Brain Teaser: ఈ బ్రెయిన్ టీజర్‌లో ముగ్గురిలో పుచ్చకాయను డ్రెస్సులో దాచిందెవరు? అయిదు సెకన్లలో కనిపెట్టండి
Brain Teaser: బ్రెయిన్ టీజర్లు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇక్కడ ఒక బ్రెయిన్ టీజర్‌ను ఇచ్చాము. దీన్ని చూసి మీరు జవాబును ఐదు సెకన్లలోనే కనిపెట్టాలి.
మెదడుకు పదును పెట్టే బ్రెయిన్ టీజర్లు, ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు పరిష్కరించడం ముఖ్యం. చదువుకునే పిల్లలకు ఇవి తార్కిక శక్తిని అందిస్తాయి. పరిశీలనా నైపుణ్యాన్ని, సమస్యలను సాధించే సామర్థ్యాన్ని పెంచుతాయి. మెదడుకు మేతలా ఉండే బ్రెయిన్ టీజర్లు, ఆప్టికల్ ఇల్యూషన్లను మీ పిల్లల చేత అప్పుడప్పుడు సాధించేందుకు ప్రయత్నించండి. ఇక్కడ మేము ఒక బ్రెయిన్ టీజర్ ఇచ్చాము. దీన్ని చూసి మీరు కేవలం 5 సెకన్లలోనే జవాబును కనిపెట్టాలి.
ఇక్కడ ముగ్గురు మహిళలు ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. అయితే అందులో ఇద్దరు మాత్రమే నిజంగా గర్భం ధరించిన వారు. ఇంకొకరు పుచ్చకాయను దొంగిలించి డ్రెస్ లో దాచుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీరు కనిపెట్టి చెప్పాలి. ఈ ఫోటోలో ఉన్న అన్ని వస్తువులను పరిశీలిస్తే మీకు త్వరగా పుచ్చకాయను దాచిపెట్టిన స్త్రీ ఎవరో కనిపెట్టేయవచ్చు.
ఎక్కువ సమయాన్ని ఇస్తే ఎవరైనా కనిపెడతారు. ఐదు సెకన్లలో కనిపెడితే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని మీరు తోపు అని ఒప్పుకున్నట్టే. ప్రపంచంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఐదు సెకన్లలో ఈ బ్రెయిన్ టీజర్ ను సాధించారు.
బ్రెయిన్ టీజర్ జవాబు
ఈ బ్రెయిన్ టీజర్ చిత్రంలో ఇచ్చిన ప్రతి స్త్రీ రూపాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను గమనించండి. వారు నిల్చున్న భంగిమ, ముఖ కవళికలు, వ్యక్తీకరణ కూడా చూడండి. అలాగే బేబీ బంప్ ఆకారాన్ని కూడా ఒకసారి గమనించండి. జవాబును 5 సెకన్లలోనే కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబు విషయానికి వస్తే మొదటి మహిళ అంటే A మహిళ పుచ్చకాయను దొంగిలించింది. ఆమె గర్భిణీ అయితే ఆమె కొనడానికి రెడీ అయిన వస్తువులన్నీ కూడా ఆరోగ్యానికి కీడు చేసేవే. మిగతా ఇద్దరూ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకున్నారు. ఏ మహిళ మాత్రం ఆడడానికి టెన్నిస్ బ్యాట్, బాల్స్‌ను, కెచప్‌లు, సాస్‌లు వంటివి తీసుకుంది. గర్భంతో ఉన్న మహిళకు వాటికన్నా ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా ముఖ్యం. ఇలా చిన్న లాజిక్‌తో బ్రెయిన్ టీజర్లను సాధించడం అలవాటు చేసుకోండి. ఏ బ్రెయిన్ టీజర్ అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న లాజిక్ తోనే సాధించగలరు.
బ్రెయిన్ టీజర్స్ సాధించడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. మెదడు కణాల మధ్య బంధం బలంగా మారుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ బ్రెయిన్ టీజర్లు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తరుచూ సాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించే సామర్థ్యం మెదడుకు ఇచ్చిన వారు అవుతారు. ఒక విషయాన్ని విభిన్న కోణాలలోంచి చూసే శక్తిని బ్రెయిన్ టీజర్ మనకు అందిస్తుంది. కాబట్టి వీటిని తేలికగా తీసుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి బ్రెయిన్ టీజర్ లో సాధించేందుకు ప్రయత్నించండి.