Kathika Deepam 2 Today Episode: కార్తీక్ ను కొత్త రెస్టారెంట్ పెట్టమన్న స్వప్న, డబ్బు కన్నా బంధాలు ముఖ్యమన్న దీప
Kathika Deepam 2 Today Episode: కార్తీక్, శివన్నారాయణ కుటుంబాల మధ్య మరింతగా దూరం పెరిగిపోతుంది. కార్తీక్ లో మరో రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన మొదలవుతుంది.
Kathika Deepam 2 December 18 Episode: కార్తీక,దీపలు ఇంటికి రావడంతో ఈరోజు ఎపిసోడ్ మొదలవుతుంది. రెస్టారెంట్లో జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పమని దీప చెప్పినా కూడా కార్తీక్ పట్టించుకోడు. కాంచన మాత్రం ఆఫీసులో ఏదో గొడవ అయినట్లు ఉందని అనుకుంటుంది. సుమిత్ర, దశరథ్‌లు కార్తీక్‌ని ఉద్యోగం నుంచి తీసేయడం గురించి మాట్లాడుకుంటారు. అదే సమయంలో శివన్నారాయణ, జ్యోత్స్న అక్కడికి వస్తారు. అప్పుడు సుమిత్ర తన కూతురు జ్యోత్నతో ‘వాడు నీ సొంత బావే కదా, నువ్వైనా వాడిని ఆపాల్సింది. వదిన గురించైనా ఆలోచించాల్సింది’ అని అంటుంది. దానికి శివన్నారాయణ ‘వాడు పెద్దోడా? నేను పెద్దోడినా? వాడు తగ్గాలా? నేను తగ్గాలా? వాడికి నేను జీవితం ఇచ్చానని గుర్తు రావాలి’ అని అహంకారంతో అంటాడు. జ్యోత్స్న కూడా తాతకే సపోర్ట్ చేస్తుంది. బావ అందర్నీ వదిలి దీప కోసం వెళ్ళిపోయాడని అందుకు మమ్మల్ని నిలదీయడం కంటే బావకి ఫోన్ చేసి అడుగు అని చెబుతుంది. ఈ లోపు పారిజాతం మధ్యలో వచ్చి వాడు పోతే ఇంకొకరు వస్తారు అని అంటుంది.
పారిజాతం అన్నమాటకు దశరథ్... కార్తీక్ లాగా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఇంకొకరు దొరకడం కష్టమని, లండన్ లో చదువుకుంటూనే రెస్టారెంట్ కోసం ఎన్నో సలహాలు ఇచ్చాడని అంటాడు. కార్తీక్ ని దశరథ్ పొగడడం శివన్నారాయణకు నచ్చదు. వెంటనే ‘దశరథ్ చాలు వాడిని అంత మోయాల్సిన అవసరం లేదు. వాడు లేకపోతే కంపెనీయే లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావ్. ఈరోజు వాడు వెళ్లిపోవచ్చు నాకు నా మనవరాలు ఉంది, కార్తీకే నా కాళ్లు పట్టుకోవడానికి వస్తాడు’ అని పొగరుగా మాట్లాడుతాడు
కార్తీక్ ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. దీప కాఫీ ఇచ్చి జరిగిన విషయాన్ని కాంచనకు చెప్పమని అంటుంది. అదే సమయానికి కాంచన కూడా వచ్చి ఏం జరిగిందో చెబితే తన నాన్నని అడుగుతానని అంటుంది. దానికి కార్తీక్ ‘తాతకి నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఎవరు అని అడుగుతాడు, మన కుటుంబాల మధ్య దూరం ఎంతగా పెరిగిపోయిందో’ అని అంటాడు.
ఆఫీస్ నుంచి తనకు తానే బయటికి వచ్చేలా మీ నాన్న చేశాడని, అందుకే రిజైన్ చేసి వచ్చానని చెప్పేస్తాడు కార్తీక్. అది విని కాంచన ఏడుస్తుంది. అందరూ ఉండి అనాధలా అయిపోయామని బాధపడుతుంది. కార్తీక్ వెంటనే మీ నాన్న, మేనకోడలు అహంకారం ఎక్కువగా ఉందని తల్లితో చెబుతాడు. దానికి కాంచన ఆస్తిలో మనకు వాటా ఉందని అంటుంది. అప్పుడు దీపా.. సుమిత్రతో మాట్లాడదామని చెబుతుంది. అయితే కార్తీక్ ఎవరితోనూ మాట్లాడవద్దని అంటాడు. ఈ లోపు అనసూయ వచ్చి జరిగింది తెలిసి తన రక్తం మరుగుతోందని మీకు ఏమీ అనిపించడం లేదా అని కాంచన, దీపాలను ప్రశ్నిస్తుంది. దానికి దీప ఆస్తులు డబ్బు ముఖ్యం కాదని అభిమానించే మనుషులు కుటుంబాలు ముఖ్యమని చెబుతుంది.
కావేరి... కార్తీక్ కు జరిగిన అన్యాయాన్ని శ్రీధర్‌కు చెప్పగానే అతడు ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. స్వీట్ తీసుకురమ్మని చెబుతాడు. కావేరి కోపంతో ఎండుమిర్చిని భర్త నోటిలో పెట్టేస్తుంది. కావేరి కాంచన వాళ్లకు సాయం చేయాలని అంటుంది. ఈలోపు స్వప్న వాళ్ళు కార్తీక్ ఇంటికి వస్తారు. కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని స్వప్న సలహా ఇస్తుంది. దాంతో కార్తీకదీపం ఎపిసోడ్ ఈరోజుతో ముగిసిపోయింది.
టాపిక్