OTT Korean Dramas Effect: వామ్మో కొరియన్ డ్రామాస్‌కు ఇంత క్రేజా.. తమ కొడుక్కి కొరియన్ పేరు పెట్టుకున్న ఇండియన్ పేరెంట్స్-ott korean dramas effect indian parents named their son kang tae moo tripathi shocks internet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Korean Dramas Effect: వామ్మో కొరియన్ డ్రామాస్‌కు ఇంత క్రేజా.. తమ కొడుక్కి కొరియన్ పేరు పెట్టుకున్న ఇండియన్ పేరెంట్స్

OTT Korean Dramas Effect: వామ్మో కొరియన్ డ్రామాస్‌కు ఇంత క్రేజా.. తమ కొడుక్కి కొరియన్ పేరు పెట్టుకున్న ఇండియన్ పేరెంట్స్

Hari Prasad S HT Telugu
Nov 05, 2024 07:45 AM IST

OTT Korean Dramas Effect: కొరియన్ డ్రామాస్ ఇక్కడి ప్రేక్షకులపై ఎంతలా ప్రభావం చూపిస్తున్నాయో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. ఇండియన్ పేరెంట్స్ ఈ కే-డ్రామాస్ చూసి చూసి తమకు పుట్టిన బాబుకి కొరియన్ పేరు పెట్టారంటే నమ్మగలరా?

వామ్మో కొరియన్ డ్రామాస్‌కు ఇంత క్రేజా.. తమ కొడుక్కి కొరియన్ పేరు పెట్టుకున్న ఇండియన్ పేరెంట్స్
వామ్మో కొరియన్ డ్రామాస్‌కు ఇంత క్రేజా.. తమ కొడుక్కి కొరియన్ పేరు పెట్టుకున్న ఇండియన్ పేరెంట్స్

OTT Korean Dramas Effect: కే-డ్రామాస్ తో ఇప్పుడు ఇండియానే కాదు మొత్తం ప్రపంచమే ఊగిపోతోంది. ఓటీటీ వచ్చిన తర్వాత దేశవిదేశాల్లోని కంటెంట్ సులువుగా అందరికీ దొరుకుతోంది. అలా అలా ఆ కొరియన్ డ్రామాస్ కు అలవాటు పడిన ఇండియన్ ఆడియెన్స్.. వాటికి పూర్తిగా అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే ఇండియన్ పేరెంట్స్ తమ బాబుకు తమకు బాగా నచ్చిన కొరియన్ పాత్ర పేరు పెట్టుకోవడం విశేషం.

కాంగ్ తే-మూ త్రిపాఠీ.. పేరెప్పుడైనా విన్నారా?

కొరియన్ డ్రామాస్ గురించి వినడం, చూడటమే కానీ.. వీటికి వీరాభిమానులు ఉంటారని మీకు తెలుసా? అలాంటి ఇద్దరు ఫ్యాన్స్ గురించి ఈ మధ్య చేసిన సోషల్ మీడియా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తన కజిన్, అతని భార్య కొరియన్ డ్రామాస్ చూసి చూసి చివరికి తమ కొడుక్కి తమకు బాగా నచ్చిన ఓ కొరియన్ పాత్ర పేరును ఎలా పెట్టారో చెబుతూ divyaathedivaaa అనే ఎక్స్ యూజర్ ఓ పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ చూసి కే-డ్రామాస్ అభిమానులు తెగ ఖుషీ అవుతుంటే.. మిగిలిన వాళ్లు ఇలా కూడా ఉంటారా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడో కొరియన్ డ్రామాస్ గురించి సోషల్ మీడియా చర్చల్లోనే కలుసుకున్న ఆ జంట.. ఆ తర్వాత రోజుల తరబడి ఒక్కటి కూడా వదలకుండా నెట్‌ఫ్లిక్స్ లోని కొరియన్ డ్రామాస్ మొత్తం చూశారట. దాని ప్రభావమే ఈ పేరు అంటూ ఆ యూజర్ చెప్పుకొచ్చారు.

ఏం పేరు పెట్టాలనే పోల్

ఆ కొరియన్ డ్రామాస్ చూసిన తర్వాత వాళ్లకు ఓ బాబు పుట్టాడు. తన బాబుకు ఏ కొరియన్ డ్రామాలోని పాత్ర పేరు పెట్టాలంటూ ఓ పోల్ ను కూడా తమ వదిన వాట్సాప్ లో నడిపించినట్లు ఆమె తెలిపారు. కిమ్ సూ-హ్యూన్ త్రిపాఠీ, చొయ్ సెయుంగ్-హ్యో త్రిపాఠీ, కాంగ్ తే-మూ త్రిపాఠీల్లో ఏది బాగుంటుందని ఆ పోల్లో ఆమె అడిగారు. దీనికి చాలా మంది కాంగ్ తే-మూ త్రిపాఠీ బాగుందంటూ ఓటేశారు. దీంతో ఆ జంట తమ బాబుకు అదే పేరు పెట్టారు.

ఈ విషయాన్ని సదరు యూజర్ ఎక్స్ ద్వారా తెలిపారు. "నా కజిన్, అతని భార్య కేడ్రామాస్ గురించి జరుగుతున్న చర్చ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ళ్లు నెట్‌ఫ్లిక్స్ లోని కేడ్రామాస్ అన్నింటినీ వదలకుండా చూశారు. వాళ్లకు ఈ మధ్యే ఓ బాబు పుట్టాడు.. వాళ్లు ఏం చేశారో చూడండి" అంటూ ఆ పోల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.

కొరియన్ డ్రామాస్ పై అభిమానం ఉన్నంత వరకూ ఓకేగానీ.. అది మరీ ఇలా ముదిరితే బాగుండదని కొందరు కామెంట్స్ చేశారు. వాళ్లు ఆ బాబును ఇండియాలోనే పెంచాలనుకుంటే మాత్రం అతనికి ఇబ్బందులు తప్పవని చాలా మంది సూచించారు. ఆ బాబుకు జీవితాంతం వేధింపులు ఉంటాయనీ అంటున్నారు. మరి దీనికి ఆ కపుల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కొరియన్ డ్రామాస్ ను అభిమానించడం వరకు ఓకేగానీ.. ఇలా చేయడం సరికాదన్న నెటిజన్ల అభిప్రాయంతో మీరూ ఏకీభవిస్తారా?

Whats_app_banner