NEET-UG row: నీట్ - యూజీ వివాదంపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ-neet ug row pm assures strict action against culprits slams opposition ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet-ug Row: నీట్ - యూజీ వివాదంపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

NEET-UG row: నీట్ - యూజీ వివాదంపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

HT Telugu Desk HT Telugu
Jul 03, 2024 04:28 PM IST

నీట్-యూజీ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తొలిసారి లోక సభ లో స్పందించారు. నీట్ యూజీ పేపర్ లీక్ పై చర్చ జరపాలని కోరుతూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాసిన మర్నాడు ప్రధాని దీనిపై స్పందించడం విశేషం.

నీట్ - యూజీ వివాదంపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
నీట్ - యూజీ వివాదంపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

నీట్ యూజీ పేపర్ లీకేజీ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తొలిసారి నోరు విప్పారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) లేదా నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశ యువత భవిష్యత్తుతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. నీట్ యూజీ విషయంలో తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు.

yearly horoscope entry point

రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావన

రాష్ట్రపతి తన ప్రసంగంలో నీట్ యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ గురించి ప్రస్తావించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘‘సభ మొత్తం రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై చర్చించాలని ఆశిస్తున్నాను. దురదృష్టవశాత్తూ, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఈ కీలక అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు’’ అని రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు.

కఠిన చట్టాలు చేశాం..

నీట్ యూజీ (NEET-UG) విషయంలో మోసం చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని యువతకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ‘‘పార్లమెంటులో ఈ అక్రమాలపై కఠిన చట్టాలు చేశాం. దేశ యువత భవిష్యత్తులో భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేకుండా, ఆత్మవిశ్వాసంతో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి, తమకు న్యాయంగా దక్కాల్సినది దక్కేలా మొత్తం వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. బాధిత విద్యార్థులకు న్యాయం చేయడానికి, నీట్ పేపర్ (NEET-UG paper leak) లీకేజీ కేసులో బాధ్యులను శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధాని మంగళవారం లోక్ సభలో అన్నారు. భారత యువత భవిష్యత్తుతో ఎవరినీ ఆడుకోనివ్వబోమని ఆయన హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ లేఖ

నీట్-యూజీ వివాదంపై పార్లమెంటులో చర్చించాలని కోరుతూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని పలువురు ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేసిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్మాణాత్మకంగా ముందుకు సాగే మార్గాన్ని కనుగొనడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘భారతదేశం అంతటా ఉన్న దాదాపు 24 లక్షల మంది నీట్ (NEET) అభ్యర్థులకు న్యాయం జరగాలన్నదే ప్రస్తుతం మా ఏకైక ఆందోళన. లక్షలాది కుటుంబాలు తమ పిల్లల కోసం వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేశాయి. చాలా మందికి పేపర్ లీకేజీ జీవితకాల స్వప్నానికి ద్రోహం’’ అని ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గత ఏడేళ్లలో ఇలాంటి 70 పేపర్ లీకేజ్ లు 20 మిలియన్లకు పైగా విద్యార్థులపై ప్రభావం చూపాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.