NNS May 31st Episode: పిల్లల చేతిలో బలైన మనోహరి.. మిస్సమ్మను అమ్మ అని పిలిచిన అమ్ము.. అరుంధతిపై భాగీ డౌట్-nindu noorella saavasam serial may 31st episode ammu calls mom to bhagamathi nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns May 31st Episode: పిల్లల చేతిలో బలైన మనోహరి.. మిస్సమ్మను అమ్మ అని పిలిచిన అమ్ము.. అరుంధతిపై భాగీ డౌట్

NNS May 31st Episode: పిల్లల చేతిలో బలైన మనోహరి.. మిస్సమ్మను అమ్మ అని పిలిచిన అమ్ము.. అరుంధతిపై భాగీ డౌట్

Sanjiv Kumar HT Telugu
May 31, 2024 08:10 AM IST

Nindu Noorella Saavasam May 31st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 31వ తేది ఎపిసోడ్‌‌లో మిస్సమ్మ కోసం పిల్లలు చేసిన ప్లాన్‌ వల్ల మనోహరి బలి అవుతుంది. అమ్ముకు బొట్టు పెడుతున్న మిస్సమ్మను అమ్మా అని పిలుస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 31వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 31వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 31st May Episode) మిస్సమ్మపై పగ తీర్చుకునేందుకు తన దగ్గర అదిరిపోయే ప్లాన్ ఉందంటుంది అంజు. సరే ఏంటో చెప్పమంటారు మిగతా పిల్లలు. తాతయ్య తెచ్చిన ప్రసాదాన్ని ఇవ్వడానికి మిస్సమ్మ ఇప్పుడు మన దగ్గరకి వస్తుంది. తనకి మన స్టైల్లో వెల్​కమ్​ చెబుదామా అంటుంది అంజు.

శక్తులు అడ్డుగా నిలుస్తున్నాయి

సరేనంటారు మిగతా పిల్లలు. కారం, పసుపు కలిపిన నీళ్లను బకెట్‌లో పోసి తలుపు దగ్గర పైన కట్టి మిస్సమ్మ కోసం వెయిట్​ చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు ఆత్మకు వచ్చే శక్తులు తన ఆశయానికి అడ్డుగా నిలుస్తున్నాయనుకుంటుంది మనోహరి. సరస్వతి, మిస్సమ్మ, అరుంధతి, బాబ్జి.. ఇలా అందరూ తన చుట్టూ బిగుస్తున్న ఉచ్చుల్లో ముళ్లుగా మారిపోతున్నారని.. త్వరగా ఒక్కోటి విప్పాలని అనుకుంటుంది మనోహరి.

వెంటనే పిల్లల దగ్గరకు వెళ్లి వాళ్ల మనసులో మరింత విషాన్ని నింపాలని అనుకుంటూ వాళ్ల గదిలోకి వెళ్తుంది మనోహరి. మిస్సమ్మే వచ్చిందనుకుని తాడులాగి ఆ నీళ్లు మనోహరిపై పోస్తారు పిల్లలు. అప్పుడే పిల్లలకు ప్రసాదం ఇచ్చేందుకు వచ్చిన మిస్సమ్మ మనోహరిని చూసి నవ్వుతుంది. పక్కనే ఉన్న టవల్​తో తుడుచుకుంటుంది మనోహరి. ఆ టవల్​ మీద మసి ఉండటంతో మనోహరి ముఖం నల్లగా అవుతుంది. పిల్లలు, మిస్సమ్మ అందరూ నవ్వుతారు.

న్యాయం నా వైపు ఉంది

ఎందుకు నవ్వుతున్నారంటూ అద్దంలో చూసుకుని భయపడి కోపంగా అక్కడనుంచి వెళ్లిపోతుంది మనోహరి. చూశారా పిల్లలు.. న్యాయం నావైపు ఉంది కాబట్టి మీరు నాకోసం చేసిన పని మనోహరి పాలైంది అంటూ పిల్లలకు బొట్టు పెట్టడానికి వస్తుంది. పిల్లలు ముఖం పక్కకి తిప్పుకోవడంతో బలవంతంగా వాళ్లకి బొట్టు పెడుతుంది. అమ్ముకి బొట్టుపెట్టి ఊదడంతో అరుంధతి గుర్తొచ్చి మిస్సమ్మను అమ్మా.. అని పిలుస్తుంది.

తను మన అమ్మ కాదు మిస్సమ్మ అని అరుస్తుంది అంజు. అంటే.. అమ్మ కూడా బొట్టుపెట్టి ఇలానే ఊదేది అందుకే అలా అన్నాను అంటుంది అమ్ము. మిస్సమ్మ ఆశ్చర్యంగా అక్కడనుంచి కిందకు వెళ్లిపోతుంది. హాల్లోంచి వెళ్తున్న మిస్సమ్మకు గార్డెన్​లో తిరుగుతున్న అరుంధతి కనిపిస్తుంది. అక్కకు కూడా బొట్టు పెడదామనుకుంటూ పరిగెత్తుతుంది మిస్సమ్మ. బొట్టు పెట్టబోతున్న మిస్సమ్మను వారించి మా బంధువులు చనిపోయారు దేవుడి బొట్టు పెట్టుకోవద్దు అంటుంది అరుంధతి.

కొత్తగా పెళ్లయింది కదా

ఎందుకు అక్కా.. మీరు ప్రతిసారీ నేను ముట్టుకోవడానికి వస్తే అలా ఉలిక్కిపడతారు అంటుంది మిస్సమ్మ. సరే.. బొట్టు, ప్రసాదం పెట్టను కానీ ఒకసారి మిమ్మల్ని ముట్టుకుంటాను అంటూ అరుంధతి దగ్గరకు వెళ్తుంది. వద్దు మిస్సమ్మ.. నువ్వు కొత్తగా పెళ్లైనదానివి కదా.. అంటు ఉన్నవాళ్లని ముట్టుకోవడం మంచిది కాదు అంటుంది. భాగీ, అరుంధతి మాట్లాడుకుంటూ ఉండగా అమర్, రాథోడ్​ వస్తారు. భాగీ ఒక్కతే మాట్లాడుకుంటూ కనిపించడంతో ఎవరితో మాట్లాడుతున్నావ్​? అని భాగీని అడుగుతాడు అమర్.

నేను ఎవరితో అయినా మాట్లాడతాను మీకెందుకు అంటుంది భాగీ. ఆయన వచ్చారు నేను వెళ్తాను మిస్సమ్మ అంటుంది అరుంధతి. మీరు నా గెస్ట్​ అక్కా.. ఆయనకి భయపడి వెళ్లడం ఏంటి అంటుంది మిస్సమ్మ. నేను గెస్ట్ కాదు గోస్ట్​ అని తెలిస్తే ఏమైపోతావో మిస్సమ్మ అనుకుంటుంది అరుంధతి. మిస్సమ్మ ఒక్కతే మాట్లాడుకుంటూ కనిపించడంతో లూజు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు అమర్​. అక్కా నేను రేపు మీతో మాట్లాడతాను అంటూ అమర్​తో గొడవపడేందుకు వెళ్తుంది మిస్సమ్మ.

ఒక్కదానివే మాట్లాడుకుంటుంటే

ఆగండి.. మీతో మాట్లాడాలి.. ఇప్పుడు మీరెందుకు నన్ను లూజు అన్నారు అని అడుగుతుంది. ఇన్నాళ్లు నీకు పిచ్చి ఉందని అనుమానమే ఉండేది. కానీ ఇప్పుడు కన్ఫమ్​ అయ్యింది, రాథోడ్​ ఏదైనా మంచి మెంటల్​ హాస్పిటల్​ ఉంటే చూడు అంటాడు అమర్. నవ్వుతున్న రాథోడ్ దగ్గరకు వెళ్లి నన్ను అంత మాటంటుంటే నవ్వుతావేంటి అంటుంది మిస్సమ్మ. కొన్నిసార్లు నువ్వు చేసే పనులకి నవ్వొస్తుంది. ఒక్కదానివే మాట్లాడుకుంటుంటే మరేం అంటారు అంటాడు రాథోడ్.

అరే.. కాస్త చీకటిలో మనిషి కనపడకపోతే లేదంటారా.. ఈసారి అక్క వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను అంటుంది మిస్సమ్మ. రేపు పౌర్ణమి ఎలాగైనా మిస్సమ్మను చంపెయ్​ అని బాబ్జికి ఫోన్​ చేసి చెప్తుంది మనోహరి. సరే అంటాడు బాబ్జి. పొద్దున్నే లేచి పూజ చేసి దేవుడా.. నిన్ను నేనేం కోరట్లేదు కాస్త మనశ్శాంతి మాత్రమే అడుగుతున్నా అని మొక్కతుంది మిస్సమ్మ.

అరుంధతి ఏం చేయనుంది

పూజ పూర్తి చేసి అందరికీ హారతి ఇచ్చేందుకు ఇంట్లోకి వెళ్తుంది మిస్సమ్మ. గుడికి బయల్దేరిన అమర్​ను మనోహరి ఎలా ఆపుతుంది? పౌర్ణమికి వచ్చే శక్తులతో అరుంధతి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే జూన్ 1న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner