Animals in Astrology: కుండలి దోషం, గ్రహాల కదలికలను బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఇలా చేస్తే సమస్యలన్నీ తీరుతాయి
Animals in Astrology: శుక్రుడి ప్రశాంతత కోసం గోపూజ లేదా గోదానం చేయాలి. బుధుడు, శుక్రుడితో పాటు ఉంటే అది చిలుకను సూచిస్తుంది. రాహు లేదా కేతువు శుక్రుడితో ఉంటే సర్పదోషం లేదా సర్ప శాపాన్ని కలిగి ఉంటారు. దీనితో పాటు సూర్యుడు, శుక్రుడి స్థానం ముఖ్యమైనది అవుతుంది.
జ్యోతిషశాస్త్రంలో పంచ పక్షి శాస్త్రం అనే ఒక వ్యవస్థ ఉంది. పురాతన చిలుక శాస్త్రం నేటికీ ప్రచారంలో ఉంది. జ్యోతిషశాస్త్రంలో కుక్క ముఖ్య స్థానంలో ఉంది. శని, రాహు, కేతువులకు కుక్క ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే, దీనితో పాటు పుట్టిన కుండలిలోని 8వ ఇంటిని గుర్తించాలి. అప్పుడు 8వ ఇంటి అధిపతి స్థానం తెలుసుకోవాలి. వీటితో పాటు రాహు, కేతువుల అమరికలో గ్రహాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఇలా చేస్తే సమస్యలు తీరుతాయి
శుక్రుడి ప్రశాంతత కోసం గోపూజ లేదా గోదానం చేయాలి. బుధుడు, శుక్రుడితో పాటు ఉంటే అది చిలుకను సూచిస్తుంది. రాహు లేదా కేతువు శుక్రుడితో ఉంటే సర్పదోషం లేదా సర్ప శాపాన్ని కలిగి ఉంటారు. దీనితో పాటు సూర్యుడు, శుక్రుడి స్థానం ముఖ్యమైనది అవుతుంది. రాహువు మూడవ ఇంటిలో మాత్రమే మంచి సానుకూల ఫలితాలను ఇస్తాడు. లేదంటే ప్రతికూల ఫలితాలను మాత్రమే ఇస్తాడు.
కుండలి దోషం, గ్రహ కదలికలను బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలి?
రాహువు సూర్యుడితో ఉంటే కుటుంబ పెద్దల ఆరోగ్యంలో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా కుటుంబంలోని వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల ఇంట్లో పెంచే కుక్కలకు వర్షం, గాలి వంటి వాటి వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలను దూరం చేసుకోవచ్చు.
కేతువు సూర్యుడితో ఉంటే కుటుంబ పెద్దల జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి. అందువల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.
చంద్రుడితో పాటు రాహువు ఉంటే కుటుంబంలోని వృద్ధ మహిళలకు మనశ్శాంతి ఉండదు. మనస్సులో ఒక విధమైన భ్రమ ఉంటుంది. ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. కాబట్టి నల్ల కుక్కకు ఉదయాన్నే పాలు, ఇతర ఆహారం ఇస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
కేతువు చంద్రుడితో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు కానీ మనస్సులో ఎప్పుడూ త్యాగం అనే భావన ఉంటుంది.
రాహువు, అంగారక గ్రహంతో ఉంటే మనసును అదుపులో పెట్టుకోలేరు. సోదరుల జీవితంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో శాంతి, ప్రశాంతత ఉండదు. కాబట్టి జీవితం సరైన మార్గంలో సాగాలంటే రోడ్డు పక్కన ఉన్న కుక్కలకు ఆహారం పెట్టండి.
కేతువు కుజ గ్రహంతో ఉంటే ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఎలాంటి టాలెంట్ ఉన్నా తమ పని కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు గోధుమ రంగు కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది.
బుధుడితో రాహువు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే విద్యార్థులకు పెద్దల సహాయం అవసరం. ఆర్థిక విషయాల్లో ఇతరుల సహాయం అవసరం.
రాహువు బృహస్పతితో ఉంటే అనారోగ్యానికి గురవుతారు. కుక్కపిల్లలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
కేతువు బృహస్పతితో ఉంటే మనసులో కోరికలు, ఆకాంక్షలు ఉండవు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా జీవించాలనుకుంటారు. అందువలన అందరితో ఆనందంగా జీవించడానికి, మనస్సులోని ఆందోళనను తొలగించి, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కుక్కల సంరక్షణ కేంద్రానికి విరాళం ఇవ్వడం వంటివి చెయ్యచ్చు.
రాహువు శుక్రుడితో ఉంటే స్త్రీలకు అశుభ ఫలితాలు కలుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది. కొత్తగా పుట్టిన కుక్కపిల్లలను పెంచుకుంటే లోపం తీరుతుంది. అవకాశం ఉంటే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది.
కేతువు శుక్రుడితో ఉంటే ఏ సమస్యా ఉండదు. రాహువు శనితో ఉంటే ఏ సమస్యా ఉండదు.
కేతువు శనితో ఉంటే ఏ పనీ చేయడానికి ఇష్టపడరు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కాబట్టి నలుపు తెలుపు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మనసు మారుతుంది. పని మీద ఆసక్తి పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం