తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ సింపుల్ టిప్‌తో.. 0 రిస్క్‌తో మీ క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు సంపాదించండి!
- క్రెడిట్ కార్డులతో ఖర్చులు చేయడమే కాదు, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని మీకు తెలుసా? క్రెడిట్ కార్డులతో డబ్బులు ఆదా చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటే..
- క్రెడిట్ కార్డులతో ఖర్చులు చేయడమే కాదు, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని మీకు తెలుసా? క్రెడిట్ కార్డులతో డబ్బులు ఆదా చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటే..
(1 / 4)
డబ్బు సంపాదన ముందు క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకోవాలి. బ్యాంక్‌లు ఇచ్చే క్రెడిట్ కార్డుల మీద 30-45 రోజుల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు లభిస్తాయి. క్రెడిట్ కార్డు వాడి.. మీరు ఎన్ని ఖర్చులు చేసినా, నెల చివర్లో స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. అక్కడి నుంచి 1- 2 వారాలకు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లోపు కట్టేస్తే.. మీ నుంచి బ్యాంక్ ఎలాంటి డబ్బులు సంపాదించదు. కట్టకపోతే.. అప్పుడు వడ్డీ వేస్తుంది.
(2 / 4)
ఈ 30- 45 రోజుల టైమ్ పీరియడ్‌తో మనం అడ్వాంటేజ్ పొంది డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు. దీనికి ఒక ట్రిక్ ఉంది. నెల మొదట్లో పడే జీతంతో సాధారణంగా బిల్లులను కడతారు. అలా కాకుండా.. డబ్బులను పక్కన పెట్టి, కరెంట్ బిల్లు, షాపింగ్, రెస్టారెంట్ ఖర్చులు, పెట్రోల్ బిల్లు, ట్యాక్సీ బిల్లుల కోసం మీరు క్రెడిట్ కార్డులను ఉపయోగించండి. స్టేట్మెంట్ జనరేట్ అయ్యి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి 45 రోజుల సమయం ఉంటుంది కాబట్టి, ఈలోపు.. మీరు దాచిన డబ్బులను 'ఇన్వెస్ట్' చేయవచ్చు.
(3 / 4)
తక్కువ టైమ్‌లో రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. వివిధ బ్యాంక్‌లలో ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి. ఏది బెస్ట్ అనిపిస్తే దానిని ఎంచుకుని.. 30,35 రోజుల కోసం మీ మనీని ఎఫ్‌డీల్లో పెట్టండి. ఆ తర్వాత.. అసలు డబ్బును తీసి, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేయండి. ఎఫ్డీపై వచ్చిన వడ్డీ.. మీకు అదనపు ఆదాయం!
ఇతర గ్యాలరీలు