Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాపై కొత్త నింద- సంజుతో బాలు చెల్లి పెళ్లి- ఫిక్స్ చేసిన ప్రభావతి- ఇక టార్చర్!
Gunde Ninda Gudi Gantalu Serial December 18 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో శ్రుతి దగ్గరికి వెళ్లి తమ ఇంటికి రమ్మని ప్రభావతి, శోభన గొడవ పడతారు. దాంతో శ్రుతి ఎక్కడికి రానంటుంది. మరోవైపు రవిని ఇంటికి తీసుకొచ్చేందుకు సత్యంను రిక్వెస్ట్ చేస్తుంది ప్రభావతి.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి వాళ్ల దగ్గరికి ప్రభావతి, కామాక్షి వెళ్తారు. మీలా మా అమ్మ కూడా వచ్చి పిలవలేదు అని శ్రుతి అంటుంటే తల్లి వస్తుంది. దాంతో తల్లిని ప్రేమగా హగ్ చేసుకుంటుంది శ్రుతి. నీమీద దాడి గురించి నిన్ననే తెలిసింది. నీకెలా ఉందని శోభన అంటుంది.
కోపంగా ఉన్నారు
పిల్లలను అలా వదిలేస్తే ఎలా. క్షేమంగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి. మనమే తెలుసుకోవాలి అని ప్రభావతి అంటే.. పిల్లలు తెలిసి తెలియక తప్పు చేస్తే మనమే పెద్ద మనసు చేసుకుని క్షమించాలి అని కామాక్షి అంటుంది. సరే వదిలేయండి అమ్మ అని రవి అడ్డుకుని టీ తెస్తా అంటాడు. నాన్న రాలేదా అని అడిగితే.. లేదమ్మా ఇంకా కోపం ఉంది. నీమీద చాల నమ్మకం పెట్టుకున్నారు. అందుకే అంత కోపంగా ఉన్నారు అని శోభన అంటుంది.
ఇక్కడ మేము కూడా ఉన్నాం. మాతో కూడా మాట్లాడొచ్చు అని ప్రభావతి అంటుంది. ఉన్నారు. ఇక్కడే ఉన్నారని మాకు తెలుసు. మీకు మాత్రమే బాధ్యత ఉందన్నట్లు మాట్లాడుతున్నారు కదా. మాకు ప్రేమ లేకుండానే మా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచామా. మా పెంపకంలో తప్పేం లేదు. మీ కొడుకే వచ్చి మా అమ్మాయని దూరం చేసి తీసుకెళ్లిపోయాడు. ప్రేమ అని వెంటపడకుంటే తన జీవితం ఇంకోలా ఉండేది అని శోభన అంటుంది.
హా డబ్బున్నవాడిని చేసుకుంటే కష్టాలు పడేది. మా వాడు కాబట్టి వండి పెడుతుంటే హాయిగా ఉంటోంది అని ప్రభావతి అంటుంది. ఇదీ నీ మీద వాళ్లకున్న అభిప్రాయం అని శోభన అంటే.. వాళ్లకు అలాంటి అభిప్రాయం ఏం లేదు. మీరే మా పెళ్లిని ఇంకా ఒప్పుకోవట్లేదు అని రవి అంటాడు. సెక్యూరిటీ లేని చోట ఎలా ఒప్పుకుంటాం. ఇక్కడే ఉంటే ఇది క్షేమంగా ఉంటుందని నమ్మకం లేదు. పదా శ్రుతి మన ఇంటికి వెళ్దాం అని శోభన అంటుంది.
ఇలా చేసిందేంట్రా
తను మా ఇంటి కోడలు మా ఇంటికే వస్తుంది అని ప్రభావతి అంటుంది. ప్రభావతి, శోభన ఇద్దరు తమ ఇంటికి తీసుకెళ్లడానికి గొడవ పడతారు. దాంతో శ్రుతి అరిచి ఆపుతుంది. ఇప్పుడే మీకు గుర్తొచ్చామా. మేము ఎవరి ఇంటికి రాము. వచ్చారని సంతోషపడేలోపే ఎందుకు వచ్చారన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారని కోపంగా వెళ్లిపోతుంది శ్రుతి. దాంతో శోభన కూడా వెళ్లిపోతుంది. ఏంట్రా ఇది. మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం. తనొచ్చి ఇలా చేసింది అని ప్రభావతి అంటుంది.
ఇప్పుడు శ్రుతి ఎక్కడికి రాదు. మీరు ముందెళ్లి నాన్నను, అన్నయ్యను ఒప్పించండి అని రవి అంటాడు. దాంతో కోపంగా బయటకు వెళ్తుంది ప్రభావతి. వెంటే వచ్చిన కామాక్షి వాళ్లు కూడా వీళ్లను తీసుకెళ్లాలని అనుకుంటున్నారని తెలిసింది. కాబట్టి ఇంటికెళ్లి తర్వగా మాట్లాడి ఇద్దరిని ఒప్పించు. లేకుంటే వాళ్లు వీళ్లను ఎగరేసుకోపోతే నీ ఆశలు గల్లంతు అవుతాయి అని కామాక్షి అంటుంది. మరోవైపు బాలు ఇంటికి సంజును తన ఫ్రెండ్స్ తీసుకెళ్లి చూపించి చెబుతారు.
ఇప్పటికిప్పుడు వాడి ఇల్లును తగలబెట్టాలనిపిస్తుందిరా అని సంజు కోపంగా అంటాడు. అప్పుడే బాలు వచ్చి కారు క్లీన్ చేస్తుంటాడు. అది చూసి బాలు కొట్టింది గుర్తు చేసుకుంటాడు సంజు. వీడు పెద్ద పోటుగాడు అనుకున్నాను. వీడేంట్రా కారు క్లీన్ చేస్తున్నాడు అని సంజు అంటాడు. వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో వాడికి తెలియాలి. నన్ను టచ్ చేస్తే షాక్ ఎలా ఉంటుందో ఈ ఫ్యామిలీ చూడబోతుంది అని సంజు గన్ తీస్తాడు. వీడి చావును చూడబోతున్నాను అని సంజు అంటాడు.
ఈ వీరవనిత కాపాడింది
దాంతో సంజును ఫ్రెండ్స్ ఆపుతారు. నాన్న చెప్పారు కదా అంటారు. నాన్న చెప్పాడు కదా అని అందరితో తన్నులు తింటూ కూర్చుంటానా. నేను అంత చేతకాని వాడిలా కనిపిస్తున్నానా. ఇవాళ వాన్ని దేవుడు కూడా కాపాడాలేడు అని బాలు వైపు గన్న గురిపెడతాడు సంజు. ఇంతలో మీనా అని బాలు పిలిచేసరికి బయటకు వస్తుంది మీనా. దాంతో కాల్చడం సంజు ఆపుతాడు. ఆ దేవుడు కాపాడుతాడో లేడో కానీ, ఈ వీరవనిత కాపాడుతుంది. మనల్ని పరిగెత్తించి కొడుతుందిరా అని సంజు ఫ్రెండ్ అంటాడు.
కారు కీస్ తీసుకురా అని మీనాను ఇంట్లోకి పంపిస్తాడు. అరేయ్ ఇది శ్రుతి రిలేటివ్ అనుకుంటా. ఇక్కడ ఉందేంటీ అని సంజు అంటాడు. వాడి భార్యేమో అని ఫ్రెండ్ అంటే.. వీళ్లంతా ఒకే ఫ్యామిలీనా అని సంజు అంటాడు. తర్వాత బాలు, మీనావైపు గన్ గురిపెడతాడు సంజు. ఇంతలో మౌనిక వచ్చి ఆఫీస్‌కు లేట్ అవుతుందని అంటుంది. అది చూసి సంజు ఆగుతాడు. తర్వాత మౌనికకు వచ్చే భర్త గురించి గొప్పగా చెబుతాడు బాలు.
దాంతో మీనా పంచ్‌లు వేస్తే.. మౌనిక బాలుకు సపోర్ట్‌గా మాట్లాడుతుంది. నన్ను కొట్టి మీరు నవ్వుతున్నారు కదా. ఈ నవ్వులన్నీ ఇంకొంత కాలమే. తర్వాత మీ ఫ్యామిలీకి శాశ్వతంగా కన్నీళ్లే మిగులుతాయి అని సంజు అంటాడు. ఏం చేస్తావురా అని ఫ్రెండ్స్ అంటే.. ముందే చెబుతే మజా ఏముంటుంది అని సంజు అంటాడు. తర్వాత ప్రభావతిని భోజనానికి పిలుస్తుంది మీనా. తను రానంటూ అరుస్తుంది ప్రభావతి. అది సత్యం వింటాడు.
