NNS June 4th Episode: మిస్సమ్మను కాపాడిన అమర్​.. తప్పించుకున్న బాబ్జీ.. అమ్మును చంపాలనుకుంటున్న మనోహరి-nindu noorella saavasam serial june 4th episode amar saves bhagamathi from babji nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns June 4th Episode: మిస్సమ్మను కాపాడిన అమర్​.. తప్పించుకున్న బాబ్జీ.. అమ్మును చంపాలనుకుంటున్న మనోహరి

NNS June 4th Episode: మిస్సమ్మను కాపాడిన అమర్​.. తప్పించుకున్న బాబ్జీ.. అమ్మును చంపాలనుకుంటున్న మనోహరి

Sanjiv Kumar HT Telugu
Jun 04, 2024 10:22 AM IST

Nindu Noorella Saavasam June 4th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 4వ తేది ఎపిసోడ్‌‌లో మిస్సమ్మను అమర్ కాపాడుతాడు. అరుంధతిని చంపినవాడు మిస్సమ్మపై అటాక్ చేసినవాడు ఒక్కడే బాబ్జి అని అమర్ ఇంట్లో వాళ్లంతా అంటాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 4వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 4వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 4th June Episode) మిస్సమ్మ ఒంటరిగా గుడికి బయల్దేరిందని బాబ్జీకి మనోహరి ఫోన్​ చేసి చెప్తుంది. మిస్సమ్మను చంపడానికి ఫాలో అయిన బాబ్జి నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లగానే మిస్సమ్మకు ఎదురుగా వెళ్లి కత్తి బయటకు తీస్తాడు. కత్తి చూసి మిస్సమ్మ భయపడుతుంది.

అమర్ చేతికి గాయం

ఇంతలో కారులో వస్తున్న అమర్‌.. మిస్సమ్మను బాబ్జి కత్తితో పొడవబోతుంటే రాయి తీసుకుని విసురుతాడు. రాయి తగలడంతో బాబ్జి కింద పడిపోతాడు. తర్వాత ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. అమర్‌ చేతికి గాయం అవుతుంది. అది చూసి మిస్సమ్మ గట్టిగా అరుస్తుంది. ఇంతలో రాథోడ్‌ వస్తాడు. బాబ్జి పారిపోతాడు. అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌ ఇంటికి వెళ్తారు.

అమ్ము ప్రవర్తన వింతగా ఉందని పిల్లలందరూ మీటింగ్‌ పెట్టుకుంటారు. మళ్లీ ఎమైంది నన్ను ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అంటుంది అమ్ము. నీకు ఇవాళ ఏమైంది. ఎందుకు ఉదయం నుంచి మనోహరి ఆంటీతో అంత రూడ్‌గా బిహేవ్‌ చేస్తున్నావు అంటుంది అంజు. ఇందాక మనోహరి ఆంటీతో మాట్లాడ్డం నువ్వు విన్నావా? అంజు అని అడుగుతుంది అమ్ము.

వేరుగా మాట్లాడుతున్నావ్

నువ్వు అరిచే వరకు విన్నా అరవగానే భయపడి వీళ్లను తీసుకురావడానికి వచ్చా. తీరా వచ్చేసరికి నువ్వు వెళ్లిపోయావు అంటూ నిన్ను చూస్తుంటే అమ్మలా కనిపిస్తున్నావు. ఆ మిస్సమ్మతో కలిసి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అనగానే మిస్సమ్మ ఏం చేసినా మీ మంచి కోసమేగా అనగానే అదేంటి మళ్లీ మీ మంచి కోసం అంటూ వేరుగా మాట్లాడుతున్నావు అంటారు.

రాథోడ్‌, అమర్‌, మిస్సమ్మ కంగారుగా ఇంటికి వస్తారు. రాథోడ్‌ కేకలు విని మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది మిస్సమ్మను చంపేసి ఉంటాడనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ వాయిస్‌ విని డిసప్పాయింట్‌ అవుతుంది. కిందకు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఎవరో వచ్చి నన్ను చంపబోయారు. ఇంతలో ఆయన వచ్చి కాపాడారు అని చెప్తుంది. ఆ దేవుడి దయ ఉంది కాబట్టి సమయానికి అమర్‌ అక్కడికి వచ్చి నిన్ను కాపాడాడు అంటుంది నిర్మల.

ఆరును చంపిన వాడే

అసలు వచ్చింది ఎవరు? నిన్ను చంపాలని ఎందుకు చూశాడు అని శివరామ్ అడుగుతాడు. ఎవడో దొంగ వెధవ. మెడలో బంగారం కోసం వచ్చి ఉంటాడు అంటాడు రాథోడ్​. వాడు బంగారం కోసం రాలేదు. మిస్సమ్మ ప్రాణం తీయడానికే వచ్చాడు. ముసుగులో మిస్సమ్మను చంపడానికి వచ్చింది. బాబ్జీ.. ఆరును లారీతో గుద్ది చంపినవాడు అంటాడు అమర్. అందరూ షాక్‌ అవుతారు. అమ్ము, మిస్సమ్మ కోపంగా మనోహరి వైపు చూస్తుంటారు.

నన్ను దేవుడి దగ్గరకు పంపడానికి నన్ను పూజకు పంపిచావా మనోహరి అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ. మిస్సమ్మకు థ్రెట్‌ ఉందని నువ్వు బయటకు వెళ్లొద్దని అమర్‌ చెప్తాడు. మనోహరి లోపలికి వెళ్లి భయపడుతుంది. అమ్మును కూడా చంపేయాలని డిసైడ్‌ అవుతుంది. మరోవైపు అమర్‌ నుంచి తప్పించుకుని పారిపోయిన బాబ్జీ, మనోహరికి ఫోన్‌ చేస్తాడు. మనోహరి, బాబ్జీని తిడుతుంది.

తప్పు చేశానన్న అమర్

ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌‌కు వెళ్లమని చెప్తుంది. మరోవైపు మిస్సమ్మ అమర్‌కు జాగ్రత్తలు చెప్తుంది. నాకు దెబ్బ తగిలింది కాలుకు కాదు చేతికి.. అంటాడు అమర్​. ఏంటి అలా చూస్తున్నారు మీరు చూస్తే వణికిపోయే రోజులు పోయాయి. ఈ దెబ్బ తగ్గేవరకు చెప్పినట్లు వినండి అంటుంది మిస్సమ్మ. నిన్ను ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాను అంటున్న అమర్​తో హలో మాస్టారూ మీరు రానిస్తే రాలేదు. నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను గుర్తు పెట్టుకోండి అంటుంది మిస్సమ్మ.

నిన్ను కాపాడబోయి నాకు దెబ్బ తగిలిందని నువ్వు నాకు సేవలేం చేయొద్దని అమర్‌ అనగానే నేను కూడా అలా ఏం చేయలేదని ఒకే రూంలో ఉన్నందుకు చేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది మిస్సమ్మ. తర్వాత ఈ అటాక్‌ ఆ మనోహరి చేయించింది అని రాథోడ్‌ తో చెప్తుంది మిస్సమ్మ. అవునని రాథోడ్‌ అంటాడు.

మనోహరి వెళ్లిపోతుందా

అమ్ముకి భయపడి అమర్​ ఇంట్లో నుంచి మనోహరి వెళ్లిపోతుందా? మిస్సమ్మను చంపించాలని చూసింది మనోహరి అని అందరికీ తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే జూన్​ 05న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner