నీల్ కమల్ ఫెర్రీ బోటు సిబ్బందితో సహా మొత్తం 85 మంది ప్రయాణికులతో వెళ్తోందని బృహన్ ముంబై (mumbai) మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన తాజా ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 3.15 గంటలకు బోటు తన ప్రయాణాన్ని ప్రారంభించిందని, మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. ‘‘ఈ రోజు మధ్యాహ్నం ముంబై హార్బర్ లో ఇంజిన్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా ఇంజిన్ పనిచేయకపోవడంతో భారత నౌకాదళానికి చెందిన ఓ స్పీడ్ బోట్ అదుపు తప్పింది. ఫలితంగా పడవ ప్యాసింజర్ ఫెర్రీని ఢీకొనడంతో అది మునిగిపోయింది’’ అని నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియాకు తూర్పున 11 కిలోమీటర్ల దూరంలో ఎలిఫెంటా ద్వీపం ఉంది.

సహాయ చర్యలు..

11 నేవీ బోట్లు, మూడు మెరైన్ పోలీస్ బోట్లు, ఒక కోస్ట్ గార్డ్ పడవతో భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగించాయి. పోలీసులు, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి చెందిన సిబ్బంది, ఆ ప్రాంతంలోని స్థానిక మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. నాలుగు హెలికాఫ్టర్లను కూడా రంగంలోకి దింపారు. ‘‘'ముంబై హార్బర్ లో ప్యాసింజర్ ఫెర్రీ, ఇండియన్ నేవీ క్రాఫ్ట్ ఢీకొన్న ఘటనలో విలువైన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. రెండు నౌకల్లోని నావికాదళ సిబ్బంది, పౌరులతో సహా గాయపడిన సిబ్బంది అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు’’ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.

ఎలిఫెంటా కేవ్స్

ముంబై హార్బర్ లోని ఎలిఫెంటా ద్వీపంలో ఉన్న ఎలిఫెంటా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. పురాతన రాతి-కత్తిరించిన వాస్తుశిల్పం, సంక్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి. క్రీ.శ 5, 7 వ శతాబ్దాల మధ్య కాలం నాటి ఈ గుహలు ప్రారంభ భారతీయ శిల్పుల నైపుణ్యం, కళాత్మకతకు నిదర్శనం, హిందూ మరియు బౌద్ధ వారసత్వానికి ఒక ముఖ్యమైన ప్రదేశంగా పనిచేస్తాయి.

Whats_app_banner