ఇది కొత్త నిందా
రవి పెళ్లి చేశావని, నీ వల్లే వాడు దూరం అయ్యాడని ప్రభావతి తిడుతుంది. ఇదొ కొత్త నింద అని మీనా అంటుంది. పెళ్లి చేశావ్. కానీ, ఇక్కడికి వచ్చేలా చేయట్లేదు అని ప్రభావతి అంటే.. అందరం వెళ్లి పిలిస్తే ఎందుకు రాడు అని మీనా అంటుంది. నోర్మూయ్. నువ్ ఆరోజే ఇంటికి తీసుకొచ్చుంటే బాగుండేది అని అన్ని చెబుతూ ప్రభావతి తిడుతుంది. ఇదంతా తిని కూడా తిట్టొచ్చు. మావయ్య ఎదురుచూస్తున్నారు అని మీనా అంటుంది.
నేను రవిగాడు వచ్చేదాకా మంచి నీళ్లు కూడా ముట్టను అని ప్రభావతి అంటుంది. అదే విషయం సత్యంకు చెబుతుంది మీనా. అది విని బాలు సంతోషం. ఎవరిని బెదిరిస్తుందట అని అంటాడు. మధ్యాహ్నం కూడా తినలేదు. మీరు పిలవండి మావయ్య అని మీనా అంటుంది. ప్రభా రా భోజనం చేద్దాం అని సత్యం అనగానే.. వచ్చి రానని చెప్పాను కదా, తనని చెప్పాను కదా అని అరుస్తుంది ప్రభావతి. అందరూ ఉండి వాడు అనాధలా ఉండటం నాకు ఇష్టంలేదు అని ప్రభావతి ఏడుస్తూ చెబుతుంది.
ఇంతలో మనోజ్ వచ్చి భోజనానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదని అంటాడు. దాంతో బాలు పంచ్‌లు వేస్తాడు. మీ అమ్మ తిననంటుందిరా అని సత్యం అంటే.. ఆకలిగా లేదోమో. మాకు ఉంది మేము తింటాం అని మనోజ్ అంటాడు. దాంతో సిగ్గులేదట్రా. రవిగాడు గుర్తొస్తున్నాడు. కలలోకి వస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. నువ్ సెంటిమెంట్‌తో కొట్టి నాన్నను కరిగిద్దామని చూస్తున్నావా అని రవి చేసింది చెబుతాడు బాలు.
పదిమంది పిల్లలను కన్నదానిలా
ఎంతకాదన్న కన్నతల్లి కన్నతల్లేరా. కానీ, ఆ సురేంద్ర మాట్లాడింది నాకు అవమానంగా ఉంది. రవిని నమ్మి మోసపోయాను. ఇలాంటి సమయంలో నాకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు. మీ అమ్మ కోసం వాడిని ఇంటికి తీసుకురావాలా అని సత్యం అంటాడు. దాంతో రోహిణి ఆ బాధ నాకు తెలుస్తుంది అని అంటుంది. దాంతో బాలు పదిమంది పిల్లలను కన్నట్లు మాట్లాడుతావేంటీ. అది కన్నవాళ్లకే తెలుసు కదా. నీకెలా తెలుసు అని వాదిస్తాడు.
రేయ్ మొహం పగులుద్ది. ఒక ఆడదాని బాధ మరో ఆడదానికే తెలుస్తుంది అని ప్రభావతి అంటుంది. నువ్వేం అంటావురా అని మనోజ్‌ను అడిగితే.. వాడు ఇక్కడికి వస్తే డబ్బున్న వాడి అల్లుడు అని నెత్తినపెట్టుకుంటారు. నాకు ఇచ్చే గౌరవం ఇవ్వరు అని మనసులో అనుకున్న మనోజ్ అందరూ కరెక్ట్ అంటాడు. నాన్న ఆకలేస్తే అమ్మే తింటుంది కానీ, అలిగిందని అడ్డమైనోళ్లను ఇంటికి తీసుకురాకు అని బాలు చెప్పబోతుంటే ప్రభావతి నోరు మూస్తుంది.
ఇప్పుడిప్పుడే మీ నాన్న ఆలోచిస్తున్నారు. అది కూడా చెడగొడతావా అని ప్రభావతి అంటుంది. తప్పు చేసిన వీడిని ఇంట్లోకి రానిచ్చావ్. అది చూసి వాడు తప్పు చేశాడు. అందరి తప్పులు క్షమించడానికి నువ్వేమైనా స్వామి క్షమానందుడివా అని బాలు అంటాడు. మరోవైపు నలుగురిపై ప్రతికారం తీర్చుకుంటాను అని సంజు అంటాడు. సంజు ఇంటికి వెళ్లి మౌనిక పెళ్లికి తాంబుళం తీసుకుంటుంది ప్రభావతి. అంటే, మౌనికను పెళ్లి చేసుకుని సత్యం ఫ్యామిలీని టార్చర్ చేసేలా సంజు ప్లానే చేశాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.
టాపిక్