Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఆంగ్ల అక్షరం Fల మధ్య ఒక E ఇరుక్కుని ఉంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లంటే ఇష్టపడే వారికి ఇక్కడ మరొక ఆప్టికల్ చిత్రాన్ని ఇచ్చాము. దీన్ని పది సెకన్లలో చేధిస్తే మీరు చాలా తెలివైన వారనే అర్థం.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇవి మెదడుకు సవాలు విసిరే చిత్రాలు. అందుకే వీటిని సాల్వ్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఆప్టికల్ ఇల్యూషన్లను పరిష్కరిస్తే జీవితంలో మీరు ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యం మీకు వస్తాయి. కాబట్టి వీటిని కేవలం ఆటగా కాకుండా మీ జీవితానికి ఉపయోగపడే సవాళ్లుగా చూసుకోండి. ఇక్కడ మేము మరొక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో ఆంగ్ల అక్షరం Fలు నిండి ఉన్నాయి. వాటి మధ్యలో ఒక ఆంగ్ల అక్షరం E కూడా ఉంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. అదే మీకు మేము విసురుతున్న సవాలు.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
చూడటానికి ఆంగ్ల అక్షరాలు E, Fలు ఒకలాగే ఉంటాయి. వాటి మధ్య కేవలం చిన్న అడ్డుగీత మాత్రమే తేడా. కాబట్టి కళ్ళు కాస్త కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంటాయి. బ్రెయిన్ టీజర్ గా ఉపయోగపడే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఆంగ్ల అక్షరం E ఎక్కడుందో మీరు కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. దీనికి మీ మెదడు, కళ్ళు సహకరిస్తేనే జరుగుతుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య సమన్వయం చక్కగా ఉంటే మీరు Eని ఇట్టే కనిపెట్టేస్తారు. ఇక జవాబు విషయానికి వస్తే నిలువ వరుసల్లో చివరని నుంచి రెండో లైనులో ఉంది ఆంగ్ల E అక్షరం.
ఆంగ్ల అక్షరం Eని పోలి ఉండే అక్షరాలు మిమ్మల్ని గందరగోళానికి గుర్తు చేయవచ్చు. కానీ మీరు స్పష్టమైన కంటిచూపుతో, తీవ్రమైన ఏకాగ్రతతో చూస్తే E అక్షరం ఇట్టే దొరికిపోతుంది. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం 10 సెకన్లలో కనిపెడితేనే మీ మెదడు చక్కగా పనిచేస్తుందని అర్థం. ఆప్టికల్ ఇల్యూషన్లు చేయడం వల్ల మీలో అభిజ్ఞా పనితీరు, గ్రహణ శక్తి పెరుగుతుంది. సమాచారాన్ని త్వరగా ప్రాసెస్ చేయడానికి మన మెదడు, కళ్ళు కలిసి పని చేయాలి. ఆప్టికల్ ఇల్యూషన్లను ఛేదించాలన్నా కూడా మన మెదడు, కళ్ళు కలిసి పని చేస్తేనే సాధ్యమవుతుంది.
ఆప్టికల్ ఇల్యూషన్లను చేధించాలంటే మీరు చాలా రిలాక్స్ గా ఉండాలి. ఓపికగా ఉండాలి. తరచూ ఇలాంటి బ్రెయిన్ టీజర్లను, పజిల్స్‌ను సాధిస్తూ ఉండాలి. ఏకాగ్రత కూడా చాలా అవసరం. మీరు తరచూ ఆప్టికల్ ఇల్యూషన్లు ఉంటే మీలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది.
టాపిక్