Nude Scenes: న్యూడ్‌గా నటించిన టాప్ హీరో.. షాకవుతున్న ఫ్యాన్స్.. స్క్రీన్‌పై నగ్నంగా కనిపించిన యాక్టర్స్ వీళ్లే-nude scenes in movies manoj bajpayee nude scene in despatch actors who went naked in telugu and hindi movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nude Scenes: న్యూడ్‌గా నటించిన టాప్ హీరో.. షాకవుతున్న ఫ్యాన్స్.. స్క్రీన్‌పై నగ్నంగా కనిపించిన యాక్టర్స్ వీళ్లే

Nude Scenes: న్యూడ్‌గా నటించిన టాప్ హీరో.. షాకవుతున్న ఫ్యాన్స్.. స్క్రీన్‌పై నగ్నంగా కనిపించిన యాక్టర్స్ వీళ్లే

Hari Prasad S HT Telugu
Dec 17, 2024 12:03 PM IST

Nude Scenes: న్యూడ్ సీన్లలో నటించడం అంత సులువు కాదు. దీనికి ఎంతో ధైర్యం కావాలి. తాజాగా వచ్చిన ఓ మూవీలో టాప్ హీరోల్లో ఒకరైన మనోజ్ బాజ్‌పాయీ ఓ న్యూడ్ సీన్లో నటించడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. అయితే గతంలోనూ తెలుగుతోపాటు హిందీలోనూ పలువురు హీరోలు ఇలా న్యూడ్‌గా కనిపించారు.

న్యూడ్‌గా నటించిన టాప్ హీరో.. షాకవుతున్న ఫ్యాన్స్.. స్క్రీన్‌పై నగ్నంగా కనిపించిన యాక్టర్స్ వీళ్లే
న్యూడ్‌గా నటించిన టాప్ హీరో.. షాకవుతున్న ఫ్యాన్స్.. స్క్రీన్‌పై నగ్నంగా కనిపించిన యాక్టర్స్ వీళ్లే

Nude Scenes: సినిమాలు రోజురోజుకూ చాలా బోల్డ్ గా రూపొందుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత సెన్సార్ తలనొప్పులు కూడా లేకపోవడంతో సెక్స్, న్యూడ్, మితిమీరిన క్రైమ్ ను విచ్చలవిడిగా చూపిస్తున్నారు. తాజాగా జీ5 ఓటీటీలో వచ్చిన థ్రిల్లర్ మూవీ డిస్పాచ్ (Despatch)లో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయీ పూర్తి నగ్నంగా నటించాడు. దీంతో మరోసారి న్యూడ్ సీన్లపై చర్చ మొదలైంది.

మనోజ్ బాజ్‌పాయీ న్యూడ్ సీన్

డిస్పాచ్ మూవీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా లిప్ లాక్స్, న్యూడ్ సీన్లలో నటించిన మనోజ్ బాజ్‌పాయీ తన అభిమానులను షాక్ కు గురి చేశాడు. విలక్షణ నటుడిగా పేరుగాంచిన అతడు.. ఇన్నాళ్లూ తన నటనతోనే ఆకట్టుకోగా.. ఈ మూవీలో మాత్రం రెచ్చిపోయి సెక్స్ సీన్లలో నటించడం విశేషం. ఓ సీన్లో అయితే ఒంటిపై నూలిపోగు లేకుండా పూర్తి నగ్నంగా కనిపించాడు. ఆ సమయంలో మూవీలో తన గర్ల్‌ఫ్రెండ్ తో సెక్స్ చేస్తూ ఉంటాడు.

ఆ వెంటనే అతన్ని ఇలా వెనుక నుంచి న్యూడ్ గా చూపించడం ఫ్యాన్స్‌ను షాక్ కు గురిచేసింది. మనోజ్ బాజ్‌పాయీ ఏంటి ఇలాంటి సీన్లలో నటించడమేంటన్న చర్చ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచీ నడుస్తోంది. అయితే స్క్రీన్‌పై ఇలా నగ్నంగా నటించడం గతంలోనూ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో చాలాసార్లు జరిగిందే. మరి ఆ యాక్టర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

స్క్రీన్‌పై న్యూడ్‌గా నటించిన తెలుగు స్టార్స్ వీళ్లే

సిల్వర్ స్క్రీన్‌పై నగ్నంగా నటించిన వాళ్లలో తెలుగు స్టార్లు కూడా ఉన్నారు. అందులో అల్లరి నరేష్, సంపూర్ణేష్ బాబు, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు ఉన్నారు. అల్లరి నరేష్ నాంది మూవీ కోసం న్యూడ్ సీన్లో నటించాడు. ఈ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామాలో ఓ చోట విచారణ ఖైదీగా జైల్లో నరేష్ నగ్నంగా కనిపించడం విశేషం.

ఇక క్యాలీఫ్లవర్ అనే మూవీలో సంపూర్ణేష్ బాబు కూడా న్యూడ్ గా కనిపించాడు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా అప్పట్లో వైరల్ అయింది. ఒంగోలు గిత్త అనే మూవీలో ప్రకాష్ రాజ్ కూడా ఓ చోట న్యూడ్ సీన్లో నటించి ఆశ్చర్యపరిచాడు. ఈ సీన్ కోసమే ఆ సినిమాకు ఎ రేటింగ్ ఇచ్చారు. ఇక ఆపరేషన్ దుర్యోధన మూవీలో మరో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా నగ్నంగా నటించాడు. 2003లో వచ్చిన బాయ్స్ మూవీలో తమిళ నటుడు సిద్ధార్థ్ కూడా ఓ చోట నగ్నంగా రోడ్డుపై పరుగెత్తిన సీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈగ మూవీలో నటించిన కన్నడ నటుడు సుదీప్ కూడా ఓ సీన్లో నగ్నంగా నటించాల్సి వచ్చింది.

బాలీవుడ్ స్టార్లు కూడా..

బాలీవుడ్ స్టార్లు కూడా పలు సందర్భాల్లో స్క్రీన్ పై నగ్నంగా కనిపించారు. అందులో ఎక్కువసార్లు ఇలాంటి సీన్లు చేసిన హీరో మాత్రం రణ్‌బీర్ కపూరే. అతడు నటించిన తొలి సినిమా సావరియాతోపాటు బేషరమ్, యానిమల్, సంజూ సినిమాల్లో నగ్నంగా కనిపించాడు. ఇక పీకే మూవీ కోసం ఆమిర్ ఖాన్ రేడియో పట్టుకొని కనిపించే సీన్ అప్పట్లో ఓ పెద్ద సంచలనం.

విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్.. లవ్ సెక్స్ ధోకా, షాహిద్, ఒమెర్టా సినిమాల కోసం న్యూడ్ సీన్లు చేశాడు. బేఫిక్రే మూవీలో రణ్‌వీర్ సింగ్, న్యూయార్క్ మూవీలో జాన్ అబ్రహం, జైల్ మూవీ కోసం నీల్ నితిన్ ముకేష్, బాబీ మూవీలో రిషీ కపూర్, సత్యం శివం సుందరం మూవీలో జీనత్ అమన్, రామ్ తేరీ గంగా మైలీలో మందాకిని, పార్చ్‌డ్, ది వెడ్డింగ్ గెస్ట్ మూవీల్లో రాధికా ఆప్టేలాంటి వాళ్లు తెరపై నగ్నంగా కనిపించారు.

Whats_app_banner