దురదగొండి ఆకులో శక్తిని సమకూర్చే పోలిసాకరైడ్స్, ఎలక్జీని నిరోధించే హిస్టామైన్ ఉంటాయి
దురదగొండి ఆకుల్లో నరాలను, గుండె కండరాలను సక్రమంగా పనిచేయించే ఎసిటైల్ అనే న్యూరోట్రాన్స్‌మీటర్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ఐరన్, కెరోటినాయిడ్స్ ఉంటాయి.
దురద గొండి ఆకుల్లో చర్మ సంరక్షణకు తోడ్పడే సిలిసిక్ యాసిడ్‌తో పాటు విటమిన్ ఇ కూడా పుష్కలంగా లభిస్తుంది.
దురద గొండి ఆకుల్ని శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో, పాశ్చాత్య దేశాల్లో ప్రకృతి ఔషధంగా వినియోగిస్తున్నారు.
రక్త హీనత, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధులు, చర్మ వ్యాధులను నివారించడంలో దురదగొండి ఆకులు ఉపయోగపడతాయి.
దురద గొండి ఆకుల్లో పురుషల్లో వచ్చే ప్రోస్టేట్ సమస్యలు, గుండె జబ్బులు, రుతువులు మారినపుడు వచ్చే ఎలర్జీలకు ఔషధంగా వినియోగిస్తారు.
శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలో దురదగొండి చక్కగా పనిచేస్తుంది.
నిత్యం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీటిలో రకరకాల విషపదార్ధాలు శరీరంలో చేరి వ్యాధుల బారిన పడుతుంది. శరీరంలో మలినాలను తొలగించడానికి చర్మం, ఊపిరితిత్తులు, కాలేయం, లింఫ్ గ్రంథులు, కిడ్నీలు నిరంతరం పనిచేస్తుంటాయి.
శరీరంలో కాలుష్యం అవయవాల శక్తికి మించి పేరుకుపోయినపుడు నెటిల్ లీఫ్, డాండిలియన్ టీ మలినాలను తొలగించడంలో ఉపయోగపడతాయి.
నెటిల్ టీ శ్లేష్మంతో కూడిన దగ్గును ఆయాసంతో కూడిన అస్తమాను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
దురదగొండి ఆకులు రక్త హీనత, ఐరన్ లోపం అధిగమించడానికి ఉపకరిస్తుంది. శరీరం ఐరన్ త్వరగా ఇముడ్చుకోడానికి ఈ ఆకులు ఉపకరిస్తాయి.
మోకాళ్ల నొప్పులతో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధులను నయం చేస్తుంది. దీర్ఘకాలం పాటు వీటిని వాడాల్సి ఉంటుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల సంభవించే గౌట్ వ్యాధి పరిష్కారానికి దురదగొండి ఆకులు చక్కటి పరిష్కారం ఇస్తాయి. గౌట్ సమస్యలతో బాధపడే వారు రోజుకు రెండు కప్పులు టీ తీసుకోవాల్సి ఉంటుంది.
శరీర వాపులు, హృద్రోగాలకు దురదగొండి ఆకులు చక్కటి పరిష్కారం ఇస్తాయి. లివర్, కిడ్నీలు, లింఫ్ గ్రంధులు సక్రమంగా పనిచేయడానికి ఈ ఆకులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి.
చలికాలంలో గుమ్మడి గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో మెగ్నీషియం ఫుష్కలంగా ఉంటుంది.