Game Changer New Song: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో రిలీజ్
Game Change New Song: రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే మూడు పాటలు, ట్రైలర్ రిలీజ్ అవగా అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దాంతో నాలుగో సాంగ్ రిలీజ్‌కి చిత్ర యూనిట్ సిద్ధమైంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై వోల్టేజ్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో బుధవారం ధోప్ అంటూ మరో సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.కియారా అడ్వాణి, రామ్ చరణ్
జోష్ పెంచుతున్న గేమ్ ఛేంజర్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. దాంతో చాలా రోజుల ముందు నుంచే ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. రోజుల వ్యవధిలో వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ హైప్‌ను మరింత పెంచుతోంది. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు మూడు పాలు రిలీజైన విషయం తెలిసిందే.
ఆచార్య తర్వాత నిరాశలో మెగా ఫ్యాన్స్
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో మెగా అభిమానుల ఆశలన్నీ ఈ గేమ్ ఛేంజర్‌పైనే ఉన్నాయి. శంకర్ కూడా భారతీయుడు -2 నిరాశపరచడంతో చాలా పట్టుదలతో ఈ మూవీని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్ తండ్రి, కొడుకు పాత్రల్లో నటిస్తున్నాడు.
సుకుమార్ చీఫ్ గెస్ట్
గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణి నటించగా.. ధోప్ సాంగ్ లిరికల్ ఫుల్ సాంగ్‌ను డిసెంబరు 22న విడుదల చేయబోతున్నట్లు ప్రొమోలో చూపించారు. గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలోని డల్లాస్‌లో చేయనున్నారు. పుష్ప2తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పోటీ
వాస్తవానికి సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌కి రెండు సినిమాలు పోటీగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్, వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.