PSU bonus shares: 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించిన పీఎస్యూ కంపెనీ; రికార్డ్ డేట్ ఎప్పుడంటే..?
PSU bonus shares: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ తన ఇన్వెస్టర్లకు 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అర్హులను నిర్ధారించే రికార్డు డేట్ ను కూడా ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..
PSU bonus shares: బోనస్ షేర్ల జారీకి రికార్డు తేదీని నిర్ణయించినట్లు ఎన్ఎండీసీ ప్రకటించింది. బోనస్ షేర్ల జారీకి వాటాదారుల అర్హతను నిర్ణయించడానికి 2024 డిసెంబర్ 27 శుక్రవారంను 'రికార్డు తేదీ'గా నిర్ణయించినట్లు ఎన్ఎండీసీ తెలిపింది. ప్రతిపాదిత బోనస్ ఇష్యూ కోసం స్టాక్ ఎక్స్ఛేంజీల (stock market) నుండి 16 డిసెంబర్ 2024 న సూత్రప్రాయ ఆమోదం పొందినట్లు కంపెనీ తెలిపింది.
కేటాయింపు 2024 డిసెంబర్ 30
ఎన్ఎండీసీ కంపెనీ అర్హులైన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను సోమవారం, 30 డిసెంబర్ 2024 న కేటాయిస్తుంది. ఈ బోనస్ షేర్లను మరుసటి రోజు అంటే 2024 డిసెంబర్ 31 మంగళవారం ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్ఎండీసీ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. 2:1 నిష్పత్తిలో బోనస్ ఇష్యూను ఎన్ఎండీసీ గతంలో ప్రకటించింది. కంపెనీలో ఉన్న రూ.1 విలువ గల ప్రతి 1 ఒక ఈక్విటీ షేరుకు 2 కొత్త ఈక్విటీ షేర్లను కేటాయిస్తారు. మొత్తంగా కొత్తగా 5,86,12,11,700 ఈక్విటీ షేర్లను బోనస్ షేర్లుగా కేటాయించనుంది.
పడిపోయిన షేర్ ధర
ఎన్ఎండీసీ షేరు ధర (NMDC share price) ఈ నెలలో 5% పైగా లాభపడింది. కానీ గత ఆరు నెలల్లో 13% పైగా పడిపోయింది. పీఎస్యూ షేరు ఏడాదిలో 9 శాతం (YTD) పెరిగి మూడేళ్లలో 110 శాతం పెరిగింది. బుధవారం ఉదయం నుంచీ ఈ షేరు ధర పడిపోతోంది. బుధవారం మధ్యాహ్నం గం.2.00 సమయానికి బీఎస్ఈలో ఎన్ఎండీసీ షేరు ధర సుమారు 6% పడిపోయి, రూ.213.50 వద్ద ట్రేడవుతోంది.