LongHair tips: జుట్టు వేగంగా పొడవుగా పెరగాలంటే ఉల్లిపాయ, లవంగం కలిపి ఇలా హెయిర్ ఆయిల్ చేసి వాడండి-mix onion and clove and do this to grow hair faster ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Longhair Tips: జుట్టు వేగంగా పొడవుగా పెరగాలంటే ఉల్లిపాయ, లవంగం కలిపి ఇలా హెయిర్ ఆయిల్ చేసి వాడండి

LongHair tips: జుట్టు వేగంగా పొడవుగా పెరగాలంటే ఉల్లిపాయ, లవంగం కలిపి ఇలా హెయిర్ ఆయిల్ చేసి వాడండి

Haritha Chappa HT Telugu
Dec 17, 2024 04:30 PM IST

LongHair tips: మీరు హెయిర్ ఫాల్ తో విసిగిపోతే కొన్ని చిట్కాలను పాటించండి. ఉల్లిపాయ, లవంగాలు కలిపి ఈ హోం రెసిపీని ప్రయత్నించండి. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం కూడా చాలా సులభం. ఇది ఎంతో అద్భుతంగా పనిచేసి జుట్టు రాలకుండా అడ్డుకుంటుంది.

జుట్టును పెంచే నూనె
జుట్టును పెంచే నూనె (Instagram)

పొడవాటి, అందమైన జుట్టు కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. తమ జుట్టు ఆరోగ్యంగా, మందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే నేటి కాలంలో అలాంటి జుట్టును పొందడం కష్టంగా మారుతోంది. నేడు, జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువైపోయింది. ముఖ్యంగా జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. ప్రతి ఇద్దరిలో ఒకరికి జుట్టు రాలే సమస్య అధికంగా ఉంది. హెయిర్ ఫాల్ తగ్గించడానికి మార్కెట్లో ఖరీదైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. రసాయనాలు కలిసిన ఆ మందులు వాడే బదులు ఇంట్లోనే ఆయిల్ తయారుచేసుకోవడం ఉత్తమం. కొద్ది రోజుల్లోనే మీ జుట్టు రాలడాన్ని తగ్గించే శక్తి ఉన్నహెయిర్ ఆయిల్ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.

yearly horoscope entry point

జుట్టును పెంచడంతో పాటూ జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో ఉల్లిపాయ, రోజ్మేరీ మూలికలు, లవంగాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయాని శాస్త్రీయంగా కూడా నిరూపణ అయింది. ఈ శక్తివంతమైన పదార్థాలను కలపడం ద్వారా ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ ను తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి, మీకు ఒకటి నుండి రెండు కప్పుల ఆవ నూనె, ఎనిమిది బాదం పప్పులు, ఒక టీస్పూన్ మెంతి గింజలు, కొద్దిగా రోజ్మేరీ పొడి, ఒక ఉల్లిపాయ, గుప్పెడు లవంగాలు అవసరం. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్ తయారీ

హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ ను ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే ముందుగా ఉల్లిపాయను తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయకు లవంగాలను గుచ్చాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆవనూనెను వేసి తక్కువ మంట మీద పెట్టాలి. నూనె వేడి అయ్యాక అందులో ఈ లవంగాలు గుచ్చిన ఉల్లిపాయను వేసి వేయించాలి. ఇప్పుడు బాదం పప్పులు, మెంతి గింజలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత మెంతులు, ఎండు రోజ్మేరీ ఆకులు వేయాలి. వాటిని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆ నూనెను చల్లారాక వడకట్టుకుని నూనెను ఒక సీసాలో వేసుకోవాలి. అంతే నూనె సిద్ధంగా ఉంది. తట స్నానం చేయడానికి ఒక గంట ముందు ఈ నూనెను జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయాలి. ఆ తరువాత తలకు స్నానం చేయాలి. కొన్ని నెలల్లోనే మీకు మంచి పలితాలు కనిపిస్తాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner