OTT Korean Dramas: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన ఓ కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్, మూవీ
OTT Korean Dramas: ఓటీటీలోకి ఒకే రోజు ఓ కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్, మరో మూవీ వచ్చింది. ఇవి రెండూ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. మరి వీటిని ఎక్కడ చూడాలంటే..
OTT Korean Dramas: కొరియన్ డ్రామాస్ అంటే ఇష్టమా? వాటిని తెలుగులో చూడాలా? అయితే మీకోసమే కొత్తగా ఓ వెబ్ సిరీస్, మరో మూవీ ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టాయి. వీటిలో ఒకటి 2015లో వచ్చిన హిట్ టీవీ సిరీస్ హైడ్ జేడ్ మి కాగా.. మరొకటి 2013లో వచ్చిన మూవీ వెరీ ఆర్డినరీ కపుల్. ఇవి రెండూ రొమాంటిక్ కామెడీ జానర్ కు చెందినవే.
ఓటీటీ కొరియన్ డ్రామాస్
కొరియన్ డ్రామాస్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వాటిని తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎంఎక్స్ ప్లేయర్ మన దేశంలో ఇలాంటి కే డ్రామాస్ కు కేరాఫ్ అని చెప్పొచ్చు. ఈ మధ్యే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను అమెజాన్ కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు ప్రైమ్ వీడియోతోపాటు ఎంఎక్స్ ప్లేయర్ లోనూ ఈ కొరియన్ డ్రామాస్ వస్తున్నాయి.
తాజాగా మంగళవారం (డిసెంబర్ 17) నుంచి ఓ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్, మరో మూవీ ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టాయి. ఇందులో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ పేరు హైడ్ జేకిల్ మి. ఈ సిరీస్ ఇప్పుడు కొరియన్ తోపాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఇది 2015లో వచ్చిన టీవీ సిరీస్.
దీనిని ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వండర్ ల్యాండ్ అనే ఓ థీమ్ పార్క్ లో సర్కస్ షోని ఇక ఆపేయాలని ఓనర్ అనుకుంటాడు. అయితే ఆ షోలో లీడ్ నటితో ఆ ఓనర్ ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ హైడ్ జేకిల్ మి సిరీస్ లో చూడొచ్చు.
రొమాంటిక్ కామెడీ మూవీ
ఇక ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ లోకే వచ్చిన మరో కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ వెరీ ఆర్డినరీ కపుల్. ఇది ఒకే ఆఫీసులో పని చేసే ఓ జంట చుట్టూ తిరిగే కథ. వీళ్లు ఓసారి పోట్లాడుకొని తమ బ్రేకప్ చెప్పేసుకుంటారు. తర్వాత ఇద్దరూ వేర్వేరు పార్ట్‌నర్స్ కోసం చూస్తుంటారు.
కానీ సరైన పార్ట్‌నర్ దొరకరు. ఈ నేపథ్యంలో తమ మధ్య ఇంకా ప్రేమ ఉందని వీళ్లు గుర్తిస్తారు. తర్వాత ఏం జరగుతుందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఇది 2013లో వచ్చిన కొరియన్ మూవీ. ఇప్పుడీ సినిమాను కొరియన్ తోపాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం.