తెలుగు న్యూస్ / ఫోటో /
Ashwin Retirement: సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. కోహ్లితో చాలాసేపు మాట్లాడిన తర్వాతే..
- Ashwin Retirement: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ మధ్యలోనే అతడీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మూడో టెస్టు చివరి రోజు టీ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి అతన్ని హగ్ చేసుకున్నప్పుడే ఆ అనుమానం వచ్చింది.
- Ashwin Retirement: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ మధ్యలోనే అతడీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మూడో టెస్టు చివరి రోజు టీ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి అతన్ని హగ్ చేసుకున్నప్పుడే ఆ అనుమానం వచ్చింది.
(1 / 5)
Ashwin Retirement: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన కాసేపటికే ఈ విషయాన్ని బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది. నిజానికి టీ సమయంలో అశ్విన్ ను కోహ్లి హగ్ చేసుకున్నప్పుడే ఈ అనుమానం వచ్చింది. అంతకుముందు అతనితో అశ్విన్ చాలాసేపు మాట్లాడాడు.
(2 / 5)
Ashwin Retirement: డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి, అశ్విన్ మధ్య చాలాసేపు తీవ్రంగా చర్చ జరిగింది. మధ్యలో ఒకసారి అశ్విన్ ను కోహ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. అప్పుడే రిటైర్మెంట్ ఊహాగానాలు రాగా.. ఆ కాసేపటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.
(3 / 5)
Ashwin Retirement: 38 ఏళ్ల అశ్విన్ టెస్టు క్రికెట్ లో 537 వికెట్లు తీసుకున్నాడు. లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే (619) తర్వాత టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న ఘనత అశ్విన్‌దే. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మూడో టెస్టు చివరి రోజు సందర్భంగా కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐకి అతడు వెల్లడించాడు. టెస్టు ముగియగానే రిటైర్మెంట్ విషయాన్ని బోర్డు తెలిపింది.
(4 / 5)
Ashwin Retirement: మ్యాచ్ తర్వాత అశ్విన్ మాట్లాడాడు. “అంతర్జాతీయ క్రికెటర్ గా ఇదే నా చివరి రోజు. నేను ఎన్నో జ్ఞాపకాలను క్రియేట్ చేసుకున్నాను. డ్రెస్సింగ్ రూమ్ లో మేము చివరి బ్యాచ్ ఓజీస్. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. బీసీసీఐ, నా టీమ్మేట్స్, అందరు కోచ్ లకు థ్యాంక్స్. ఇండియా ఇంటర్నేషనల్ క్రికెటర్ గా ఇదే నా చివరి రోజు. నేను క్లబ్ క్రికెట్ ఆడతాను” అని అశ్విన్ మ్యాచ్ తర్వాత చెప్పాడు.(Surjeet Yadav)
ఇతర గ్యాలరీలు