Parenting Tips: ఇతరుల ముందు పిల్లలతో ఇలా ప్రవర్తించకండి, వారి మనసు దెబ్బతింటుంది
Parenting Tips: ఇంటికి వచ్చిన అతిథుల ముందు లేదా బయట ప్రదేశాల్లో అందరి ముందు మీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇది వారి మనసును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇతరుల ముందు పిల్లల విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు.
పిల్లల మనసులు చాలా మృదువుగా ఉంటుంది. వారి భావోద్వేగాలు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు ప్రతి విషయాన్ని చాలా ఆలోచనాత్మకంగా చేయాలని పేరెంటింగ్ నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ చాలాసార్లు తల్లిదండ్రులు అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది పిల్లల సున్నితమైన మనస్సులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. చాలా మంది తల్లిదండ్రులు ఇంటికి వచ్చే అతిథుల ముందు పిల్లల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. బయటవారి ముందు పిల్లలతో ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బయటి వారి ముందు పిల్లలతో ఎలా ప్రవర్తించకూడదో ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి.
చదువు విషయంలో
ఇంటికి వచ్చే అతిథుల ముందు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి తక్కువ చేసి మాట్లాడడం వంటివి చేయకూడదు. మీరు అలా చేయడం వల్ల పిల్లల మనోధైర్యం దెబ్బతింటుంది. మీ పిల్లవాడు ఒక సబ్జెక్టులో పేలవమైన ప్రతిభ కనబరిచినా, ఇతర సబ్జెక్టుల్లో బాగా రాణిస్తే, అతిథుల ముందు అతని కృషిని అభినందించండి. అంతేకాదు ఏ సబ్జెక్టు రాదో దాని గురించి మాట్లాడకండి.
చాలా మంది తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లల శారీరక రూపం గురించి వ్యాఖ్యానిస్తారు. అలా చేయడం ద్వారా పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అలాంటి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పిల్లలు సన్నగా ఉన్నారని, లావుగా ఉన్నరని ఇతరుల ముందు కామెంట్ చేయకండి. తల్లిదండ్రులే అలాంటి మాటలు మాట్లాడితే పిల్లలు తమ బాధ ఎవరికి చెప్పుకుంటారు. మీ పిల్లలు స్మార్ట్ గా, ఆరోగ్యంగా, తమ కోసం మంచిగా కనిపించాలంటే పౌష్టికాహారం తినిపించండి.
పిల్లలను తిట్టడం మానుకోండి
పిల్లల ఎదుగుదల కోసం, అతను తప్పు చేసినప్పుడు ఎప్పటికప్పుడు గట్టిగా చెప్పడం అవసరం. కానీ అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వారిని తిట్టకండి. పిల్లలను తిట్టడం, వారి తప్పులను అందరి ముందు ప్రస్తావించడం మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గి అభద్రతా భావానికి లోనవుతారు. పిల్లలు తప్పులు చేసినప్పుడు వారికి ఎల్లప్పుడూ ప్రేమతో చెప్పాలి.
ఇతర పిల్లలతో పోల్చవద్దు
ఇంట్లో అతిథుల ముందు మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చవద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది పిల్లల మనస్సులో న్యూనతా భావాన్ని సృష్టిస్తుంది. ప్రతి బిడ్డకు భిన్నమైన లక్షణాలు ఉన్నాయని గుర్తుంచుకోండి.
కోపం వద్దు
కోపం అనేది ఒక సాధారణ మానవ భావోద్వేగం. మీరు కలత చెందినప్పుడు ఇది రావడం సాధారణం. కానీ మీరు మీ కోపాన్ని పిల్లల ముందు వ్యక్తం చేస్తున్నప్పుడు, ఈ కోపం కొన్నిసార్లు ప్రతికూలంగా కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ప్రతిసారీ మీ పిల్లలపై కోపం రావడం పిల్లల మనస్సులో మీకు భయాన్ని కలిగిస్తుంది. అటువంటి పిల్లవాడు మీతో మాట్లాడటానికి అసౌకర్యంగా భావిస్తారు.
టాపిక్