IRCTC Packages : ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర.. విజయవాడ, రాజమండ్రి మీదుగా ప్రత్యేక రైలు.. ప్యాకేజీ వివరాలు ఇవే
IRCTC Packages : ఐఆర్‌సీటీసీ భక్తులకు, యాత్రికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి మీదుగా అయోధ్య, కాశీ తదితర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలును ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది.
పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ సందర్శనార్థం వెళ్లే భక్తులకు కోసం.. ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు నడుపుతుంది. 10 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన తీర్థయాత్రలు, చారిత్రక ప్రదేశాల సందర్శన ఉంటుంది.
మొత్తం తొమ్మిది రాత్రులు, పది పగలుతో ఈ యాత్ర ఉంటుంది. ఈ రైలు డిసెంబర్ 11న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి, తిరిగి డిసెంబర్ 20 చేరుకుంటుంది. ఈ యాత్రకు వచ్చే ప్రయాణికులు ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలి. భద్రతా కారణాల దృష్ట్యా ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్ వంటి ఫోటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
ఏపీ, తెలంగాణలో..
సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు.. భువనగిరి, జనగాం, వరంగల్, మహబుబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
పుణ్యక్షేత్రాలు..
పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయలో విష్ణుపాద ఆలయం, వారణాశిలో కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, సాయంత్రం గంగా హారతి, అయోధ్యలో సరయు నది వద్ద రామజన్మభూమి, హనుమాన్ గర్హి, హారతి ప్రయోగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం తదితర ప్రాంతాలను సందర్శింవచ్చు
ప్యాకేజీ ఇలా..
టీ, టిఫిన్, భోజనం, రవాణా, ప్రమాద బీమా అన్ని కలిపి టిక్కెట్ ధర ఒక్కొక్కొరికీ స్లీపర్ క్లాస్ పెద్దలకు రూ.16,800, పిల్లలు (5-11 ఏళ్ల)కు రూ. 15,690, థర్ఢ్ ఏసీ పెద్దలకు రూ.26,650, పిల్లలకు రూ.25,340, సెకెండ్ ఏసీ పెద్దలకు రూ.34,910, పిల్లకు రూ.33,330 ఉంటుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SCZBG33 ను ఉపయోగించి టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. టిక్కెట్లు బుకింగ్, ఇతర వివరాలకు 9281495848, 8977314121 ఫోన్ నెంబర్లను సంప్రదించొచ్చు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)