NNS December 13th Episode: చావు బతుకుల్లో అమర్- స్పర్శ శక్తి వదులుకున్న అరుంధతి- మనోహరిని నిలదీసిన అమ్ము​​- భాగీ ఏడుపు-nindu noorella savasam serial december 13th episode bullet injury to amar in danger zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns December 13th Episode: చావు బతుకుల్లో అమర్- స్పర్శ శక్తి వదులుకున్న అరుంధతి- మనోహరిని నిలదీసిన అమ్ము​​- భాగీ ఏడుపు

NNS December 13th Episode: చావు బతుకుల్లో అమర్- స్పర్శ శక్తి వదులుకున్న అరుంధతి- మనోహరిని నిలదీసిన అమ్ము​​- భాగీ ఏడుపు

Sanjiv Kumar HT Telugu
Dec 13, 2024 11:38 AM IST

Nindu Noorella Saavasam December 13th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 13 ఎపిసోడ్‌‌లో కిడ్నాపర్ల నుంచి పిల్లలను కాపాడే ప్రయత్నంలో అమర్‌‌కు బుల్లెట్ తగులుతుంది. దాంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లిన అమర్‌ చావు బతుకుల్లో ఉంటాడు. మిస్సమ్మ, అరుంధతి బోరున ఏడుస్తుంటారు. అరుంధతిని గుప్త ఓదార్చుతాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 13 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 13 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 13th December Episode)లో అమర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తాడు. పిల్లలను వేరే చోటుకు మార్చేందుకు టెర్రరిస్ట్‌లుట్రై చేస్తుంటారు. కుర్చీలో నుంచి తప్పించుకున్న అమర్ పిల్లలను కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాడు.

yearly horoscope entry point

ఓదార్చిన గుప్త

కిడ్నాపర్ల నుంచి పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో అమర్​కి బుల్లెట్ తగులుతుంది. దాంతో వెంటనే హాస్పిటల్​కి తీసుకెళ్తారు. ఆపరేషన్‌ చేసేందుకు డాక్టర్ ఏర్పాట్లు చేస్తారు. బయట కూర్చున్న మిస్సమ్మ భోరున విలపిస్తుంది. ఏడుస్తున్న పిల్లలను రాథోడ్‌ ఓదారుస్తుంటాడు. అరుంధతి కూడా ఏడుస్తుంది. నీ మంచి కోసం. నీ కుటుంబం బాగు కోసం చెప్తున్నాను అర్థం చేసుకో బాలిక అని గుప్త ఓదార్చుతాడు.

అరుంధతి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో ఆపరేషన్‌ థియేటర్‌ లోంచి డాక్టర్‌, సిస్టర్‌ బయటకు రాగానే ఎలా ఉందని కంగారుగా మిస్సమ్మ అడుగుతుంది. డాక్టర్, సిస్టర్ పలకకుండా లోపలికి వెళ్లిపోతారు. అమ్ము నాకు చాలా భయంగా ఉంది అంటూ అంజు భయపడుతుంటే.. మిస్సమ్మ వచ్చి అంజును ఓదారుస్తుంది. మిస్సమ్మను రాథోడ్ ఓదారుస్తాడు.

నువ్వే ఇలా ఏడిస్తే.. పెద్దసారు పెద్ద మేడం, పిల్లలను ఏవరు చూసుకుంటారని అంటాడు. మిస్సమ్మ ఏడుస్తూనే పిల్లలను ఏడవొద్దని ఓదారుస్తుంది. మమ్మల్ని ఏడవ వద్దు అని నువ్వెందుకు ఏడుస్తున్నావు మిస్సమ్మ అని అంజు అడుగుతుంది. గుప్తగారు నా కుటుంబానికి ప్రమాదం అంటే నా పిల్లలకు ప్రమాదం వస్తుందనుకున్నాను. కానీ, మా ఆయనకు ఇలాంటి ప్రమాదం వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఏడుస్తూ.. గుప్త గారు ఆయనకు ఏం కాదు కదా..? అని అడుగుతుంది అరుంధతి.

బుల్లెట్ గాయంతో

అంతా దైవేచ్చా బాలిక నువ్వేం భయపడకు.. ధైర్యంగా ఉండు అంటూ ఓదారుస్తాడు గుప్త. రామ్మూర్తి కంగారు హాస్పిటల్ దగ్గరకు వచ్చి బాబు గారికి ఏమైంది. భాగీ ఫోన్‌ చేసి అర్జెంట్‌గా వచ్చేయమని చెప్పింది అని అడగ్గానే ఏమైందో చూద్దాం పదండి అని అందరూ కలిసి లోపలికి వస్తారు. అందరూ ఏడుస్తుంటారు. కోడలి మరణాన్ని జీర్ణించుకునే లోపే కొడుకు ఇలా బుల్లెట్‌ గాయంతో హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆ పెద్దవాళ్లకు ఈ వయసులో ఎందుకు ఇన్ని కష్టాలు గుప్తా గారు అని నిలదీస్తుంది ఆరు.

డాక్టర్‌ గారు ఏం చెప్పారమ్మా.. బాబు గారికి ఎలా ఉందంట అని రామ్మూర్తి అడగ్గానే మిస్సమ్మ ఏడుస్తూనే ఉంటుంది. ఏడవకు అమ్మా.. దేవుడు నీ జీవితంలోంచి ఇప్పటికే చాలా తీసుకున్నాడు. బాబుగారికి ఏమీ కాదు అంటూ ఓదారుస్తాడు. అవును మిస్సమ్మ.. సార్‌కు ఇంత మంది ప్రేమ ఉండగా ఏమీ కాదు నువ్వు ఊరుకో మిస్సమ్మ అంటూ రాథోడ్‌ కూడా ఓదారుస్తాడు. నిర్మల, శివరామ్ కూడా ఓదారుస్తూ మిస్సమ్మను బయటకు వెళ్లి ఏమైనా తిని రమ్మని చెప్తారు. మిస్సమ్మ పలకదు.

ఇంతలో మనోహరి ఈ ముసలోళ్లు ఎలాగూ ప్లేట్‌ ఫిరాయించారు. పిల్లలను అయినా మచ్చిక చేసుకుంటాను అనుకుంటూ పిల్లల్లూ మీరైనా కొంచెం ఏదైనా తిందురు రండి అని అడుగుతుంది. మాకు ఆకలిగా లేదని.. మా డాడీకి బాగయ్యే వరకు మేమేమీ తినం అంటారు. ఆ బుల్లెట్ ఏదో ఈ ముసలోళ్లకు తగిలి ఉంటే బాగుండేది. దేవుడా అమర్‌కు ఏమీ కాకుండా చూడు. లేదంటే నాకు భవిష్యత్తు లేకుండా పోతుంది అని మనసులో అనుకుంటుంది మనోహరి.

దేవుడికి పిల్లల ప్రార్థణ

ఇంతలో అమ్ము బాధగా మేము చిన్నపిల్లలం మాకంటే తెలియదు.. కానీ మీకు తెలుసు కదా..? మరి మీరెందుకు మమ్మల్ని వెళ్లమని ఎంకరేజ్‌ చేశారు అంటూ మనోహరిని నిలదీస్తుంది అమ్ము. అమ్మా పిల్ల రాక్షసి కరెక్టు పాయింట్‌ పట్టింది అని మనోహరి మనసులో అనుకుంటుంది. ఇంతలో పిల్లలు ఏడుస్తూ బయటకు వెళ్తారు. లోపల డాక్టర్లు ఆపరేషన్‌ చేస్తుంటారు. పిల్లలు హాస్పిటల్‌లో ఉన్న గణపతి విగ్రహం దగ్గరకు వెళ్లి ప్రార్థిస్తారు.

దేవుడా నీ మీద నమ్మకం పెట్టుకుంటే మా డాడీని కాపాడతా వంట కదా ఫ్లీజ్‌ మా డాడీని కాపాడవా అంటూ అంజు వేడుకుంటుంది. అమ్మను తీసుకెళ్లిపోయావు. ఇప్పుడు డాడీని కూడా తీసుకెళ్లిపోతే మేమెలా బతకాలి అంటూ అమ్ము ప్రార్థిస్తుంది. పిల్లలంటే నీకు చాలా ఇష్టమట. పిల్లుల ఏడిస్తే నీకు నచ్చదట కదా..? మరి మమ్మల్ని ఎందుకిలా ఏడిపిస్తున్నావు అంటూ ఆకాష్‌ అడుగుతాడు. ఎక్స్‌‌కర్షన్‌‌కు వెళ్లి తప్పు చేసింది మేమైతే పనిష్‌‌మెంట్‌ మా నాన్నకు ఎందుకు ఇస్తున్నావు అంటూ ఆనంద్‌ బాధపడతాడు.

పక్కన అమ్మ లేకుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు మా డాడీ కూడా లేకపోతే ఎలా అంటూ అమ్ము బాధపడుతుంది. పిల్లల బాధను చూడలేక అరుంధతి పక్కకు వెళ్లి భోరున ఏడుస్తుంది. అరుంధతిని చూసి గుప్త బాధపడుతాడు. రిసెప్షన్‌లో నర్సులు ఇద్దరూ అమర్‌కు సీరియస్‌‌గా ఉందని అంతా దేవుడి దయ అని మాట్లాడుకుంటారు. అది విన్న ఆరు ఏడుస్తూ గుప్తను మా ఆయనకు ఏం జరిగింది చెప్పండి.. ఏదో ఒకటి చేసి ఆయనకు ఏం కాకుండా చూడండి అని అడుగుతుంది.

స్పర్శ శక్తి కోల్పోవాలి

దీంతో గుప్త క్షమించు బాలిక.. నీకు ఏమీ తెలియక బాధపడుతున్నావు.. నాకు అన్ని తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను అంటాడు. అయన బతకాలంటే నేను ఏం చేయాలో చెప్పండి గుప్త గారు. ఆయన లేకుంటే పిల్లలు, మిస్సమ్మ బతకలేరు అంటుంది అరుంధతి. స్పర్శ శక్తి కోల్పోతే బతికే అవకాశం ఉంటుందని గుప్త చెప్పడంతో అరుంధతి ఏం ఆలోచించకుండా అలాగే చేస్తుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner