తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Assembly Sessions : ఆటో నడిపిన కేటీఆర్ - ఖాకీ డ్రెస్ లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- Telangana Assembly Session 2024 Updates: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ స్వయంగా ఆటోను నడిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు.

(1 / 6)
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటోల్లో వచ్చారు.
(2 / 6)
తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా నినాదాలు చేశారు.
(3 / 6)
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీలు ఏవీ అమలు కాలేదని… ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు.
(4 / 6)
గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను అందించామని కేటీఆర్ చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12 వేల రూపాయలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని… వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.
(5 / 6)
ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. వారిపక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చామన్నారు.
ఇతర గ్యాలరీలు