Bhavani Deekshalu: డిసెంబర్ 21 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, కొలిక్కి వచ్చిన ఏర్పాట్లు-bhavanis fast on indrakiladri to end from december 21 arrangements finalized ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhavani Deekshalu: డిసెంబర్ 21 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, కొలిక్కి వచ్చిన ఏర్పాట్లు

Bhavani Deekshalu: డిసెంబర్ 21 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, కొలిక్కి వచ్చిన ఏర్పాట్లు

Dec 18, 2024, 03:56 PM IST Bolleddu Sarath Chandra
Dec 18, 2024, 03:56 PM , IST

  • Bhavani Deekshalu: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు పూర్తయ్యాయి.  డిసెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దీక్షల విరమణకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు.ఏపీతో పాటు  తెలంగాణ, తమిళనాడు, ఒడిస్సాల నుంచి లక్షలాదిగా భక్తులు  విజయవాడకు  తరలి వస్తారు.

భవానీ దీక్షల విరమణ కోసం రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి ఇరుముళ్లను (దీక్షా విరమణ) సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. గతంలో దీక్షల విరమణలో తొక్కిసలాట జరిగిన భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు కూడా ఉండటంతో రద్దీని నియంత్రించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

(1 / 6)

ఈ ఏడాది భవానీ దీక్షల విరమణకు  6లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు, భక్తులకు 15 లక్షల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసినట్టు వివరించారు ,భక్తులకు ఏమైనా ఇబ్బంది అయితే పరిష్కరించేందుకు  కాల్ సెంటర్లు కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు, ప్రతి ఒకరోజు లక్ష పైనే భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ,భక్తులు స్నానాలు చేసే ఘాట్లను పరిశీలించారు. భవానీలు ఎంత భక్తితో అమ్మవారిని దర్శించుకుంటారు అంతే భక్తితో ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కలెక్టర్‌ తెలియజేశారు.

(2 / 6)

పవిత్రమైన భవాని దీక్షలు చేపట్టి దీక్ష విరమణ చేయడానికి విజయవాడ వచ్చే ప్రతి ఒక్కరూ ఈ భవాని దీక్షా 2024 (Bhavani Deeksha 2024) యాప్ ను విరివిగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. భవానీ దీక్షల విరమణ సమయం సమీపిస్తుండటంతో విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువున ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.  

(3 / 6)

లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు  ఇంద్రకీలాద్రి దిగువున హోమగుండంతో పాటు  బారికేడ్లతో క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

(4 / 6)

విజయవాడ పాతబస్తీలోని వినాయక టెంపుల్ దగ్గర నుండి ప్రారంభం అయ్యే క్యూ లైన్స్, సీతమ్మ వారి పాదాలు సమీపంలోని హోల్డింగ్ ఏరియా, కేశఖండన శాల, స్నానఘాట్ల వద్ద జల్లు స్థానాలను , ప్రసాదం కౌంటర్లను, దుర్గాఘాట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రదేశాల వద్ద రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా మరియు గిరి ప్రదక్షణ సమయంలో భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు  సీపీ, కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. 

(5 / 6)

ఈనెల 21 నుంచి 25వరకు భవానీ దీక్షలు విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ భవాని దీక్షా విరమణ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయం చేసుకుని భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లను చేస్తున్నట్టు సీపీ రాజశేఖర్‌ బాబు తెలిపారు.  వివిధ ప్రాంతాల నుండి వెహికల్స్ మీద వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.  భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో విజయవాడ సీపీతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మునిసిపల్ కమిషనర్‌, దుర్గగుడి ఈవో ఉన్నారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు