NNS 17th December Episode: అమర్‌కి దగ్గరవ్వాలనుకున్న మనోహరి.. మిస్సమ్మ వార్నింగ్.. ఆరుకు మరో ముప్పు!
NNS 17thDecember Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (డిసెంబర్ 17) ఎపిసోడ్లో అమర్ కు దగ్గరవ్వడానికి ప్రయత్నించిన మనోహరికి మిస్సమ్మ గట్టి వార్నింగ్ ఇస్తుంది. అటు ఆరుకు మరో ప్రమాదం పొంచి ఉందని గుప్త చెబుతాడు.
NNS 17th December Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (డిసెంబర్ 17) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్‌కి ఎలాగైనా దగ్గరవ్వాలనుకుంటుంది మనోహరి. కాఫీ కలిపి ఇద్దామని కిచెన్‌లోకి వెళ్తుంది. మనోహరి కిచెన్‌లో కాఫీ చేస్తుంటే నవ్వుతూ అక్కా మీకు ఒకటి చూపిస్తాను రండి అంటూ ఆరును భాగీ కిచెన్ డోర్ దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తుంది.
కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు
అక్కడ చూసిన గుప్త.. బాలిక ఇక్కడ ఏం జరుగుతుందని మనం ఇక్కడకు వచ్చాము అని ఆరును అడుగుతాడు. నాకు తెలిశాక నీకు చెప్తాను అంటుంది ఆరు. అక్కా మీకు తెలిస్తే ఎవరికి చెప్తారు అంటూ అడుగుతుంది మిస్సమ్మ. తెలిశాక చెప్తాను అటు చూడు అంటుంది ఆరు. ఏంటి మిస్సమ్మ ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి.. అని గట్టిగా అరుస్తుంటే అక్కా చిన్నగా మాట్లాడండి మీ మాటలు మనుకు వినిపిస్తాయి అంటుంది.
నా మాటలు తనకెందుకు వినిపిస్తాయి.. నీకు మాత్రమే వినిపిస్తాయి కదా అంటుంది ఆరు. మనుకు ఎందుకు వినిపించవు.. నాకు మాత్రమే ఎందుకు వినిపిస్తాయి అని మిస్సమ్మ అడిగితే నువ్వు దగ్గరగా ఉన్నావు.. మను దూరంగా ఉంది కదా అందుకే నీకు వినిపిస్తాయి అని చెప్తూ.. మనోహరి కాఫీ పెట్టడాన్ని చూపించడానికి నన్ను తీసుకొచ్చావా..? అంటూ అసలు మనోహరి ఏం చేస్తుందో తెలుసా..? ఆయనకు దగ్గర అవ్వాలని చూస్తుంది. నిన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టాలని చూస్తుంది అని చెప్పగానే మీరైతే మను కాఫీ పెట్టడం చూడండి అక్కా అంటుంది.
ఇంతలో మనోహరి కాఫీలో చక్కెర వేస్తుంటే.. అక్కా ఇప్పుడు బాగా చూడండి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో మీకు అర్థం అవుతుంది అని మిస్సమ్మ చెప్పగానే.. చూస్తున్నాం.. ఏమైంది అక్కడ అని చెప్పగానే.. అయ్యో బాగా చూడండి అక్కా.. మను కాఫీ పెట్టడంలో ఏ తప్పు కనిపించడం లేదా..? అంటుంది మిస్సమ్మ..
అవును ఇంట్లో డబ్బాల మీద పేర్లు ఎప్పటి నుంచి రాశారు అని ఆరు అడగ్గానే ఈరోజు నుంచే.. మను వేస్తుంది షుగర్ కాదు సాల్ట్ అని చెప్తుంది. దాంతో గుప్త బాలిక నువ్వు రోజురోజుకు ఇంత కిరాతకంగా తయారవుతున్నావు అంటాడు. ఇంతలో మనోహరి ఎక్స్ ట్రా షుగర్ వేద్దాం.. తియ్యని కాఫీ తాగి అమర్ ఇంకా ఇంప్రెస్ అవుతాడు అని కాఫీ తీసుకుని అమర్ దగ్గరకు వెళ్తుంది.
చూసి ఎంజాయ్ చేసిన మిస్సమ్మ
మిస్సమ్మ, ఆరు, గుప్త పక్కకు వెళ్లి దాక్కుంటారు. మను ఆయనకు సాల్ట్ కాఫీ ఇస్తుంది.. మిస్సమ్మ తనను ఆపు అంటుంది ఆరు. నేను ఆపను.. ఆయనకు, దానికి పనిష్ మెంట్ ఇవ్వాల్సిందే పైకి వెళ్లి చూద్దాం రండి అని పైకి వెళ్తుంది మిస్సమ్మ. పైకి వెళ్లిన ముగ్గురు కిటికీ దగ్గర నిలబడి చూస్తుంటారు. అక్కా కిటికీ దగ్గర నుంచి చూస్తుంటే భలేగా ఉంది అంటుంది మిస్సమ్మ. మనోహరి కాఫీ తీసుకెళ్లి తీసుకో అమర్ నీకోసం స్పెషల్‌గా చేశాను అని ఇస్తుంది.
అమర్ కాఫీ తాగబోతుంటే.. అమర్ ఇక నుంచి నన్నే కాఫీ అడుగుతావు చూడు అంటుంది మనోహరి. కాఫీ తాగిన అమర్ మొత్తం ఊదేస్తాడు. కిటికీలోంచి చూస్తున్న మిస్సమ్మ హ్యాపీగా గంతులేస్తుంది. ఇప్పుడు నా ఫర్మామెన్స్ చూడండి అక్కా ఇక్కడే ఉండండి అంటూ లోపలికి ఏవండి అంటూ పరుగెడుతుంది. అయ్యో ఏమైందండి.. అంటూ దగ్గరకు వెళ్లి మీకేం కాలేదు కదా..? వాటర్ తాగుతారా..? ఒక్క నిమిషం అంటూ వాటర్ తీసుకెళ్తుంది. ఏవండీ తీసుకోండి తాగండి అని వాటర్ ఇస్తుంది. ఎందుకలా అరిచారు డాడ్ అని అంజు అడుగుతుంది.
శివరాం, నిర్మల నాటకం
కాఫీ అంటూ అమర్ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. శివరాం కాఫీ తాగి ఉమ్మేసి.. ఈ కాఫీ పెట్టిన మాత ఎవరు అని అడుగుతాడు. నేనే అంకుల్ షుగర్ ఏమైనా తక్కువైందా..? అని అడుగుతుంది. షుగర్ ఏంటి కాఫీలో కాస్త ఉప్పు ఎక్కువైంది.. కాదు కాదు ఉప్పులో కాఫీ కాస్త తక్కువైంది అంటాడు శివరాం. ఉప్పా.. ఉప్పు ఎందుకు ఉంటుంది అంటూ మనోహరి ప్రశ్నిస్తుంది. అది మీరే కదా ఆంటీ చెప్పాల్సింది అని అమ్ము అడుగుతుంది. నేను షుగర్ అని రాసి ఉన్న బాక్స్ లోంచే తీసి షుగర్ తీసి వేశాను అని చెప్తుంది.
ఇంతలో మిస్సమ్మ.. నిర్మలకు సైగ చేస్తుంది. ఏంటీ రాసి పెట్టి ఉంటే వేశారా ఆంటీ.. మీకు షుగరుకు సాల్ట్‌కు తేడా తెలియదా.. అని అమ్ము అడుగుతుంది. దాంతో మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో శివరాం, నిర్మల తమ నాటకం మొదలు పెడతారు. అమర్‌కు మనోహరికి ఏంటి సంబంధం.. మనోహరికి ఈ ఇంటికి ఏంటి సంబంధం అంటూ అడుగుతాడు శివరాం. కడదాకా కలిసుండేది మీరైతే మధ్యలో రావడానికి మనోహరి ఎవరు..? అమ్మా మనోహరి నువ్వు మరోసారి రాకు.. నీ పేరు చెప్పి మిస్సమ్మ పనులు తప్పించుకోవాలని చూస్తుంది అని నిర్మల అంటుంది. మీ ఆంటీ చెప్పింది నిజమే మనోహరి. నువ్వు ఇక ఈ గది వైపు కూడా రాకూడదు.. అని చెప్తాడు శివరాం. తర్వాత అందరినీ బయటకు వెళ్లమని మిస్సమ్మ చెప్తుంది. అందరూ వెళ్లిపోతారు.
మనోహరికి మిస్సమ్మ వార్నింగ్
బయటకు వచ్చిన మనోహరికి మిస్సమ్మ వార్నింగ్ ఇస్తుంది. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియడానికి చిన్న శాంపిల్ చూపించాను. ఇకపై నా దగ్గర జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత గార్డెన్‌లో కూర్చున్న ఆరు.. మిస్సమ్మ, నిర్మల, శివరాంల యాక్టింగ్ ను పొగుడుతుంది. ఏం ఫర్మామెన్స్ ఇచ్చారు అని చెప్తుంది.
దీంతో గుప్త పొంచి ఉన్న ప్రమాదం నీకు అవగతం అవ్వడం లేదు అని హెచ్చరించడంతో ఎందుకు గుప్త గారు అలా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఉండటం వల్ల ఆ ఘోర వల్ల సమస్య ఉండేది. ఇప్పుడు ఘోర వెళ్లిపోయాడు కదా.. అంటుంది ఆరు. అది నీ ఊహ మాత్రమే బాలిక అంటాడు గుప్త. ఆరుకి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? మనోహరి మిస్సమ్మను ఎలా దెబ్బతీస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్ 17న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్