IRCTC Super App : రైలు టికెట్ బుకింగ్ కోసం కొత్త యాప్.. డౌన్‌లోడ్ చేయడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?-irctc super app know what is this and how to download it after launch check uses of this application ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Irctc Super App : రైలు టికెట్ బుకింగ్ కోసం కొత్త యాప్.. డౌన్‌లోడ్ చేయడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?

IRCTC Super App : రైలు టికెట్ బుకింగ్ కోసం కొత్త యాప్.. డౌన్‌లోడ్ చేయడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?

Anand Sai HT Telugu

IRCTC Super App : భారతీయ రైల్వే అతి త్వరలో ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్‌ను లాంచ్ చేసేందుకు ప్రయత్వాలు చేస్తోంది. దీని ద్వారా ప్రయాణికులకు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. దీనిని ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్‌

భారతీయ రైల్వే త్వరలో ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్ పేరుతో రైలు టిక్కెట్ బుకింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ యాప్ కస్టమర్ల సౌలభ్యం కోసం, రైల్వే సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫారమ్ కింద డిజిటలైజ్ చేయడం కోసం రూపొందించారు. రైలు టికెట్ బుకింగ్, కార్గో బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రైల్వే ప్లాట్‌ఫారమ్ పాస్, రైలు ఎక్కడికి చేరిందో ట్రాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఈ సూపర్ యాప్‌లో ఉంటాయి.

సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) దీని కోసం IRCTCతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అనేక సేవలను అందించే సూపర్ యాప్ ఇది. ఈ యాప్ విడుదలకు సంబంధించిన ప్రణాళికలు సెప్టెంబరులో ప్రకటించారు. ఏ సమయంలోనైనా యాప్ ప్రత్యక్ష ప్రసారం కానుందని భావిస్తున్నారు.

ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్ అనేది రైల్వే ప్రయాణ బుకింగ్, ఇతర సంబంధిత సేవలను నిర్వహించడానికి వినియోగదారుల కోసం రూపొందించారు. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ అనే అధికారిక యాప్‌ను కలిగి ఉంది. ఇది టికెట్ బుకింగ్ సేవలను అందిస్తుంది. ఈ సూపర్ యాప్ రైలు టిక్కెట్ బుకింగ్‌కు మించి సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజం ప్యాకేజీలు, ఫుడ్ ఆర్డర్‌లు వంటి ఫీచర్‌లతో వస్తుంది. ప్రయాణికులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది.

ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్లే స్టోర్ నుంచి iOS వినియోగదారుల కోసం యాపిల్ యాప్ స్టోర్ నుండి ఏదైనా ఇతర యాప్ లాగానే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీతో ఇప్పటికే ఖాతా ఉన్న వినియోగదారులు లాగిన్ చేయవచ్చు. కొత్త వినియోగదారులు యాప్ ద్వారా త్వరగా ఖాతాను తెరవగలరు.

ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్ టిక్కెట్‌ను పొందే అధిక అవకాశాన్ని అందిస్తుంది. ప్రత్యక్ష బుకింగ్ అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయ రైళ్లు లేదా మార్గాలను సిఫార్సు చేయడానికి VIKALP వంటి సాధనాలను ఉపయోగిస్తుంది. వినియోగదారులు వివిధ రైళ్లు, కోచ్ సీటు లభ్యతను కూడా చెక్ చేయవచ్చు. వికల్ప్ వంటి సాధనాలను ఉపయోగించి టిక్కెట్ ఎంపికలను నిర్ధారించగల సామర్థ్యం ప్రత్యేకమైన లక్షణాలలో ఒకటి. రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవడానికి, రైలు షెడ్యూల్‌లను, సీట్ల లభ్యత, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

యాప్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా యూపీఐ, డెబిట్ \ క్రెడిట్ కార్డ్ చెల్లింపు, నెట్‌బ్యాంకింగ్ మొదలైన చెల్లింపు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ యాప్ వినియోగదారులకు స్పీడ్‌గా పనిచేస్తుంది. మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. మీ ప్రయాణ బుకింగ్‌లు, రద్దులు, ఆఫర్‌ల సమయం గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.