Maruti Suzuki : మారుతి సుజుకి.. ఇది సార్ బ్రాండ్ అంటే.. ఒక్క ఏడాదిలోనే 20 లక్షల కార్లు!-maruti suzuki breaks all records achieve 20 lakh production milestone in one year check in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki : మారుతి సుజుకి.. ఇది సార్ బ్రాండ్ అంటే.. ఒక్క ఏడాదిలోనే 20 లక్షల కార్లు!

Maruti Suzuki : మారుతి సుజుకి.. ఇది సార్ బ్రాండ్ అంటే.. ఒక్క ఏడాదిలోనే 20 లక్షల కార్లు!

Anand Sai HT Telugu
Dec 18, 2024 09:30 AM IST

Maruti Suzuki Cars : మారుతి సుజుకి ఎవరూ ఊహించని రికార్డు బ్రేక్ చేసింది. ఈ ఏడాదిలోనే 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. తాజాగా ఈ సమాచారాన్ని కంపెనీ పంచుకుంది.

మారుతి సుజుకి రికార్డు
మారుతి సుజుకి రికార్డు

భారతదేశంలో మారుతి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిడిల్ క్లాస్ వాళ్లను ఈ కారు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. విదేశాల్లోనూ దీనికి మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా మారుతి సుజుకి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టుగా ప్రకటించింది. ఇది కంపెనీ చరిత్రలో సూపర్ రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిల్లో ఈ ఘనత సాధించిన ఏకైనా బ్రాండ్ మారుతి సుజుకి.

క్యాలెండర్ ఇయర్‌లో తొలిసారిగా 20 లక్షల వాహనాలను విక్రయించినట్లు మారుతి సుజుకి ఇండియా మంగళవారం ప్రకటించింది. ఈ మైలురాయిని చేరుకున్న మారుతీ సుజుకి ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. 20 లక్షల వాహనాల్లో 60 శాతం హర్యానాలో, 40 శాతం గుజరాత్‌లో తయారయ్యాయి.

మారుతీ సుజుకి ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. '2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సంఖ్యను చేరుకోవడం భారతదేశ తయారీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. 'మేక్ ఇన్ ఇండియా' చొరవ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.' అని చెప్పారు.

ఈ విజయం సరఫరాదారు, డీలర్ భాగస్వాములతో కలిసి ఆర్థిక వృద్ధిని నడపడానికి, దేశ నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి సాయంగా ఉంటుందని టేకుచి చెప్పారు. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంతో పోటీ పడేలా చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. భారతదేశం నుండి మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి వాటా 40 శాతం. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది.

మారుతీ సుజుకి భారతదేశంలో మూడు ఉత్పాదక ప్లాంట్‌లను కలిగి ఉంది. వాటిలో రెండు హర్యానా (గురుగ్రామ్, మనేసర్), గుజరాత్ (హంసల్‌పూర్)లో ఉన్నాయి. ఈ మూడు తయారీ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 23.5 లక్షల యూనిట్లు. ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఇందుకోసం హర్యానాలోని ఖర్ఖోడాలో గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని కంపెనీ ఏర్పాటు చేస్తోంది.

ఖర్ఖోడాలో సైట్‌లో నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పురోగమిస్తున్నాయని, భారీ ఉత్పత్తి వార్షిక సామర్థ్యంతో మొదటి ప్లాంట్ 2025లో ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఖర్ఖోడాలో సదుపాయం పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్టుగా కంపెనీ పేర్కొంది.

Whats_app_banner