Telangana Tourism : కాకతీయుల వారసత్వానికి ప్రతిరూపం 'పాకాల'.. ఆనందం, ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్!
- Telangana Tourism : వరంగల్ ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది కాకతీయులు. వారి పాలన గురించి మాట్లాడటం మెదలు పెడితే.. చెరువులతోనే ప్రారంభించాలి. అందులో ముఖ్యంగా పాకాల సరస్సుకు ప్రత్యేక పేజీలు ఉంటాయి. అలాంటి పాకాల అందాలు ఇప్పుడు పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయి.
- Telangana Tourism : వరంగల్ ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది కాకతీయులు. వారి పాలన గురించి మాట్లాడటం మెదలు పెడితే.. చెరువులతోనే ప్రారంభించాలి. అందులో ముఖ్యంగా పాకాల సరస్సుకు ప్రత్యేక పేజీలు ఉంటాయి. అలాంటి పాకాల అందాలు ఇప్పుడు పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయి.
(1 / 5)
కాకతీయుల పాలనలో చెరువుల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి కాలంలో తవ్విన చెరువులు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాయి. అలా గుర్తింపు పొందిన చెరువుల్లో.. వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు ఒకటి. ప్రపంచ మంచినీటి సరస్సుల్లో 7వ స్థానంలో నిలించింది. 8 శతాబ్దాల ఘన చరిత్ర ఈ సరస్సుకు ఉంది. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.(@TeluguJambuDwip)
(2 / 5)
పాకాలలో చిలుకల గట్టు , తూములు, కాలువలు, మత్తడి ప్రాంతం, అభయారణ్యం, బట్టర్ ఫ్లై పార్కు, ఔషధ పార్కు, ఉద్యాన వనం, టవర్ వ్యూ పాయింట్ లాంటి ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. జల సవ్వడితో దూకే పాకాల మత్తడిని చూడటానికి వేలాది మంది పర్యాటకులు నిత్యం వస్తుంటారు. (@TeluguJambuDwip)
(3 / 5)
విభిన్న వృక్ష, జంతు జాతులకు కేరాఫ్ అడ్రస్ పాకాల అభయారణ్యం. పాకాల సరస్సు ఆనుకొని దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ అడవుల మధ్యలో ఈ సరస్సు ఉంటుంది. పాకాల వాగు, కాలువలు అడవి మధ్యలోంచి వెళ్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆ అందాలను మాటల్లో వర్ణించలేం.(@TeluguJambuDwip)
(4 / 5)
ఇంత ఘన కీర్తి ఉన్న పాకాల.. ఇటీవల నిర్లక్ష్యానికి గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపంతో.. బోటింగ్ నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ రిసార్ట్స్, అతిథి గృహాలు నిర్మించినా.. కరోనా కాలంలో మూసేశారు. మళ్లీ తెరవలేదు. పార్కులో ఆట వస్తువులు పనికిరాకుండా ఉన్నాయి. వీటిపై అధికారులు దృష్టి పెడితే.. సౌకల సౌకర్యాలతో పాకాల విరాజిల్లుతుంది.(@TeluguJambuDwip)
(5 / 5)
పాకాల ప్రాముఖ్యతకు తగ్గట్టుగా పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వివరించారు. ఇటీవ పాకాలను సందర్శించిన ఎమ్మెల్యే.. తూములు, కట్ట కింది భాగం, కాలువలను పరిశీలించారు. పాకాలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. వ్యూ పాయింట్, పార్క్‌ను సందర్శించారు. పట్టణ పార్కుల అభివృద్ధిలో భాగంగా మంజూరైన రూ.50 లక్షల నిధులతో పాకాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.(@TeluguJambuDwip)
ఇతర గ్యాలరీలు