DNA Test for VSR: సాయిరెడ్డిపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్‌మోహన్ డిమాండ్, మంత్రి నారా లోకేష్‌కు వినతి
DNA Test for VSR: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఎంపీ విజయసాయిరెడ్డి, అడ్వకేట‌్ సుభాష్‌లపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్‌మోహన్ మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.అక్రమాలను బయటపెట్టినందుకు తనను బదిలీ చేయించారని ఆరోపించారు.వందల కోట్ల భూములు అన్యాక్రాంతం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
DNA Test for VSR: విజయసాయి రెడ్డిపై పోరాడుతున్నందుకు తనను ఏపీ నుంచి బదిలీ చేయించారని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేవారు. తన భార్యను లోబర్చుకొని రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టారని, సాయిరెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి వాస్తవాలు నిగ్గుతేల్చాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ ప్రజాదర్బార్ కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నానని, ఎంపీ విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.
2022-23 మధ్య తనను ఏమార్చి అమెరికా పంపిన ఎంపీ విజయసాయి రెడ్డి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారని ఆరోపించారు. తాను స్థానికంగా లేని సమయంలో బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని గట్టిగా విశ్వసిస్తున్నానని, తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించానని లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేది విజయసాయిరెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రూ.20కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిందని వినతి పత్రంలో పేర్కొన్నారు.
కుంచనపల్లిలో రూ.4కోట్ల విలువైన విల్లాతో పాటు జగన్ ఇంటి సమీపంలో రూ.3కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విజయసాయి కుట్రతో కోల్ కతా బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించాలని మదన్ మోహన్ వివరించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ మదన్‌మోహన్‌కు హామీ ఇచ్చారు.
సంబంధిత కథనం