Gas Problem: గ్యాస్ సమస్య వల్ల పొట్ట నొప్పి వస్తే వెంటనే ఈ హోం రెమెడీస్ పాటించండి-follow these home remedies immediately if you get stomach ache due to gas problem ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gas Problem: గ్యాస్ సమస్య వల్ల పొట్ట నొప్పి వస్తే వెంటనే ఈ హోం రెమెడీస్ పాటించండి

Gas Problem: గ్యాస్ సమస్య వల్ల పొట్ట నొప్పి వస్తే వెంటనే ఈ హోం రెమెడీస్ పాటించండి

Haritha Chappa HT Telugu

Gas Problem: శీతాకాలంలో పరోటాలు, చపాతీలు లేదా వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో కడుపులో గ్యాస్ ఏర్పడటం వల్ల కలిగే నొప్పితో మీరు ఇబ్బంది పడుతుంటే, ఈ హోం రెమెడీస్ మీకు సహాయపడతాయి.

గ్యాస్ సమస్యను తగ్గించే చిట్కాలు (pixabay)

చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటివి చలికాలంలో పొట్టలో గ్యాస్టిక్ సమస్య రావడానికి కారణం అవుతుంది. పొట్టలో గ్యాస్ ఏర్పడటం వల్ల కలిగే నొప్పి కారణంగా పొట్ట ఉబ్బినట్లు బిగుతుగా అనిపిస్తుంది. గ్యాస్ నొప్పి ఎల్లప్పుడూ కడుపుకు మాత్రమే పరిమితమని అనుకుంటారు. కానీ ఈ నొప్పి శరీరంలోని ఇతర భాగాలకు కూడా చేరుతుంది. ఇది శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో పరోటాలు, వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడే సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. ఈ సీజన్లో కడుపులో గ్యాస్ ఏర్పడటం వల్ల కలిగే నొప్పితో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, ఈ హోం రెమెడీస్ పాటించండి. మీకు పొట్ట నొప్పి తగ్గడంతో పాటూ, గ్యాస్టిక్ సమస్య తగ్గుతుంది.

పుదీనాతో

గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను అధిగమించడానికి మీరు పుదీనాను ప్రయత్నించవచ్చు. పుదీనా ఆకుల్లో ఉండే సారం గ్యాస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుండెల్లో మంట, ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. పుదీనాను ఉపయోగించి ఎసిడిటీ సమస్యను తగ్గించుకోవచ్చు. తాజా పుదీనా ఆకులను అయిదారు తీసుకోవాలి. వాటిని నల్ల ఉప్పుతో కలిపి నెమ్మదిగా నమలండి. ఆ రసాన్ని మింగండి. ఈ సులువైన రెమెడీ చేయడం వల్ల పొట్టలోని గ్యాస్ వల్ల వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

సెలెరీ గింజలు

సూపర్ మార్కెట్లో సెలెరీ ఆకుకూర ఎక్కువగా లభిస్తుంది. అలాగే సెలెరీ గింజలు కూడా దొరుకుతాయి. ఇది కడుపులో ఏర్పడే గ్యాస్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ రెమెడీ చేయడానికి, పావుస్పూన్ సెలెరీ విత్తనాలను గోరువెచ్చని నీటితో కలుపుకుని తినండి. దీని తరువాత, మీ ఎడమ వైపు తిరిగి కాసేపు పడుకోండి. ఈ హోం రెమెడీ చేయడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

లవంగం

లవంగం నూనె అపానవాయువు, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఈ నూనె జీర్ణ ఎంజైమ్ లను ప్రోత్సహించడం ద్వారా ప్రేగులలో ఏర్పడే గ్యాస్ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. లవంగాలలో ఉండే కార్మినేటివ్ ప్రభావం జీర్ణశయాంతర ప్రేగులలో గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఈ రెమెడీ చేయడానికి, ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల లవంగం నూనెను కలుపుకుని త్రాగాలి.

పైన చెప్పినవన్నీ చాలా సులువగా పాటించగల హోం రెమెడీలు. కాబట్టి ప్రతిరోజూ మిమ్మల్ని గ్యాస్ సమస్య వేధిస్తుంటే వీటిని పాటించండి. గ్యాస్ వల్ల తీవ్రంగా పొట్ట నొప్పి వస్తున్నా కూడా ఈ చిట్కాల్లో ఏదో ఒకటి చేయండి. మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)