వైజాగ్ నుంచి థాయ్లాండ్ ట్రిప్ - ఐల్యాండ్ లో స్పీడ్ బోట్ జర్నీ, ప్యాకేజీ వివరాలివే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 01, 2024

Hindustan Times
Telugu

    వైజాగ్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.  MAGICAL THAILAND EX VISHAKHAPATNAM పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

image credit to unsplash

    5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. వైజాగ్ నుంచి అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 7, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 

image credit to unsplash

   ఫస్ట్ డే వచ్చేసి… విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. ముందుగా బ్యాకాంక్ కు(Flight No. FD-117) చేరుకుంచారు. రెండో రోజు వచ్చేసి…. పట్టాయాకు వెళ్తారు. లంచ్ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత Nong Nooch Garden Tour ఉంటుంది. రాత్రి పట్టాయాలోనే ఉంటారు.

image credit to unsplash

 మూడో రోజు టిఫిన్ చేసిన తర్వాత,,, Coral Island Tourకు వెళ్తారు. స్పీడ్ బోట్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత పట్టాయాకు వస్తారు.నాల్గోవ రోజు సఫారీకి వెళ్తారు. ఆ తర్వాత బ్యాకాంక్ కు చేరుకుంటారు. పలు ప్రాంతాలను సందర్శిస్తారు. 

image credit to unsplash

ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. Half day City Tour ఉంటుంది. ఇందులో భాగంగా గోల్డెన్ బుద్దాను చూస్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో లంచ్ ఉంటుంది. ఆ తర్వాత Shri Racha Tiger Zooకి వెళ్తారు. ఆరో రోజు ఉదయం Grand Palaceను సందర్శిస్తారు. లంచ్ తర్వాత సాయంత్రం 6 గంటలకు బ్యాకాంక్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 10.20 గంటలకు విశాఖకు చేరుకుంటారు.

image credit to unsplash

వైజాగ్ - థాయ్ లాండ్ టూర్  టికెట్ ధరలు చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 66735, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 57815గా ఉంది. ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 57815గా నిర్ణయించారు.  ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

image credit to unsplash

    https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.    8287932318, 9281495847, 8287932227 సందేహాల నివృత్థి కోసం ఈ నెంబర్లను సంప్రదించవచ్చు.

image credit to unsplash

దురదగొండి ఆకులో అద్భుత ఔషధ గుణాలు