NNS December 18th Episode: మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్- బాబ్జీతో 5 లక్షలకు బేరం- మరింత బలంగా ఘోర- ఆరుకు వార్నింగ్-nindu noorella savasam serial december 18th episode manohari plans to kill missamma zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns December 18th Episode: మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్- బాబ్జీతో 5 లక్షలకు బేరం- మరింత బలంగా ఘోర- ఆరుకు వార్నింగ్

NNS December 18th Episode: మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్- బాబ్జీతో 5 లక్షలకు బేరం- మరింత బలంగా ఘోర- ఆరుకు వార్నింగ్

Sanjiv Kumar HT Telugu
Dec 18, 2024 09:29 AM IST

Nindu Noorella Saavasam December 18th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 18 ఎపిసోడ్‌‌లో ఘోరా వెళ్లిపోయాడని సంబరపడిన అరుంధతికి గుప్తా గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఘోరా మరింత బలంగా దెబ్బ కొట్టేందుకు బలగాన్ని రెడీ చేసుకుంటున్నాడని చెబుతాడు. మిస్సమ్మను లారీ గుద్ది చంపమని బాబ్జీకి చెబుతుంది మనోహరి.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 18 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 18 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 18th December Episode)లో ఘోరా వెళ్లిపోవడం వల్ల సమస్య తీరిపోయిందని అంటుంది అరుంధతి. పొంచి ఉన్న ప్రమాదం నీకు అవగతం అవ్వటం లేదని అరుంధతిని గుప్త హెచ్చిరస్తాడు.

బలగాన్ని పెంచుకుంటున్నాడు

ఏంటి గుప్త గారు మీరు మాట్లాడేది. ఇంతకుముందు ఆ ఘోర వల్ల సమస్య ఉండేది. ఇప్పుడు ఆ ఘోరా కూడా లేడు కదా.. ఇంకెందుకు భయం. ఎన్నిసార్లు ప్రయత్నించినా నన్ను బంధించడం లేదని ఓడిపోయానని వెళ్లిపోయినట్టు ఉన్నాడు అంటుంది అరుంధతి.

అది నీ ఊహ మాత్రమే బాలిక. ఘోరా లాంటి వాడు ఓడిపోయాడనుకుంటే అది వాడి మరణం మాత్రమే.. శత్రువు ఈసారి కొట్టబోయే దెబ్బ బలంగా ఉండాలని బలగాన్ని పెంచుకుంటున్నాడు. ఎవరినైనా తక్కువ అంచనా వేయవచ్చు కానీ, ఆ ఘోరాను తక్కువ అంచనా వేయవద్దు. నన్ను దాటి నిన్ను బంధించాడంటే ఘోరా శక్తి ఏంటో అర్థం చేసుకో అంటాడు గుప్త. ఈ సారి అతన్ని ఆపడం నా వల్ల కాదు. తప్పించుకోవడం నీ వల్ల కాదు అని గుప్త చెబుతాడు.

దాంతో అరుంధతి ఆలోచనలో పడిపోతుంది. శివరామ్ మాటలు, మిస్సమ్మ చూపులు గుర్తు చేసుకుంటూ మనోహరి ఇరిటేటింగ్‌‌గా ఫీలవుతుంది. ఇదంతా జరగడానికి ఆ అరుంధథి కారణం ఆది ఆ ఒక్కరోజు సైలెంట్‌గా ఉండి ఉంటే అమర్‌ నా మెడలో తాళి కట్టేవాడు. ఇప్పుడు హ్యాపీగా ఉండేదాన్ని అనుకుంటూ బాబ్జీకి ఫోన్‌ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది.

మిస్సమ్మను చంపేయాలి

మీరు చెప్పిన ఆ ఘోర కోసం వెతుకుతున్నాను. ఆ మనిషి కోసం వెతకని గుట్ట లేదు. ఎక్కని కొండ లేదు. ఆ మనిషి ఎక్కడ దాక్కున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. మీకు దండం పెడతాను ఘోరాను వెతకడానికి నాకు ఓపిక లేదు ఇక ఘోరాను వెతకడానికి వేరే ఎవ్వరినైనా చూసుకోండి అని చెప్తాడు బాబ్జీ. నేను ఘోరా కోసం ఫోన్‌ చేయలేదు. నాకు ఇంకో పని చేయాలి అని అడుగుతుంది.

నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్పాను కదా మేడం అని బాబ్జీ చెప్పగానే నీకు 5 లక్షలు ఇస్తాను చేస్తావా..? అని అడగ్గానే ఐదు లక్షలు ఇస్తానంటే ఏమైనా చేస్తాను అని బాబ్జీ అంటాడు. లారీ ఎక్కించి మిస్సమ్మను చంపేయాలి అని చెప్తుంది. సరే అంటాడు బాబ్జీ. మరోవైపు పిల్లలు చదువుకుంటుంటే.. మిస్సమ్మ వచ్చి చదువుకుంటున్నారా..? మీరు ఈ టైంలో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది.

మిస్సమ్మతో వెటకారం

అంజు వెటకారంగా మేడ మీద ఉండాలా..? అని అడుగుతుంది. అమ్ము మాత్రం మిస్సమ్మ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు అని అంటుంది. దీంతో మీ డాడీ ఆ రూమ్‌లో ఒక్కరే ఉంటారు కదా..? మీరంతా డాడీతో స్పెండ్‌ చేయాలి అని చెప్తుంది మిస్సమ్మ. మాకు డాడీతో టైమ్‌ స్పెండ్‌ చేయాలి. ఆడుకోవాలి. కబుర్లు చెప్పాలి అని ఉంటుంది. కానీ, ఎప్పుడూ డాడీ డిసిప్లీన్ గురించి చెప్పేవారు. మార్క్స్‌ గురించి తప్పా ఏదీ మాట్లాడేవాళ్లం కాదు అంటూ భయంగా చెబుతారు.

మీ అందరికీ ఒక విషయం చెప్తాను రండి అంటూ అందరినీ దగ్గరకు పిలిచి మీ డాడీకి మీరంటే చాలా చాలా ఇష్టం. మీ డాడీ మీ మార్క్స్ గురించి ఎందుకు అడుగుతారో తెలుసా..? మీ అమ్మ ద్వారా తెలుసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మీ అమ్మ లేరు కాబట్టి ఇప్పుడు మీ డాడీతో ఎవరు మాట్లాడతారు అంటూ మిస్సమ్మ చెప్పగానే పిల్లలు ఎమోషనల్‌ అవుతారు.

పిల్లలతో అమర్ నవ్వులు

పిల్లలందరూ మెల్లిగా అమర్‌ రూంలోకి వెళ్తారు. పిల్లలను చూసిన అమర్‌ హ్యాపీగా పలకరించి డిన్నర్‌ అయిందా అని అడగ్గానే చేశామని.. మీరు తిన్నారా.? అని అడుగుతారు. తిన్నానని మీరు ఎక్కువగా ఆలోచించవద్దు అంటూ అమర్‌ చెప్తాడు. కిటికీలోంచి చూస్తున్న అరుంధతి హ్యాపీగా ఫీలవుతుంది. ఏవండి మీరైనా పిల్లలతో ఏదైనా మాట్లాడండి అని చెప్తుంది. ఇంతలో అమర్‌ కూడా పిల్లలను మీరు నాతో ఏదైనా మాట్లాడాలా..? అని అడుగుతాడు.

కాసేపు కూర్చుని మాట్లాడతామని పిల్లలు చెప్పగానే అందరినీ దగ్గరకు తీసుకుంటాడు అమర్‌. హ్యాపీగా అందరూ మాట్లాడుకుంటారు. హ్యపీగా నవ్వుతుంటారు. ఇంతలో లోపలికి వచ్చిన రాథోడ్‌ శివరామ్‌ను సార్‌ ఆ నవ్వులు మా సార్‌ వేనా అని అడుగుతాడు. అవునని శివరామ్ చెప్పగానే రాథోడ్‌ కూడా హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో మిస్సమ్మ రావడంతో శివరామ్, నిర్మల, రాథోడ్‌ ముగ్గురు కలిసి మిస్సమ్మను మెచ్చుకుంటారు. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner