AP Farmers : పాడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలు-ap govt good news to animal husbandry farmers loan upto 2 lakhs on pashu kisan credit card ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Farmers : పాడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలు

AP Farmers : పాడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 18, 2024 03:59 PM IST

AP Farmers : పాడి, ఆక్వా రైతులు, మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డులపై 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు లోన్లు ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. జనవరిలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు అందించాలన్నారు.

పాడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలు
పాడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలు

AP Farmers : ఏపీ పశుసంవర్ధక శాఖలో 297 పోస్టుల భర్తీ చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆరోపించారు. మంగళవారం పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

పశు కిసాన్ క్రెడిట్ కార్డులపై రూ.2 లక్షల రుణాలు

పశు కిసాన్ క్రెడిట్ కార్డులపై 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలను ఇవ్వాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలన్నారు. మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీలలో ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం, గడ్డి పెంపకం పథకాలను ఎక్కువ మంది లబ్దిదారులకు అందించేందుకు నివేదిక సిద్ధం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

జనవరిలో మత్స్యకార భరోసా

ఎన్నికల హామీ మేరకు ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులకు తక్షణమే చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారుల ఇంధన రాయితీలో ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రూ. 7 కోట్లు నిధుల మంజూరు చేశామని తెలిపారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల ఆసుపత్రులకు భవన నిర్మాణాలు, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జనవరిలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు అందించాలన్నారు. పశువులు, గోర్రెలకు టీకాలు జనవరి నెలలో వేయాలని అధికారులను ఆదేశించారు.

పశు కిసాన్ క్రెడిట్ కార్డు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశుసంవర్ధక రైతులకు రాయితీపై రుణాలు అందిస్తుంది. రైతుల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అమలు చేస్తుంది. ఈ కార్డు ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, రొయ్యల పెంపకం..కింద రైతులకు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంది. పశుసంవర్ధక రైతులకు ప్రోత్సాహం అందించేందుకు భారత ప్రభుత్వం 'పశు కిసాన్ క్రెడిట్ కార్డ్'ని ప్రారంభించింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పశుపోషణ, చేపల పెంపకానికి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ను బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తుంది. ఈ పథకం కింద పశువుల పెంపకందారులకు రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తారు. రూ.1.6 లక్షల వరకు రుణాలకు ఎలాంటి హామీ అవసరం లేదు.

పశు కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా దరఖాస్తు చేయాలి?

* ముందుగా దరఖాస్తుదారుడు తన సమీప బ్యాంకుకు వెళ్లాలి.

* బ్యాంక్ నుంచి పశు కిసాన్ క్రెడిట్ కార్డు అప్లికేషన్ పొందాలి.

* ఫారమ్ నింపి బ్యాంకులో సమర్పించాలి.

* KYC కోసం కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

* మీరు బ్యాంకుకు వెళ్లలేకపోతే, ఏదైనా CSC కేంద్రానికి వెళ్లి ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

* అప్లికేషన్ నింపిన తర్వాత మీ వివరాలు ధృవీకరణకు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

* పశువుల పెంపకందారు అర్హత కలిగి ఉంటే...అతడికి 15 నుంచి 30 రోజుల్లోపు పశు కిసాన్ క్రెడిట్ కార్డును మంజూరు చేస్తారు.

పశు క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం కావాల్సిన పత్రాలు

* దరఖాస్తుదారు భారతదేశంలో శాశ్వత నివాసి అయి ఉండాలి

* పశువుల ఆరోగ్య ధృవీకరణ పత్రం

* పశువులకు బీమా కలిగి ఉండాలి.

* దరఖాస్తుదారు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID కార్డ్

* మొబైల్ నంబర్

* పాస్‌పోర్ట్ సైజు ఫొటో

* బ్యాంక్ అకౌంట్

* పాన్ కార్డు

Whats_app_banner

సంబంధిత కథనం