Diabetes: డయాబెటిస్ పేషెంట్లు ఈ 5 వెజిటబుల్స్ తిన్నారంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉండడం ఖాయం-diabetes patients eat these 5 vegetables to keep sugar levels under control ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ పేషెంట్లు ఈ 5 వెజిటబుల్స్ తిన్నారంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉండడం ఖాయం

Diabetes: డయాబెటిస్ పేషెంట్లు ఈ 5 వెజిటబుల్స్ తిన్నారంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉండడం ఖాయం

Haritha Chappa HT Telugu
Dec 17, 2024 11:00 AM IST

Diabetes: డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధి. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల వస్తుంది. మీకు కూడా డయాబెటిస్ ఉంటే కొన్ని రకాల కూరగాయలను మీ ఆహారంలో భాగం చేసుకోండి.

డయాబెటిస్ ఉంటే తినాల్సిన కూరగాయలు
డయాబెటిస్ ఉంటే తినాల్సిన కూరగాయలు (shutterstock)

మధుమేహం ఉన్నవారు ప్రత్యేకమైన ఆహారాన్ని తినాలి. డయాబెటిస్ అనేది ఒక జీవనశైలి వ్యాధి. సరైన లైఫ్ స్టైల్ పాటించకపోవడం వల్ల వచ్చే వ్యాధి ఇది. చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల డయాబెటిస్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. ఈ వ్యాధి వచ్చని వారిలో శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయలేదు. లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించకోకపోవడం వల్ల కూడా ఇది వస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర పేరుకుపోతుంది. డయాబెటిస్ వ్యాధి వల్ల ఇతర రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు కూడా డయాబెటిస్ రోగం ఉంటే ఈ కూరగాయలను మీ ఆహారంలో చేర్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

డయాబెటిస్ లక్షణాలు

డయాబెటిస్ వ్యాధి వచ్చిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా..

- నీళ్లు తాగుతున్నా కూడా అధికంగా దాహం వేయడం

- రోజులో ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం

- ఆకలి అధికంగా వేయడం

- త్వరగా బరువు తగ్గిపోవడం

ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

తినాల్సిన 5 కూరగాయలు

క్యారెట్

డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తమ ఆహారంలో అయిదు రకాల కూరగాయలు డైట్ లో చేర్చుకోవాలి. డయాబెటిస్ రోగులు క్యారెట్ ను తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు. క్యారెట్లలో ఉండే పోషకాలు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. క్యారెట్లలో విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లలో తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. దీనిలో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియ, రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

పాలకూర

డయాబెటిస్ రోగులు పాలకూరను వారి ఆహారంలో చేర్చడం వల్ల ప్రయోజనం పొందుతారు. పాలకూరలో ఉండే ఐరన్, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ వంటి అనేక పోషకాలు శరీరంలో చేరుతాయి. అవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. పాకూరలో కేలరీలు తక్కువగా ఉండి శరీరానికి తగిన పోషణను అందిస్తాయి. పాలకూరలో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు, అధిక ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

టర్నిప్

టర్నిప్ కూర టేస్టీగా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాల కారణంగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టర్నిప్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బీట్ రూట్

బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరానికి శక్తిని అందించడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాదు బీట్ రూట్ లో ఉండే అనేక పోషకాలు డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తాయి. బీట్ రూట్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉండే మాంగనీస్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.

కాకరకాయ

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ తినడం అత్యవసరం. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ప్రతి రెండు రోజులకోసారి కాకరాకయ తినాల్సిన అవసరం ఉంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner