హీరో ఎక్స్ పల్స్ 200 4వీ ప్రో డాకర్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే-hero motocorp launches hero xpulse 200 4v pro dakar edition ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హీరో ఎక్స్ పల్స్ 200 4వీ ప్రో డాకర్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే

హీరో ఎక్స్ పల్స్ 200 4వీ ప్రో డాకర్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే

Dec 18, 2024, 12:00 PM IST Anand Sai
Dec 18, 2024, 12:00 PM , IST

  • Hero XPulse 200 4V Pro Dakar Edition : హీరో మోటోకార్ప్.. హీరో ఎక్స్ పల్స్ 200 4వీ ప్రో డాకర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలేంటో చూద్దాం..

ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త బైక్ హీరో ఎక్స్ పల్స్ 200 4వి ప్రో డాకర్ ఎడిషన్ ను విడుదల చేసింది. డిసెంబర్ 18 నుండి బుక్ చేసుకునేందుకు అవకాశం ఉన్న ఈ బైక్ పాత హీరో ఎక్స్ పల్స్ 200 4వితో పోలిస్తే కొన్ని ప్రత్యేక మార్పులతో వస్తుంది. ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

(1 / 5)

డిజైన్ విషయానికొస్తే బైక్ బాడీ ప్యానెల్స్ సాధారణ ఎక్స్ పల్స్ 2004వి మాదిరిగానే ఉంటాయి. అయితే డాకర్ ఎడిషన్ డాకర్ ర్యాలీ నుండి స్ఫూర్తితో వచ్చినట్టుగా కనిపిస్తుంది.

(2 / 5)

ఫ్యూయల్ ట్యాంక్‌లో డాకర్ లోగోతో కూడిన పెద్ద స్టిక్కర్, అలాగే సైడ్ ప్యానెల్‌పై హీరో ప్రత్యేక గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ బైక్ ప్రత్యేకమైన, రేసింగ్ లుక్‌ను ఇస్తుంది. ఇది ఆఫ్-రోడ్ రైడింగ్ ఔత్సాహికులకు నచ్చే ఫీచర్.

(3 / 5)

హీరో ఎక్స్ పల్స్ 200 4వి ప్రో డాకర్ ఎడిషన్ మెరుగైన ఆఫ్-రోడింగ్ కోసం అనేక ఫీచర్లతో వచ్చింది. ఫ్రంట్ సస్పెన్షన్ 250 మిమీ. ఇది సర్దుబాటు చేయగల టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. అత్యంత క్లిష్టమైన రోడ్లపై కూడా సౌకర్యవంతంగా నడుస్తుంది.

(4 / 5)

ఈ బైక్ మూడు ఏబీఎస్ మోడ్‌లకు జతచేసి ఉంది. ఇది బైక్ బ్రేకింగ్ పనితీరు, సేఫ్టీని కూడా మెరుగుపరుస్తుంది. 199.6 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 18.9 బిహెచ్‌పీ, 17.35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.1.67 లక్షలు(ఎక్స్ షోరూమ్, దిల్లీ)గా ఉంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు