ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒత్తిడి ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించడానికి దైనందిక జీవితంలో యోగా, వ్యాయామం వంటి పనులతో పాటు కొన్ని గ్రహాల అనుకూలత కూడా అవసరమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Pixabay
By Ramya Sri Marka Dec 17, 2024
Hindustan Times Telugu
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే వ్యక్తి జీవితంలో శాంతి, సానుకూల ప్రభావాలు మెండుగా ఉంటాయి. ఒత్తిడి తగ్గాలంటే ఏయే గ్రహాలు అనుకూలంగా ఉండాలో చూద్దాం.
Pixabay
చంద్రుడు:
చంద్రుడు మన మానసిక శాంతి, భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడతాడు. చంద్ర గ్రహం అనుకూలంగా ఉంటే శాంతి, జ్ఞానం, నెమ్మదింపు, హాయి పెరుగుతాయి.ఒత్తిడి తగ్గుతుంది.
Pixabay
బుధుడు:
బుధుడు మన ఆలోచనా శక్తి, కమ్యూనికేషన్, చాతుర్యాన్ని ప్రభావితం చేస్తాడు. ఈ గ్రహం అనుకూలంగా ఉంటే మానసిక స్పష్టత పెరుగుతుంది, సమస్యలను సులభంగా పరిష్కంచ గలుగుతారు. ప్రశాంతంగా ఉంటారు.
Pixabay
శుక్రుడు:
శుక్రుడు ప్రేమ, అనురాగం, సుఖం, సంపదల గ్రహం.ఈ గ్రహం అనుకూలంగా ఉంటే ధైర్యంగా, హాయిగా, సానుకూల ఆలోచనలతో ఉంటారు. వ్యక్తిగత, సామాజిక జీవితంలో సంతృప్తిని, సుఖాన్నిపొందుతారు. ఒత్తిడి తగ్గుతుంది.
Pixabay
గురు:
గురు గ్రహం విజ్ఞానం, పుణ్యకార్యాలు, తాత్త్వికత, దార్శనికతల గ్రహం.ఈ గ్రహం అనుకూలంగా ఉంటే మంచి ఆలోచనలు, ఆశాభావం, శాంతి, ప్రేరణ లభిస్తాయి. ఒత్తిడి తగ్గుతుంది.
Pixabay
శని:
శని కష్టం, ప్రయత్నం, సమయాన్ని నేర్పే గ్రహం.శని అనుకూలంగా ఉంటే ధైర్యం, నిస్వార్థం, ఓర్పు కలుగుతాయి. నిస్వార్థ ఆలోచనలతో ఉంటారు. ఒత్తిడి తగ్గించే ముఖ్య గ్రహం శని.
Pixabay
రాహు,కేతు:
రాహు, కేతువులు వ్యక్తిగత ప్రపంచాన్ని, ఆధ్యాత్మికతను, మనస్సును ప్రభావితం చేస్తాయి. ఈ గ్రహం అనుకూలంగా ఉంటే దార్శనికత, శాంతి లభిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
Pixabay
ఈ గ్రహాల అనుకూలత కోసం సంబంధిత రత్నాలు ధరించడం, గ్రహబలం పెంచేందుకు ప్రత్యేక పూజలు, వ్రతాలు చేయడం వల్ల ఒత్తిడి నుంచి మరింత ఉపశమనం దొరుకుతుంది.
Pixabay
ఎన్నో పోషక విలువలు ఉసిరిలో ఉంటాయి. ఉసిరిని చలికాలంలో తీసుకుంటే ఎంతో ఉపయోగముంటుంది. ఉసిరికాయ చలికాలంలో విరివిగా లభిస్తుంది.