Prasad Behara Arrest : లైంగిక వేధింపుల ఆరోపణలు-యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్టు
Prasad Behara Arrest : లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. తనను లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదుతో పోలీసులు ప్రసాద్ పై కేసు నమోదు చేశారు.
Prasad Behara Arrest : యూట్యూబర్ ప్రసాద్ బెహరాను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టుచే శారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఓ వెబ్ సిరీస్ నటిస్తున్న తనను ప్రసాద్ బెహరా తనను లైంగికంగా వేధించాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు...ప్రసాద్ బెహరాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పలు వెబ్ సిరీస్ లతో పాటు కమిటీ కుర్రాళ్లు సినిమాలో ప్రసాద్ బెహరా నటించారు.
ప్రసాద్ బెహరా, బాధిత యువతి ఏడదిన్నరగా ఓ వెబ్ సిరీస్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అనంతరం క్షమాపణలు చెప్పాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడని బాధిత యువతి తెలిపింది. మరోసారి అందరి ముందు తనను దుర్భాషలాడాడని ఆరోపించింది.
కమిటీ కుర్రాళ్లు సినిమాలో పెద్దోడు పాత్రతో ఆకట్టుకున్న ప్రసాద్ బెహరా...ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చల మల్లి సినిమాలో నటించారు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన ప్రసాద్ బెహరా.. కామెడీ సిరీస్ లు చేస్తూ యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న ప్రసాద్ బెహరాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడం, తాకడం వంటివి చేసేవాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యూట్యూబర్ భానుచందర్ అరెస్టు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ చేసిన యూట్యూబర్ భానుచందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన భానుచందర్ఘట్ కేసర్ వద్ద ఔటర్ రింగురోడ్డుపై చెట్ల పొదల్లో డబ్బులు వెదజల్లుతూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియో తీశారు. మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో వీడియోలు తీసి వైరల్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో.. ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు...భానుచందర్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
సంబంధిత కథనం
టాపిక్