Pariksha Pe Charcha with PM Modi: పీఎం మోదీతో ‘పరీక్షా పే చర్చా 2025’ లో పాల్గొనే అవకాశం; ఇలా చేస్తే చాలు..
Pariksha Pe Charcha with PM Modi: విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సువర్ణావకాశం. 2025 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీతో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అందుకు గానూ, సీబీఎస్ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి, ఈ పని చేస్తే చాలు. పూర్తి వివరాలకు కింద చదవండి..
Pariksha Pe Charcha with PM Modi: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ ‘పరీక్షా పే చర్చా 2025’ లో పాల్గొనాలనుకునే అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in లో ఈ అధికారిక ప్రకటన అందుబాటులో ఉంది. ‘పరీక్షా పే చర్చా 2025’ లో పాల్గొనాలనుకునే వారి కోసం ఆన్లైన్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్న, ఎంసీక్యూ పోటీని innovateindia1.mygov.in నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలియజేసింది. 2024 డిసెంబర్ 14న ప్రారంభమైన ఈ పోటీలు 2025 జనవరి 14న ముగుస్తాయి. ఈ ఎంసీక్యూ పోటీల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనవచ్చు.
ప్రధానికి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు
ఈ పోటీ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ ప్రశ్నలను దేశ ప్రధానికి తెలియజేయడానికి వీలు కల్పిస్తారు. నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేసిన ప్రశ్నలు ప్రోగ్రామ్ లో ఉంటాయి. ఈ నేపధ్యంలో, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో పరీక్ష ఒత్తిడిని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి, ప్రోత్సహించడానికి పాఠశాలలు వినూత్న చర్యలను అవలంబించాలని సీబీఎస్ఈ (CBSE) కోరింది. ఈవెంట్ గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఉపయోగించడం, పాఠశాలలోని ప్రముఖ ప్రదేశాలలో ప్రోగ్రామ్ వివరాలను ప్రదర్శించడం, ఆన్లైన్ ఎంసిక్యూ పోటీకి గరిష్ట సంఖ్యలో విద్యార్థులు నమోదు అయ్యేలా చూడడం మొదలైనవి చేయాలని సూచించింది.
టీవీ ఛానెళ్ల ఇంటర్య్వూల్లో..
గతంలో జరిగిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రశ్నలు అడిగిన వారిని మీడియా ఛానళ్లు తమ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. అదే తరహాలో ఈ ఏడాది ఎంపికైన కొద్దిమందికి మీడియాతో మాట్లాడే అవకాశం లభించవచ్చు. 2025 జనవరిలో ఢిల్లీలోని భారత్ మండపంలో పరీక్షా పే చర్చా 2025 జరగనుంది. ఈ పీపీసీ 8వ ఎడిషన్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి మాట్లాడుతారు. విద్యార్థులు తమ కలలు, లక్ష్యాలను సాధించడానికి సహాయపడటానికి, వారికి మద్దతు ఇవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.