Pushpa 2 Deleted Scenes: డిలీట్ చేసిన సీన్స్‌ను యాడ్ చేసి పుష్ప 2 టైటిల్ సాంగ్ రిలీజ్.. థియేటర్లలో కనిపించింటే విజిల్సే
Pushpa Pushpa Video song: పుష్ప 2 నుంచి టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్‌లో థియేటర్లలో చూపించిన కొన్ని సీన్స్ కనబడటంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంత మంచి సీన్స్ ఎందుకు డిలీట్ చేశారంటూ సుకుమార్‌ను ప్రశ్నిస్తున్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ గత రెండు వారాల నుంచి బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల వసూళ్లకి చేరువగా ఉన్న పుష్ప 2 మూవీలో.. నిడివి కారణంగా కొన్ని సీన్స్‌ను డిలీట్ చేశారు. వాటిని ఇప్పుడు యాడ్ చేసి తాజాగా టైటిల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సాంగ్‌ను చూసిన అభిమానులు.. ఇంత మంచి సీన్స్‌ను ఎందుకు డిలీట్ చేశారు? అని దర్శకుడు సుకుమార్‌పై మండిపడుతున్నారు.
పుష్ప క్రికెట్ టోర్నీ
పుష్ప 2 టైటిల్ సాంగ్‌లో ఒక లిరిక్‌తో పాటు కొన్ని సీన్స్‌ను డిలీట్ చేసినట్లు.. ఇప్పుడు వీడియో సాంగ్ ద్వారా బహిర్గతమైంది. ఆ సీన్స్ ఏంటంటే.. పుష్పని తన చిన్నతనంలో ఎక్కడైతే క్రికెట్‌ను స్నేహితులు ఆడనివ్వలేదో.. అక్కడే పిల్లలతో కలిసి క్రికెట్ టోర్నీని పుష్ప నిర్వహిస్తాడు. అలానే ఆ పిల్లలందరూ పుష్ప స్టయిల్, మేనరిజంతో స్టెప్‌లు వేసే సీన్స్‌ను యాడ్ చేశారు. వాస్తవానికి ఈ సీన్స్ థియేటర్లలో పడింటే విజిల్స్ పడేవి అని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
రన్ టైమ్ కోసం కట్
పుష్ప 2లో ట్రైలర్‌లో కనిపించిన చాలా సీన్స్ సినిమాలో కనిపించలేదు. కొన్ని పుష్ప 3 కోసం సుకుమార్ దాచినట్లు కామెంట్స్ చేస్తున్న అభిమానులు.. నిడివి కోసం డిలీట్ చేసిన సీన్లు యాడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ‘పుష్ప 2: ది రూల్’ రన్ టైమ్ ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు కావడంతో థియేటర్ వెర్షన్‌లో ఆ సీన్స్‌ను యాడ్ చేసే అవకాశం లేదు. దాంతో కొన్ని రోజుల్లోనే డిలీట్ సీన్స్‌ను చిత్ర యూనిట్ ప్రత్యేకంగా విడుదల చేసే అవకాశం ఉంది.
ఆ ఇద్దరి క్యారెక్టర్స్ కుదింపు
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. అయితే.. సునీల్, అనసూయ కాంబినేషన్‌లో పెద్దగా సీన్స్ రాలేదు. బహుశా నిడివి కోసం సుకుమార్ డిలీట్ చేశాడేమో అని అభిమానులు భావిస్తున్నారు. అలానే ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్‌ను కూడా అర్ధాంతరంగా ముగించడంపై కూడా అభిమానులు పెదవి విరిచారు.